Saturday, August 29, 2020

Teenage homes

 _**టీనేజ్ హోమ్స్**_ 😎


వోల్డేజ్ హోమ్స్ తో పాటు ఇప్పుడు కొత్తగా టీనేజ్ హోమ్స్ రాబోతున్నాయ్.


షాకవుతున్నారా? అప్పట్లో వోల్డేజ్ హోమ్స్ వచ్చినప్పుడు కూడా ఇలాగే షాకయ్యారు. కాని, ఇప్పుడు అవి నార్మల్. ఇంతకూ ఈ టీనేజ్ హోమ్స్ కథా కమామీషు ఏంటి ??????????


నమస్తే సార్ .


నమస్తే –రండి కూర్చోండి.

మీరు ప్రారంభించిన హోమ్ ఫర్ ది టీనేజ్డ్ గురించి తెలుసుకోటానికి వచ్చాను సార్ .


వెల్కం. అబ్బాయా అమ్మాయా ?


ఇద్దర్నీ జాయిన్ చేస్తా...


ఇద్దరికీ నెలకు యాభై వేలు కట్టాలి.


ఓకే సార్ .కట్టేస్తాం.


ఇంతకూ వాళ్ళ ప్రాబ్లెం ఏమిటి?


మామూలే .. ఘర్ ఘర్ కీ కహానీ...


అంటే?


ఇద్దరూ సెల్ ఫోన్ వదలటం లేదు.


అంటే......? ఉదయం లేచిన దగ్గర్నుంచీ రాత్రి వరకూ ఫోన్ వాడుతూనే ఉంటారా?


అలా చేస్తే మాకు ప్రాబ్లెం ఏముంది?అసలు నిద్రే పోవటం లేదు.


అంటే.......? రాత్రుళ్ళు ఎన్నింటి వరకూ మేలుకుoటున్నారు?


ఎన్నింటి వరకూ ఏమిటి నా శ్రాద్ధం. అసలు నిద్ర పోతేగా?


ఓహో......అర్ధమయింది. అసలు నిద్రపోకుండా 24 గంటలూ ఫోన్ వాడుతూనే ఉంటారన్న మాట.


అవును.


మధ్యలో ఫోన్ చార్జింగ్ కోసమైనా దూరంగా ఉండరా?


అందుకే రెండు ఫోన్లు వాడుతున్నారు.


ఫోన్లు లాక్కో పోయారా?


మంచిగున్నారు. మొన్న మావాడి ఫోన్ లాక్కుంటే నామీద కత్తితో ఎటాక్ చేసాడు.


ఓహో వయొలెన్స్ సిండ్రోమ్ అన్నమాట .మాదగ్గర దానికి ట్రీట్మెంట్ వుంది.


అలాగే  ఫోన్ వాడద్దని వాళ్ళమ్మ మందలించేసరికి మా అమ్మాయ్ ఇల్లు వదలి వెళ్ళిపోయింది. వారం రోజుల పాటు వెతికాక వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో దొరికింది. బలవంతంగా ఇంటికి తీసుకొస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది నా తల్లి దండ్రులు నన్ను ఆత్మహత్యకు పురిగొల్పుతున్నారు అని. పోలీసులు కేస్ రిజిస్టర్ చేసారు. వాళ్ళను వదిలించుకోటానికి రెండు లక్షలు ఖర్చయింది. అప్పటినుంచీ ఎందుకైనా మంచిదని మా ఇంట్లో మా రక్షణ కోసం ఒక బౌన్సర్ ని పెట్టుకున్నాం.  బౌన్సర్ కీ ముప్పై వేలు జీతం.


మరి అదే కంటిన్యూ చేయక పోయారా?

ఇప్పటికే ఆ బౌన్సర్ కోసం ,పోలీసుల కోసం, ఇద్దరు పిల్లల ఫోన్ల కోసం, రీచార్జ్ కోసం మా ఇంట్లో సగం పోర్షన్ అమ్మేసాం.మిగతాది కూడా అమ్మితే మేము రోడ్ న పడతాం.


ఓకే. అర్ధమయింది. కాని మా ఫీజ్ ఎలా కడతారు మరి?


మీకు కట్టటానికి మా ఇంటి మీద బాంక్ లోన్ తీసుకున్నాం..


గుడ్...... రేపే మీ పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేసేయండి.


మేమెలా తీసుకొస్తాం? ఇక్కడికి తీసుకొస్తామని తెలుస్తే వాళ్ళు అన్నంలో పురుగుల మందు పెట్టి మమ్మల్ని చంపేస్తారు.


ఓకే.... .అయితే మా సెక్యూరిటీ వాళ్ళను పంపిస్తాం. వాళ్ళు తాళ్ళతో కట్టేసి తీసుకొస్తారు. అలా రిస్క్ తీసుకుంటున్నందుకు  ఇంకో పాతిక వేలు  కట్టాలి.


అంత సీన్ అవసరం లేదు . మా పిల్లలు రాత్రి పన్నెండు నుంచి తెల్లారు జామున నాలుగింటివరకూ వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ తో చాటింగ్ చేస్తూంటారు. ఆ టైములో వాళ్లకు సృహ వుండదు. ఈజీగా ఎత్తుకొచ్చి మీ వాన్ లో పడేయవచ్చు.

అలా అయితే పదివేలు కట్టండి చాలు.


ఇంతకూ మీరు వాళ్ళను మళ్ళీ ఆ మెషిన్ లైఫ్ నుంచి మనిషి లైఫ్ లోకి ఎలా తీసుకొస్తారు?


ముందు వాళ్ళను సెల్ ఫోన్ డి –ఎడిక్షన్ హాస్టల్ లో పెడతాం. అక్కడ రకరకాల ట్రీట్మెంట్ ఇస్తాం. మా సైఖియాట్రిస్ట్ వాళ్లకు మైల్డ్ షాక్స్ ఇస్తాడు.  తరువాత, వాళ్లoదర్నీ ఒక హాల్లో కూర్చోబెట్టి ఫోన్ లేకుండా ఎలా మాట్లాడు కోవాలో నేర్పిస్తాం. ఆ తరువాత, ఆటలు, పాటలు నేర్పిస్తాం. జంతువులు ఫోన్లు లేకుండా ఎంత హాపీగా ఉంటున్నాయో డాక్యుమెంటరీలు చూపిస్తాం. పాత కాలంలో ఫోన్లు లేనప్పుడు ప్రజలు ఎంత హాపీగా కలసి మెలసి వుండేవారో మూవీస్ ద్వారా చూపిస్తాం. తల్లిదండ్రుల్ని బంధువులను ఎలా గుర్తు పట్టాలో ట్రైనింగ్ ఇస్తాం. డమ్మీ తల్లిదండ్రుల్ని ఎరేంజ్ చేసి వాళ్ళు ఎంతగా పిల్లల్ని ప్రేమిస్తారో ట్రయల్ రన్స్ ఇస్తాం. ఫోన్ లేకపోయినా మనం బతకవచ్చు అనే ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ చూపిస్తాం...


ఒక డౌట్ సార్ .


ఏంటది.?


ఒకవేళ అప్పటికీ పిల్లలు మారక పోతే?


అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను వేరే హోమ్ లో చేర్చుకుంటాం.


ఎందుకు?


అలాంటి రిపేర్ కి పనికిరాని పిల్లలతో ఎలా శేష జీవితం గడపాలో తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇస్తామన్న మాట. దానికి ఫీజ్ తీసుకోము. ఫ్రీ.

ఎందుకంటే, అప్పటికే వాళ్ళు, పొలాలు, స్థలాలు, ఇల్లు అమ్ముకొని అరిపోయి వుంటారు గనక.


🤣🤣🤣🤣😮😮😜😎😎

Sunday, August 23, 2020

కులనిర్మూలనలో వివాహ వ్యవస్థ పాత్ర

 కులనిర్మూలనలో వివాహ వ్యవస్థ పాత్ర

<<<<<<<<>>><<<<<>>>>>>>>>>>>>>>>

                - -రాములు జి. 


  భారత సమాజం కుల-వర్గ సమాజమని

అర్థమైతేనే ,ఈ సమాజ సమూల మార్పుకు కావల్సిన పథకం రూపొందించుకోగలరు. 

     రోగనిర్థారణ చేయలేని డాక్టర్ జబ్బు నయం చేయడమెంత కష్టమో ,ఇది అంత కంటే కష్టం.

   ఇంగ్లీషోడు వచ్చేదాక మసుధర్మ శాస్త్రమే మనరాజ్యాంగం.వంద సంవత్సరాలక్రితం

దాకా 85% గా వున్న శూద్రజనాలు చదువు సంపదకు దూరం చేయబడ్డారు.

         ఈ రోజు మన సమాజంలో సంపన్నులంతా దాదాపు అగ్రకులాలనుండి,పేదలంతా దాదాపు శూద్ర,అతిశూద్రకులాల నుండి వుండటానికిదే కారణం.

   కులం ఆర్థికంగాదోపిడి చేసే వర్గానికి “పెట్టనికోట” వలె ఉపయోగపడుతుంది.

అగ్రకుల సంపన్న పాలక వర్గాలు కులాన్ని కాపాడుకోడం సహజమే.

   ఇప్పటికి కులవ్వవస్థ ఎంతో బలంగా వుంది.స్వకుల వివాహాలు కట్టుదిట్టంగా 

అమలు కావడాన్ని బట్టి దీని శక్తి అర్థం చేసుకోవచ్చు.విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు సహితం అక్కడైనా,లేదాస్వకులవివాహం కొరకే మన దేశానికి రావడం సర్వ సాదారణమని మనందరికి తెలుసు.ఎవరోకొందరు తెగించికులాంతర వివాహాలు చేసుకుంటే నిర్దాక్షిణ్యంగా చంపుతున్నది మనం చూస్తున్నాం.కూటి కి పేదనైనంత మాత్రానకులానికి పేదనా?

అనేది నరనరాన ఇమిడివుంది.

         స్వకుల వివాహావ్యస్థ కొనసాగినంతకాలం కులమనేది మిగిలేవుంటుంది.కులమున్నంతకాలం,కులోన్మాదం.కులఅస్థిత్త్వం,కులతత్వం, కులచైతన్యం అనివార్యం.

   కులాన్ని బలహీన పర్చడం శ్రామికజనాలకు అత్యవసరం. కులం బాధితులను ఐక్యం కాకుండా చేస్తుంది.

  సమాజపురోగమనానికి అడ్డంకిగా మారింది. ఈ కులం ఏ పునాది పై నిర్మించబడిందో  అర్థమైతేనే ,ఎలా నిర్మూలించాలో కూడ అర్థమవుద్ది.కులవ్యవస్థకు మూలం /పునాది వివాహ వ్యవస్థే.

   అదెలానో చూద్దాము.


వివాహ వ్యవస్థ నేపద్యం:—-

>>>>>>>>>><<<<<<<<<<<<<<<


 వివాహా వ్వవస్థ ( ప్రత్యేకించి పితృస్వామిక వ్యవస్థ) కు ముందు కులవ్యవస్థ వుండే అవకాశం లేదు.

   ఆదిమ మానవులు గుంపులుగా నివసించినప్పుడు ,కులమున్నఆదారాలు లేవు.సంతానానికి తల్లి మాత్రమే తెలుసు ,తండ్రెవరో తెలువని మాతృస్వామ్య వ్యవస్థ లో కులమున్న ఆదారాలు లేవు.


ఒక భర్త అనేక మంది భార్యల వ్యవస్థలు కొంత కాలం వున్నవి. ఆతర్వాతనే పితృస్వామ్య వ్యవస్థ గా ,కాల గమనంలో దంపతి వివాహావ్యవస్థ గా రూపాంతరం చెందింది.చాల అరుదుగా పరిమితంగా పురుషుడు ఒకరిద్దరిని అధనంగా పెళ్లి చేసుకున్నా,    పితృస్వామిక వ్యవస్థలో బాగంగా పరిగణించవచ్చు.

  , దంపతీవివాహ వ్యవస్థ వచ్చిన తర్వాతనే కులవ్యవస్థ స్థిరపడింది. 

  అందుకే కులం ప్రారంభమైందీ వివాహా వ్యవస్థ తో, కొనసాగేది స్వకుల వివాహాలతో, రేపు కొనసాగ బోయేది ఈ వివాహా వ్వవస్థ తోనే.


ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలభిప్రాయాలు

<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>


ప్రముఖ విదేశీ సామాజిక శాస్త్రవేత్తలు ‘కేల్కర్ ‘మరియు ‘రిస్లే ‘ లు కులానికి వివాహానికున్న సంబందాన్ని ఎలా చెప్పారో చూద్దాం.

కేల్కర్ ప్రకారం” కులం అంటే రెండు లక్షణాలు.

 కుల సభ్యత్వం ఆ కులం లో పుట్టిన, పుట్టబోయే వారికి వర్తిస్తుంది

      ఒక కులం వారు  ఎట్టి పరిస్థితుల్లోను వేరే కులం వారిని    పెళ్లి చేసుకోకూడదు.

   

  ఇక.  సర్ హెర్ బర్డ్ రిస్లే  చెప్పిన దాని ప్రకారం” స్వకుల వివాహాలు మాత్రమే చేసుకునే,    ఒకే పురుషుడితో చలామణి అయ్యే ఆ కుటుంబాలు లేదా ఆ బందుత్వ    సదర్మ సమూహాలే కులం.”

    కుల నిర్మూలనకు వివాహావ్యవస్థకున్న సంబందాన్ని గుర్తించే డా.అంబేద్కర్ స్వకుల వివాహాలు తిరస్కరించాలన్నాడు.

“బాహ్య వివాహాలు ఒక నియమమైతే కులమస్యే మిగలదు” అంటాడు అంబేద్కర్.ప్రఖ్యాత సామాజికవేత్తలంతా 

వివాహావ్యవస్థ తోనే కుల వ్యవస్థ కొనసాగుతుందని విశ్లేషించారు. అదనంగా అంబేద్కర్ కుల నిర్మూలనకు కార్యాచరణ పధకం సూచించాడు. అదే “కునిర్మూలన” పుస్తకం.

    “కుల నిర్మూలన “ విశిష్టత కూడా అదే. ఆ పుస్తకంలో ఈ సందేశమేకీలకం.

.అదే లేక పోతే ,ఆపుస్తకానికంత ప్రత్యేకతే లేదు. అది మహత్తరమైందిగా చరిత్ర లో నిలిచి వుండక పోయేది.


ఎలాంటి వివాహాలు సరైనవి?

<<<<<<<<<>>>>>>>>>>>>>>>>


   కుల నిర్మూలన జరగాలంటునే కార్యాచరణ పై,చిన్నచిన్న విషయాల పై అనవసర రాద్దాంతాలు చేసు కోవడం సరైంది కాదు.

   దళితులను దళితేతరులు వివాహం చేసుకుంటేనే కులాంతరమని కొందరంటే,

బహుజన కులాలమద్య జరిగితేనే కులాంతరమని కొందరంటే,

బహుజనులు అగ్రకులాల మద్య జరిగి తేనే అని కొందరంటే ,ఉపకులాల మద్య జరితేనే అని కొందరంటూ జనాలను “కన్ ప్యూజ్” చేయడం తప్ప మరేమి కాదు.

కులాంతర వివాహాలు ప్రోత్సహించాలనుకున్న వారిని, వివాహంచేసుకుందామను కునే వారిని నిరుత్సాహ పరుస్తది.

    మనమిచ్చే నినాదం ఎక్కువమందిని కలుపుక వచ్చేదిగావుండాలి.కాని దూరం పెంచేదిగా వుండేది వుండకూడదు.

కులనిర్మూలనా కార్యచరణ ముందుకు పోయేలా ,త్వరితపరిచేలా వుండాలి.

      బాహ్య వివాహాలు నియమం అయితే కులం మిగలదన్నదానిని కార్యాచరణ నినాదంగామార్చితే “ నీ ఒక్కకులం లో తప్ప ఏ కులం అయినా ఫర్వాలేదు”   అని బావించ వచ్చు .

    భారతసమాజం వందల  కులాలు, ఉపకులాలు గా చీలి వుంది.ఇందులో ఏ కులం ఇంకో కులం తో సమానం కాదు.

ఉపకులాల మద్య కూడా తీవ్ర అంతరాలున్నవి. అందుకే ఒక్క తమ కులం లో తప్ప మరేకులమైనా కులాంతరమే . అలా జరుగుతే వచ్చే జనరేషన్ కే కులముండదు. కులం పోవడమంటే ,ఫ్యూడల్ అవశేషం లేదా కులసమాజం అంతరించడమన్న మాట.

అప్పుడు మిగిలేది వర్గసమాజం లేదా పాశ్చాత్య బూర్జువా సమాజం లాంటి వ్యవస్థ.మన బ్రహ్మణీయ అమానుష వ్యవస్థ కంటే నయమే. ఇది జరగాలంటే పెద్ద సాంస్కృతిక విప్లవం జరగాలి. యూరపు లో జరిగినట్లు పునరుజ్జీవనోద్యమాలు,సంస్కరణోద్యమాలు,పారిశ్రామికవిప్లవాలు జరగాలి.అక్కడి బూర్జువా వర్గాలే ఈ విప్లవాలకు నాయకత్వం వహించాయి. 

       కాని మన దేశం లో వున్న పచ్చి మనువాదప్రతీప శక్తులు ఎలాంటి ప్రగతి శీల మార్పునైనా అడ్డుకుంటూ వస్తున్నాయి. 

      ఈ దేశంలో శ్రమ విభజనే కాదు ,శ్రామికుల విభజన కూడా వుంది. కుల వ్యవస్థ యే శ్రామికులను విభజిస్తున్న ప్రధాన అంశంగావుంది. 


 నంబూద్రీపాద్ ఎం చెప్పారు?

<<<<<<<<>>>>>>>>>>      


 కులాన్ని  బలహీన పర్చాల్సిన అవసరం గురించి ప్రముఖ కమ్యూనిష్టు నాయకుడు నంబూద్రీపాద్ చెప్పింది చాల ప్రాధాన్యత కలిగిందో చూద్దాం”భారత దేశాన్ని ఆధునిక లౌకిక మార్గం లో నిర్మించాలంటే కుల ఆధారిత హిందూ సమాజానికి, దాని సంస్కృతికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయవలసిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసి ఉంది. భారతదేశ దీర్ఘకాల నాగరికత సంస్కృతి, కులాల వారీ వ్యవస్థగా చీలి పోయిన సమాజపు కోటను ధ్వంసం చేయకుంటే, సోషలిజం మాట ఎలా ఉన్నా లౌకిక ప్రజాస్వామ్యం గురించి కూడా మాట్లాడలేము. ఇంకొక ఈ విధంగా చెప్పాలంటే కుల వ్యవస్థ గల సమాజంకు వ్యతిరేకమైన పోరాటం నుండి ప్రజాస్వామ్యం సోషలిజం కోసం జరిగే తీవ్రమైనపోరాటాన్ని విడదీయలేము-  ఇ.యం.యస్. నంబూద్రిపాద్, 1979( కుల సమస్య- అవగాహన, విశ్లేషణ, పేజి 129)


కులాంతర వివాహాల ప్రాదాన్యత

<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>


   కులాన్నెంత బలహీనపరిస్తే , వర్గ ఐక్యత అంత బలపడుతుంది. కులాన్ని బలహీనపరిచే శక్తి కులాంతర వివాహాలకు తప్ప దేనికి లేదు.

      కాని  వర్గాన్ని వదులుకోగలిగినంత సులువుగా  అభ్యుదయవాదులు కూడా    కులాన్ని వదిలుకోలేక పోతున్నారు. ఆచరణకొస్తే తమ కులాల్లోనే ఒదిగి పోతున్నారు.

 మన సమాజం లో ఆధునికులం అనుకునే వారు ,ఏ నాడు భారత గడ్డ మీద అడుగు పెట్టని ప్రవాసభారతీయులు కూడా ,తమజీవితబాగస్వాముల్ని తమ కులం లోనే వెతుక్కోవడం కోసం తిరిగి భారతదేశం వస్తున్నారంటే ,కుల వివాహ బందాన్ని అంచనా వేయవచ్చు.

 ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లో నిస్సిగ్గుగా  కులాల వారి మార్టీమోరియం ప్రకటనలు,వివాహాపరిచయ వేదికలు చూస్తునాం. స్వకుల వివాహాలే దర్మంఅయినట్లు, కులాంతరమయితే అదర్మం,అనాచారం,దుష్ట సంప్రదాయమైనట్లు తరతరాలుగా చలామణిలో వుంది.కులాంతరవివాహాలు చేసుకుంటే మరణశిక్ష వేయాలనేది మను దర్మం 1 వ స్మృతి 64 వ శ్లోకం చెపుతుంది.

  తమ రక్తసంబందీకులునైనా చంపడానికి అసలు కారణం కులాంతర వివాహాలు తప్పని బావించడమే .అందువలననే

స్వకుల వివాహాలు తప్పని బావించడం లేదు.మనువాద శాసనాన్ని ఉల్లంఘించ లేక పోతున్నారు. కులమంటే రక్తసంబందీకుల సామాజిక    సమూహమని గుర్తించ లేకపోతున్నారు.

రక్త సంబందికుల వివాహం అనారోగ్యమని సిసియంబి,కొలంబియా యూనివర్సిటీల పరిశోదనలు పరిగణలోకి తీసుకోబడటం లేదు.కులాంతర వివాహాలు జాతి ప్రయోజనాలకే అన్న సుప్రీం కోర్టు ను పట్టించుకోవడం లేదు.

  ఇప్పుడు జరుగుతున్న కులాంతర వివాహాలు యువతి యువకులు తమకు  తాము ప్రేమించుకొని   చేసుకుంటున్న ప్రేమవివాహాలే . విప్లవోద్యమాలను త్వరితపర్చడానికి కులాంతర వివాహాలు ఉద్యమం లో ఒక ఉద్యమంగా జరగడం లేదు.   మిగతా ఇతర పార్టీలతో పోల్చుకున్నప్పుడు కమ్యూనిష్టులు నయమే. కాని అవి   పార్టీ కార్యక్రమ లో బాగం లా జరగడం లేదు.జరిగే కులాంతర వివాహాలు కూడా ఉద్యమ క్రమం లో ప్రేమించి పెళ్లి చేసుకున్నవే.

 కులనిర్మూలనే ప్రదాన లక్ష్యంగా అంబేద్కర్ జీవితాంతం కృషి చేసిన విషయం అందరికి తెలి సిందే.కాని అంబేద్కరిష్టులు కూడ వివాహాల విషయం లో మనువు శాసించినట్లు 99.9% స్వకులవివాహాలే పాటిస్తున్నారు.

   వివాహాలంటే చేసుకొనే వారిష్టం కదా అని దాటేస్తారు లేదా తప్పుకుంటారు. కాని పెళ్లి చేసుకునేవారికి స్వేచ్చ అసలే    వుండదు. 

జరిగేది అరెంజ్డ్ కుల వివాహాలే. కులాలు కాపాడేదెవరో కాదు,  కుల వివాహాలు చేసే వారు,చేసుకొనే వారే. 

   కులాన్ని కాపాడేది కేవలం పాలకులనో, వ్యవస్థనో తప్పు కోవద్దు. 

   కుల నిర్మూలనకు వ్యక్తి,సంస్థ,పార్టీలు.

ప్రభుత్వం ఏం చేయాలో స్పష్టంగా కార్యక్రమం వుండాలి.

   ఈ నినాదాల చుట్టూ ఉద్యమం రావాలి.

స్వకుల వివాహాలు నిరసించాలి!

స్వకుల వివాహాలు బహిష్కరించాలి!!

స్వకుల వివాహాలు నిషేదించాలి !!!

స్వకుల వివాహాలు అనారోగ్యం !!!!

“ ఒక్క మీ కులం తప్ప ఏ కులమైనా పర్వాలేదు”. అనేది నినాదం కావాలి.

      రాములు జి 9490098006.

Success storyes

 సాధారణ జీవితం నుంచి 680 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయిన రామ్ కుమార్ తోట. 

ఒక సాధారణ పల్లెటూరి యువకుడు దుబాయిలో నవాబులా ఖరీదైన రోల్స్‌రాయిస్‌ కారులో తిరగగలడా? బతుకుదెరువు కోసం నానా అగచాట్లు పడినవాడు.. ఒక కంపెనీకి యజమాని కాగలడా? గల్లీలోని అనామకుడు.. గల్ఫ్‌లో నాయకుడు.. కాగలడా? సొంతూరు కరీంనగర్‌ జిల్లా (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా)లోని వేములవాడ నుంచి... దుబాయి విమానం ఎక్కే వరకు తోట రామ్‌ కుమార్‌కు గమ్యం తెలీదు. వెళ్లేప్పుడు లగేజీలో బీటెక్కులు, ఎమ్మెస్‌లు లేవు. ఒకసారి తప్పి, మళ్లీ గట్టెక్కిన పదో తరగతి సర్టిఫికెట్టు మాత్రమే ఉంది. అలా మొదలైన ప్రయాణం.. ఎన్నో మలుపులు తిరిగింది. రూ.680 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేతను చేసింది..


1980 ప్రాంతం. కరీంనగర్‌ జిల్లా.. కరువు.. నిరుద్యోగం.. అటు పోలీసులు.. ఇటు అన్నలు.. బతకాలంటే బట్టలు సర్దుకుని బయటికి వెళ్లిపోవాల్సిందే! పని దొరికితే ఉప్పో కారమో తిని ఊపిరిపీల్చుకోవచ్చు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో.. ఎడారి దేశం ఊరించింది. రెండు జతల బట్టలు, టెన్తు సర్టిఫికెట్టు పట్టుకుని గల్ఫ్‌ బాట పట్టారు తెలంగాణ గ్రామీణ యువకులు. వారిలో ఒకడు.. వేములవాడ పిలగాడు. ఊరోళ్లకు ‘రాము’. స్కూలోళ్లకు ‘తోట రామ్‌కుమార్‌’. గల్ఫ్‌ దేశానికి ఫ్లయిట్‌ ఎక్కాడు కానీ.. తన బతుకు ఎక్కడ ల్యాండ్‌ అవుతుందో, ఎలా ఉంటుందో తనకే స్పష్టతలేని పరిస్థితి. పాజిటివ్‌గా ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుందన్న నమ్మకమే ముందుకు నడిపించింది. 


కరీంనగర్‌ జిల్లా వేములవాడలోని ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు రామ్‌కుమార్‌. తల్లిదండ్రులు తోట నారాయణ, నర్సమ్మ. వ్యవసాయ కుటుంబం. ‘చూడు బిడ్డా... బతుకుడు అంటే.. నువ్వొక్కనివే తినుడు కాదు. నువ్వు బాగా బతకాలె, మరో పదిమందినీ బతికించాలె. అదీ బతుకంటే!’ దుబాయి వెళుతున్న కొడుక్కి మంచిచెడ్డలు చెప్పాడు తండ్రి. అలా.. 1989లో దుబాయికి చేరుకున్నాడు రాము. ఓ కంపెనీలో అకౌంట్స్‌ అసిస్టెంట్‌గా చేరాడు. రోజులు గడుస్తున్నాయి కానీ.. ఎదుగూబొదుగూ లేదు. ‘నువ్వు పాసైంది పదో తరగతే భయ్యా. ఇంతకంటే మంచి ఉద్యోగం ఏమొస్తుంది?’ అన్నారు దోస్తులు. అవును, నిజమే! పదికే పరిమితమైతే ప్రయోజనం లేదు. పైచదువులు చదవాలన్న కసిని రగిలించాయా మాటలు. దుబాయిలోనే ఇంటర్‌ పూర్తి చేశాడు. కొన్నాళ్లకు అదీ అర్థమైంది. పైకి రావాలంటే ఈ చదువు సరిపోదని. అకౌంటింగ్‌, ఫైనాన్స్‌, మార్కెటింగ్‌ నైపుణ్యాలు అవసరం. అక్కడే చార్టర్డ్‌ అకౌంటెన్సీ చదివాడు. ఒకవైపు సీఏ పరీక్షలకు సిద్ధం అవుతూనే... సేల్స్‌ మేనేజర్‌గా పనిచేసేవాడు. ఆ తరువాత అదానీ గ్రూప్‌లో సేల్స్‌ డైరెక్టర్‌గా పెద్ద కొలువే వరించింది. 


అదానీ గ్రూప్‌లో ఉద్యోగం రాము జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ పెట్రో కెమికల్‌ విభాగం అధిపతి యోగేష్‌ మెహతా ప్రోత్సాహం మరువలేనిది. కార్పొరేట్‌ పాలనా వ్యవహారాల్లోని లోతుపాతుల్ని తెలుసుకునే అవకాశం కలిగింది. ‘నా కళ్ల ముందు ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృతం అయ్యింది. మెహతా అనుభవం నాకెన్నో పాఠాలను నేర్పింది. ఆయనతో పోల్చుకుంటే, పదిశాతం కష్టపడినా పైకి రావొచ్చని అనిపించింది. నాకు నేనే ఒక కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకునేలా చేసింది’ అంటాడు రాము. అదానీ గ్రూప్‌లో పనిచేస్తున్నప్పుడు.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని పలు కంపెనీల సేల్స్‌ డైరెక్టర్లతో పరిచయం కలిగింది. నెట్‌వర్క్‌ను విస్తరించుకున్నాడు. వివిధ కంపెనీల సేల్స్‌ డైరెక్టర్ల గ్రూప్‌లో చేరాడు. అక్కడ అంతర్జాతీయ వాణిజ్య అంశాల గురించి చర్చలు జరిగేవి. కొత్త పరిణామాలపై విశ్లేషించు కునేవారు. దీంతో ప్రణాళికలు కొత్త రూపు తీసుకునేవి. సరిగ్గా అప్పుడే దుబాయిలో నిర్మాణరంగం ఊపందుకుంటున్నది. అప్పటి వరకు ఉద్యోగమే జీవితం అనుకున్న ఆయన.. కొత్త అవతారం ఎత్తాలనుకున్నాడు. బిల్డింగ్‌ మెటీరియల్‌ ట్రేడింగ్‌పై కన్నేశాడు. 


కొన్నేళ్లపాటు పైసా పైసా కూడబెట్టిన డబ్బుకు తోడు.. బ్యాంకుల చుట్టూ తిరిగితే కొంత రుణం లభించింది. ఓ స్నేహితుడు చేతులు కలిపాడు. దుబాయిలోనే 2004లో బిల్డింగ్‌ మెటీరియల్‌ ట్రేడింగ్‌కు శ్రీకారం చుట్టాడు రామ్‌కుమార్‌. ఆయన నెలకొల్పిన కంపెనీ ‘టోటల్‌ సొల్యూషన్స్‌’. ఊహించిన దానికంటే గొప్పగా సాగింది వ్యాపారం. లాభాలు కళ్లజూసినప్పుడే భాగస్వామితో పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. 2007లో ఆయన్ని వదులుకోవాల్సి వచ్చింది. సొంతంగా వ్యాపారం చేయడమే తన ముందున్న ఏకైక మార్గం. దేశం కాని దేశం వెళ్లినప్పుడు.. ఏ చిన్న కష్టం వచ్చినా.. ముందు గుర్తొచ్చేది మన ఊరి దేవుడే! వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి అంటే రామ్‌కుమార్‌కు ఎనలేని భక్తి. ఆ దేవుడికే దండం పెట్టుకుని.. అదే పేరుతో దుబాయిలో ‘శ్రీ రాజరాజేశ్వర బిల్డింగ్‌ మెటీరియల్‌ ట్రేడింగ్‌’ (ఎస్‌ఆర్‌ఆర్‌ బీఎంటీ)ని ప్రారంభించాడు. అప్పటికే పరిచయమున్న కస్టమర్లు తోడ్పాటును అందించారు. పెద్ద పెద్ద భవనాలు, షాపింగ్‌మాల్స్‌, నివాస ప్రాంతాలు.. ఇలా ఏ నిర్మాణం జరిగినా తనే మెటీరియల్‌ను సరఫరా చేయడం మొదలుపెట్టాడు.


ఆత్మీయుల్ని  ఆదుకోవడమే కాదు... పండుగలనూ కలిసి సెలబ్రేట్‌ చేసుకోవాలన్నది నా ఆశయం. అందుకే పన్నెండేళ్లుగా దుబాయ్‌లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నా.  


తొలి ఏడాదిలోనే సుమారు రూ.200 కోట్ల లావాదేవీలతో గల్ఫ్‌ దేశాల దృష్టిని ఆకర్షించాడు రామ్‌కుమార్‌. ప్రఖ్యాత బుర్జ్‌ఖలీఫాతో పాటు మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ సిటీ, అల్‌ మక్‌టౌమ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, అరేబియన్‌ రాంచెస్‌, స్పోర్ట్స్‌ సిటీ, మోటార్‌సిటీ, దుబాయ్‌ మాల్‌, ఫామ్‌ జుమేరా, బిజినెస్‌ బే... వీటన్నిటికీ భవన నిర్మాణ సామగ్రిని సరఫరా చేసింది ఎస్‌ఆర్‌ఆర్‌. ‘బుర్జ్‌ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం. ఇలాంటి నిర్మాణానికి మెటీరియల్‌ సరఫరా చేసే  అవకాశం రావడం.. నా జీవితంలో మరపురాని అనుభవం’ అని గుర్తు చేసుకుంటాడు రామ్‌కుమార్‌. దుబాయిలో ఏ పెద్ద నిర్మాణం చేపట్టినా తన కంపెనీ మెటీరియల్‌ ఉండాల్సిందే! యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఈ తరహా వ్యాపారం చేస్తున్న కంపెనీల్లో ఆయనది రెండోస్థానం. గల్ఫ్‌ కో-ఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ) టాప్‌ బిలియనీర్‌ కంపెనీల జాబితాలో 23వ స్థానం దక్కించుకుంది ఎస్‌ఆర్‌ఆర్‌.


అంతటితో ఆగలేదు. చైనాలోనూ అడుగుపెట్టాడు రామ్‌కుమార్‌. అక్కడ అల్యూమినియం ప్యానెళ్ల పరిశ్రమను నెలకొల్పాడు. 2005లో మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు రూ.200 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. ఇందులో తన వాటా 40 శాతం. ఇటు దుబాయిలో వ్యాపారం విస్తరిస్తోంది, అటు చైనాలో విజయవంతమైంది. మరికొందరి సహాయంతో ఒమన్‌లో కూడా ఒక శాఖను ప్రారంభించాడు. మిడిల్‌ ఈస్ట్‌ కంట్రీస్‌కు బిల్డింగ్‌ మెటీరియల్‌ సరఫరా చేసే టాప్‌ డీలర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. దుబాయి, ఒమన్‌...  రెండు చోట్లా కలిపి ఎస్‌ఆర్‌ఆర్‌ సంస్థ ఏడాదికి రూ.600 కోట్ల లావాదేవీలను నిర్వహిస్తోంది. సుమారు 16 అవుట్‌లెట్లలో 345 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లలో తెలుగువారితో పాటు ఇతర దేశాల వాళ్లు కూడా ఉన్నారు. దాదాపు వెయ్యి రకాల మెటీరియల్‌ను ఈ కంపెనీ సరఫరా చేస్తోంది.


మా ఊరికి ఏం చేసినా తక్కువే. నాకు జీవితాన్ని ఇచ్చిన పల్లె అది. ఇప్పటిదాకా చేసిన సాయం వేరు. ఇకపై చేయాల్సింది వేరు. అందుకే  సేవ ఆర్గనైజ్డ్‌గా ఉండాలని వేములవాడలో టీఆర్‌కే ట్రస్టును ప్రారంభించాను. మా బావ వుప్పుల దేవరాజు, మిత్రులు నాయిని శేఖర్‌, గోలి శ్రీనివాస్‌, బూర సదానందంలను ట్రస్టీలుగా నియమించాను. ట్రస్టు కోసం ఒక భవనాన్ని నిర్మిస్తున్నాను. చుట్టుపక్కల గ్రామాలకు సైతం సేవల్ని విస్తరించే ఆలోచన ఉంది.  


 2008లో దుబాయిలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. రెండేళ్లపాటు వ్యాపారాలను అతలాకుతలం చేసింది. ఆ అడ్డంకుల్ని ధైర్యంగా తట్టుకుని నిలబడింది ఎస్‌ఆర్‌ఆర్‌ సంస్థ. అంతటి సంక్షోభంలోనూ ఒక్క ఉద్యోగినీ తొలగించలేదు, ఎవరికీ ఒక్క రూపాయి జీతమూ తగ్గించలేదు. కొన్నాళ్లు ఓపికతో వ్యాపారాన్ని నడిపించాడు రామ్‌కుమార్‌. ఆ తరువాత అదే ఊపందుకుంది. లాభాల పంట పండింది. అయితే 2016లో గట్టి దెబ్బ తగిలింది. కొందరు కస్టమర్లు విలువైన సరుకు తీసుకుని.. రూ.10 కోట్లకు చెక్కులు ఇచ్చారు. అంతలోనే తమ కంపెనీని గుట్టుచప్పుడు కాకుండా మూసేశారు. ఆ మోసాన్ని జీర్ణించుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. అలాంటి ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలిచాడు రామ్‌కుమార్‌.


నాకు స్నేహితులంటే చాలా ఇష్టం. జీవితంలోని ప్రతి మలుపులో ఫ్రెండ్స్‌ లేకుండా నేను లేను. ఎక్కడున్నా, ప్రత్యేకించి హైదరాబాద్‌, వేములవాడలకు ఎప్పుడు వచ్చినా... చుట్టూ స్నేహితులు ఉండాల్సిందే. నేను ఉన్నత స్థితికి చేరాక వాళ్ల జీవితాలనూ మెరుగ్గా చూడాలను కున్నా. అందుకే వాళ్ల కష్టాలూ తీరుస్తున్నా.


రామ్‌కుమార్‌ దుబాయికి వెళ్లిన కొత్తలో ఇరుకైన గదిలో ఉండేవాడు. ఇప్పుడు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీసును ఏర్పాటు చేసుకున్నాడు. సొంతూళ్లో చిన్న ఇంట్లో సర్దుకుని బతికినవాడు.. ఈ రోజు దుబాయిలో విలాసవంతమైన విల్లాను సొంతం చేసుకున్నాడు. వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి ఫెయిలైనవాడు.. పరాయి దేశంలో చార్టర్డ్‌ అకౌంటెన్సీ పాసయ్యాడు.  తొలినాళ్లలో ఒక చిన్న కారు కొంటే.. ఈ జీవితానికి చాలని అనుకున్నవాడు.. ఖరీదైన రోల్స్‌రాయిస్‌లో  షికార్లు చేస్తున్నాడు. పెద్ద కొడుకును ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో చదివిస్తున్నాడు. చిన్న కొడుకు, కూతురు దుబాయిలోని పేరున్న పాఠశాలలో చదువు కుంటున్నారు. గల్ఫ్‌కు వెళ్లి నాలుగు కాసులు సంపాదించి.. తల్లిదండ్రులకు పంపిస్తే అదే పదివేలు అనుకున్నవాడు.. ఇప్పుడు దుబాయిలో తెలంగాణ తరఫున కాన్సులేట్‌ మెంబర్‌గా గౌరవం దక్కించుకున్నాడు. ‘బతకడమంటే నువ్వొక్కడివే బతకడం కాదు.. నీతోపాటు మరో నలుగుర్ని బతికించు.. అన్న నాన్న మాటలు నన్ను ప్రభావితం చేశాయి. 


ఒక కంపెనీని నెలకొల్పాలి బిడ్డా - అని నాన్న చెప్పలేదు కానీ.. కొందరికైనా సహాయం చేయాలన్నాడు. ఆ దృక్పథమే ఒక వ్యవస్థ నిర్మాణానికి ప్రేరణగా నిలిచింది. ఈ రోజు నా సంస్థ ఎస్‌ఆర్‌ఆర్‌లో ఇంతమందికి ఉపాధి దొరుకుతోందంటే.. నాన్న కల ఫలించినట్లే కదా!’ అంటున్న రామ్‌కుమార్‌ కళ్లలో ఆనందభాష్పాలు.......







2.    *మరో సూర్యుడు..బొల్లా శ్రీకాంత్*


మచిలీపట్నం జిల్లా లోని సీతారామపురం పల్లెలో ఒక రైతుకుటుంబం లో 1992 జూలై 7 వ తేదీన బొల్లా శ్రీకాంత్ పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. 


ఆ వూరిజనం అయితే మరో అడుగు ముందుకేసి , ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు. కానీ అమ్మ నాన్న అలా చేయలేదు. '' మేము బతికున్నంతవరకు వీడిని బాగా చూసుకొంటాం. మేము పోయాక దేవుడే చూసుకోవాలి '' అని అనేవారు. 


కళ్ళుకనపడకపోవడం తప్ప , బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుకుగా వుండేవాడు. కానీ ఇంటర్ లో ' నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేమని '' కాలేజీలు చెపితే శ్రీకాంత్ కోర్టుకెళ్ళి గెలిచి admission తెచ్చుకొన్నాడు. తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి 2 ఏళ్ళు ఇంట్లోనే వుండిపోయాడు. మళ్ళీ హైదరాబాద్ లో school for the specially abled లో చేరాడు. అక్కడకూడా పిల్లలు అవమానపెట్టారు. అందరూ తనను వదిలేసి వెళ్ళిపోతుంటే బాధ తట్టుకోలేక బడివదిలేసి. పారిపోతుంటే ఒక teacher పట్టుకొని చెంపచెళ్ళుమనిపించింది. 


అది అతని జీవితం లో game changing moment. ఆ టీచర్ ఆడియో టేపుల్లో పాఠాలు వినిపించింది. ఇంటర్ లో MPC చదివి 98% సంపాదించగా ఎగతాళి చేసినవారు అవాక్కయ్యారు. కానీ IIT వాళ్ళు సీటు ఇవ్వమన్నారు.


 నిరాశ పడని అతను అమెరికా universities లకు entrance exams వ్రాస్తే Stanford , మరో 2 universities admission ఇవ్వడానికి ముందుకొచ్చాయి. 


శ్రీకాంత్ Howard Massachusetts Institute of Technology [ అమెరికా ] లో చేరాడు. అక్కడ Brain Cognitive Sciences లో చేరిన తొలి అంధుడిగా రికార్డు పొందాడు. అతని ప్రతిభ చూసి , చదువు అయ్యాక 4 అమెరికన్ కంపెనీ లు తమదగ్గర వుద్యోగం చేయమని అడిగితే శ్రీకాంత్ సున్నితంగా ' లేదు ' అనిచెప్పాడు. ' భారతదేశం చేరుకొని తనతోటి నిరుపేద , దివ్యాంగ భారతీయులకు సహాయపడే భాగ్యాన్ని నాకు ఇవ్వు ' అని అతను భగవంతుడిని ప్రతి రాత్రీ ప్రార్థించేవాడు. ప్రార్థనలు పరమాత్మ విన్నాడు.


శ్రీకాంత్ India కు వచ్చి హైదరాబాద్ దగ్గర Bollant Industries స్థాపించాలని వుందంటే రతన్ టాటా ముందుకొచ్చి ఫండ్స్ ఇచ్చారు. అది మొదలైంది. ఈరోజు అది 150 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీ. దానికి శ్రీకాంత్ CEO. సాక్షాత్తూ అబ్దుల్ కలాం గారే అక్కడికొచ్చారు. ఇద్దరూ కలిసి Lead India Project ద్వారా 4 లక్షలమంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు. శ్రీకాంత్ దగ్గర ఇపుడు సుమారు 300 మంది దివ్యాంగులు వుద్యోగాలు చేస్తున్నారు. అతను 3000 మంది విద్యార్థులను చదివిస్తున్నాడు.


చీకటి ని అసహ్యించుకోనేవారు కొందరు , చీకటి ని చూసి భయపడేవారు ఇంకొందరు , చీకటిని చీల్చుకువెళ్ళేవారు మరికొందరు.ఆ మూడవరకం వాళ్ళను మూడక్షరాల పదం లో '' సూర్యుళ్ళు '' అంటారు. మనవాడు మరోసూర్యుడు,మరియు ఎందరికో మార్గదర్శి,ఇటువంటి వారి చరిత్రలు ఎందరికో దశ,దిశ నిర్దేశితాలు....




..... ,,....,,,...  ,,,  ..    ,    ...      ,   ,,,,    ......      ,,,,  ,     .........   



*ఇద్దరు అమ్మాయిల కధ* ...

*నాటి డిఎస్పీ కూతుళ్లు నేడు దేశానికి ఆదర్శం*

ఈ కధ ముప్పై అయిదేళ్ళ క్రితం 12 మార్చి 1982 న మాదాపూర్ అనే గ్రామం లో ఉత్తర ప్రదేశ్ లోని గౌండ జిల్లాలో మొదలయ్యింది..
క్రిమినల్స్ గురించి సమాచారం రావటంతో తన సబ్ అర్దినేట్స్ తో కలిసి DSP ఎస్.పి. సింగ్ రాత్రి వేళ హుటాహుటిన వెళ్ళాడు.అతని మ్ర్రతదేహం మర్నాడు ఉదయం ప్రభుత్వ అసుపత్రి కి చేరింది. మరో 12 మంది దుండగులతో కలిసి అతను బాంబు దాడిలో చనిపోయినట్లు బార్య విభా సింగ్ కి సమాచారం పంపారు.
నిజానికి DSP సింగ్ కి అతని సబ్ అర్దినేట్స్ కి మధ్య ఉన్న వైరం అతన్ని పొట్టన పెట్టుకుంది. అతని సబ్ ఆర్దినేట్స్ ఒక నకిలీ ఎన్కౌంటర్ లో చంపేశారు. “దయచేసి నన్ను కాల్చొద్దు. నాకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు” అనేది ఆయన చివరి మాట. సింగ్ భార్య 'విభా సింగ్' హై కోర్టుని ఆశ్రయించింది. సిబిఐ కి కేసు బదలాయించారు. తోటి ఉద్యోగులు క్రిమినల్స్ తో కలసి ఈ దారుణానికి పాల్పడినట్లు సిబిఐ చార్జ్ షీట్ ఫైల్ చేసింది. సుదీర్గమయిన కోర్టు ప్రక్రియ మొదలయింది. DSP సింగ్ హత్య జరిగినప్పటికి, అతనికి బార్య విభా సింగ్ కి కింజాల్ అనే ఆర్నెళ్ళ పాప, ఇంకా లోకం చూడని (ప్రింజాల్ సింగ్) బిడ్డ ఉన్నారు. తల్లి కి వారణాసి ట్రెజరీ లో ఓక చిన్న ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. తండ్రి మరణాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కోసం తల్లి చేసిన పోరాటం నీరు కారి పోయింది. భర్త తో పాటు పని చేస్తున్న ఉద్యోగులు ఆమెకి ఎవరు సహకరించలేదు.
ఆమె ఉద్యోగం లో జాయిన్ అయింది. రెండో బిడ్డ భూమి మీదకి వచ్చింది. ఇద్దరు పిల్లలని ఆమె చదివించడం మొదలెట్టింది. కొద్ది ఆదాయం, తండ్రి లేని ఒంటరి కుటుంబం. అన్ని రకాల గడ్డు సమస్యలని ఎదుర్కుంది. పిల్లలిద్దరూ వారి చదువుల కోసం అనేక త్యాగాలు చేసారు. తండ్రి ఫోటో ని చూస్తూ.. అతన్నే ఇన్స్పిరేషన్ గా తీసుంటూ ఇష్టపడి చదువు సాగించారు.
పెద్దమ్మాయి కింజాల్ డిల్లీ లోని అత్యున్నతమయిన “లేడి శ్రీరాం కాలేజ్” లో సీటు సంపాదించింది. కింజాల్ డిగ్రీ మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు తల్లి కి కాన్సర్ అని తెలుసుకుంది. ఆమె ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని తెలిసిన రెండు రోజుల కి వ్రాసిన పరిక్షల లో ఆమె యునివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. తల్లి మరణ శయ్య వద్ద తామిద్దరు UPSC క్రాక్ చేస్తామని మాట ఇచ్చింది. 2004 లో తల్లి మరణానంతరం అక్క చేల్లెల్లిద్దరు డిల్లీ చేరారు. ముఖర్జీ నగర్ లో ఒక సాధారణ గది లో నివాసం ఉంటూ UPSC కి చదవటం మొదలెట్టారు. మిత్రుల వద్ద అరువు తెచ్చుకున్న పుస్తకాలతో వాళ్ళు యజ్ఞం మొదలెట్టారు. స్వగ్రామం మరిచి పోయారు. బంధువులు లేరు. ఒక పండగ లేదు ఒక సరదా లేదు. ఒక విరామం లేదు. వాళ్లిద్దరు ఒకరి కొకరు ప్రేరణ. వాళ్ళిద్దరికి తల్లి తండ్రి ప్రేరణ. 2007 లో కింజాల్ సింగ్ IAS, ప్రింజాల్ సింగ్ IRS ని సాధించారు. వారిద్దరి పట్టుదల విజయగాధ జ్యుడిషిల్ వ్యవస్థని తాకింది. తండ్రి ని చంపిన 31 ఏళ్ల తర్వాత, చార్జ్ షీట్ చేసిన 27 ఏండ్ల తర్వాత ఎనిమిది మంది పోలిస్ అధికారులని నిందితులుగా నిర్ధారించింది. ఎస్ పి సింగ్ నిజాయితీని, తల్లి ఆరోపణలని నిజమని ప్రపంచానికి కోర్టు రుజువు చేసింది. తీర్పు చెప్పినప్పుడు అప్పటి 'లక్ష్మి పుర ఖేరి' జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ గా ఉన్న కింజాల్ సింగ్ దుఖం దాచుకోలేక పోయింది. కన్నీటి పర్యంతం అయింది. ఆడపిల్లలని తక్కువ గా చేసి చూసే వాళ్ళకి,మాట్లాడే వాళ్లకి కింజాల్ సింగ్, ప్రింజాల్ సింగ్ ఒక సమాధానం.దేశం గర్వించదగ్గ ఈ సోదరీమణులు ఇద్దరు అనేక మంది పిల్లలకి ఆ




*ఇద్దరు అమ్మాయిల కధ* ...


*నాటి డిఎస్పీ కూతుళ్లు నేడు దేశానికి ఆదర్శం*


ఈ కధ ముప్పై అయిదేళ్ళ క్రితం 12 మార్చి 1982 న మాదాపూర్ అనే గ్రామం లో ఉత్తర ప్రదేశ్ లోని గౌండ జిల్లాలో మొదలయ్యింది..

క్రిమినల్స్ గురించి సమాచారం రావటంతో తన సబ్ అర్దినేట్స్ తో కలిసి DSP ఎస్.పి. సింగ్ రాత్రి వేళ హుటాహుటిన వెళ్ళాడు.అతని మ్ర్రతదేహం మర్నాడు ఉదయం ప్రభుత్వ అసుపత్రి కి చేరింది. మరో 12 మంది దుండగులతో కలిసి అతను బాంబు దాడిలో చనిపోయినట్లు బార్య విభా సింగ్ కి సమాచారం పంపారు.

నిజానికి DSP సింగ్ కి అతని సబ్ అర్దినేట్స్ కి మధ్య ఉన్న వైరం అతన్ని పొట్టన పెట్టుకుంది. అతని సబ్ ఆర్దినేట్స్ ఒక నకిలీ ఎన్కౌంటర్ లో చంపేశారు. “దయచేసి నన్ను కాల్చొద్దు. నాకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు” అనేది ఆయన చివరి మాట. సింగ్ భార్య 'విభా సింగ్' హై కోర్టుని ఆశ్రయించింది. సిబిఐ కి కేసు బదలాయించారు. తోటి ఉద్యోగులు క్రిమినల్స్ తో కలసి ఈ దారుణానికి పాల్పడినట్లు సిబిఐ చార్జ్ షీట్ ఫైల్ చేసింది. సుదీర్గమయిన కోర్టు ప్రక్రియ మొదలయింది. DSP సింగ్ హత్య జరిగినప్పటికి, అతనికి బార్య విభా సింగ్ కి కింజాల్ అనే ఆర్నెళ్ళ పాప, ఇంకా లోకం చూడని (ప్రింజాల్ సింగ్) బిడ్డ ఉన్నారు. తల్లి కి వారణాసి ట్రెజరీ లో ఓక చిన్న ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. తండ్రి మరణాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కోసం తల్లి చేసిన పోరాటం నీరు కారి పోయింది. భర్త తో పాటు పని చేస్తున్న ఉద్యోగులు ఆమెకి ఎవరు సహకరించలేదు.

ఆమె ఉద్యోగం లో జాయిన్ అయింది. రెండో బిడ్డ భూమి మీదకి వచ్చింది. ఇద్దరు పిల్లలని ఆమె చదివించడం మొదలెట్టింది. కొద్ది ఆదాయం, తండ్రి లేని ఒంటరి కుటుంబం. అన్ని రకాల గడ్డు సమస్యలని ఎదుర్కుంది. పిల్లలిద్దరూ వారి చదువుల కోసం అనేక త్యాగాలు చేసారు. తండ్రి ఫోటో ని చూస్తూ.. అతన్నే ఇన్స్పిరేషన్ గా తీసుంటూ ఇష్టపడి చదువు సాగించారు.

పెద్దమ్మాయి కింజాల్ డిల్లీ లోని అత్యున్నతమయిన “లేడి శ్రీరాం కాలేజ్” లో సీటు సంపాదించింది. కింజాల్ డిగ్రీ మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు తల్లి కి కాన్సర్ అని తెలుసుకుంది. ఆమె ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని తెలిసిన రెండు రోజుల కి వ్రాసిన పరిక్షల లో ఆమె యునివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. తల్లి మరణ శయ్య వద్ద తామిద్దరు UPSC క్రాక్ చేస్తామని మాట ఇచ్చింది. 2004 లో తల్లి మరణానంతరం అక్క చేల్లెల్లిద్దరు డిల్లీ చేరారు. ముఖర్జీ నగర్ లో ఒక సాధారణ గది లో నివాసం ఉంటూ UPSC కి చదవటం మొదలెట్టారు. మిత్రుల వద్ద అరువు తెచ్చుకున్న పుస్తకాలతో వాళ్ళు యజ్ఞం మొదలెట్టారు. స్వగ్రామం మరిచి పోయారు. బంధువులు లేరు. ఒక పండగ లేదు ఒక సరదా లేదు. ఒక విరామం లేదు. వాళ్లిద్దరు ఒకరి కొకరు ప్రేరణ. వాళ్ళిద్దరికి తల్లి తండ్రి ప్రేరణ. 2007 లో కింజాల్ సింగ్ IAS, ప్రింజాల్ సింగ్ IRS ని సాధించారు. వారిద్దరి పట్టుదల విజయగాధ జ్యుడిషిల్ వ్యవస్థని తాకింది. తండ్రి ని చంపిన 31 ఏళ్ల తర్వాత, చార్జ్ షీట్ చేసిన 27 ఏండ్ల తర్వాత ఎనిమిది మంది పోలిస్ అధికారులని నిందితులుగా నిర్ధారించింది. ఎస్ పి సింగ్ నిజాయితీని, తల్లి ఆరోపణలని నిజమని ప్రపంచానికి కోర్టు రుజువు చేసింది. తీర్పు చెప్పినప్పుడు అప్పటి 'లక్ష్మి పుర ఖేరి' జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ గా ఉన్న కింజాల్ సింగ్ దుఖం దాచుకోలేక పోయింది. కన్నీటి పర్యంతం అయింది. ఆడపిల్లలని తక్కువ గా చేసి చూసే వాళ్ళకి,మాట్లాడే వాళ్లకి కింజాల్ సింగ్, ప్రింజాల్ సింగ్ ఒక సమాధానం.దేశం గర్వించదగ్గ ఈ సోదరీమణులు ఇద్దరు అనేక మంది పిల్లలకి ఆదర్శం.





::::::::::::::::::::::::  ::::::::::::::::::::::::     ::::::::::::::: ::::::::::  :      :::::::::






🔳పేదల్లేని గ్రామం.. చెబుతోంది పాఠం..!


*అదొక చిన్న పల్లెటూరు. దాన్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వారిలో విదేశీయులూ ఉంటారు. ఆఖరికి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు కూడా ఓసారి చూసి వెళ్లారు. అంతగా ఏముందా ఊళ్లో అంటే- నేర్చుకోవడానికి చాలానే ఉంది. అభివృద్ధికీ స్వావలంబనకీ నిఖార్సైన ఉదాహరణ ఆ పల్లె. ప్రజల బాగోగులే లక్ష్యంగా పనిచేసే నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆ పంచాయతీకి ప్రెసిడెంటుగా చేసిన షణ్ముగం. ఆయన ఆధ్వర్యంలో ఒకటీ రెండూ కాదు, పదుల సంఖ్యలో ప్రథమ స్థానాలు అందుకున్న ఆ ఆదర్శ పంచాయతీ కథా కమామిషూ అభినందనీయం... ఆసక్తికరం!


ఒడంతురై... నీలగిరుల సానువుల్లో కోయింబత్తూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం. చుట్టూ పచ్చని అరటి తోటలూ మబ్బులతో దోబూచులాడే కొబ్బరి చెట్లూ పసుపు ఆరబోసినట్లుండే ఆవ తోటలు.


ఒడంతురై గ్రామ పంచాయతీ కింద ఉన్న ఓ డజను చిన్న చిన్న పల్లెల్లో అంతా కలిసి  పదివేల జనాభా ఉంటుంది. అందులో కొందరే రైతులు. ఎక్కువ మంది చుట్టుపక్కల తోటల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు... గిరిజనులు.


పాతికేళ్ల క్రితం ఆ పంచాయతీ పేదరికానికి ప్రతినిధిలా ఉండేది. ఇళ్లంటే చిన్న చిన్న గుడిసెలు. పొద్దున్నే లేచి పిల్లలూ పెద్దలూ తలా ఓ బిందె పట్టుకుని రెండు మూడు గంటలు నడిచి వెళ్లి నది నుంచి నీళ్లు తెచ్చుకునేవారు. ఆ తర్వాత పెద్దలు కూలికి వెళ్తే పిల్లలు వీధులమ్మట తిరుగుతూ ఉండేవారు.


అలాంటిది పదేళ్లలో ఆ ఊరి రూపురేఖలే మారిపోయాయి. గుడిసెల స్థానంలో పక్కా ఇళ్లు. వాకిట్లో మంచినీళ్ల పంపులు. సౌరశక్తితో వెలిగే వీధి దీపాలు. పిల్లలకోసం చక్కటి బడులు. ఇప్పుడది ఎందరికో పాఠాలు చెబుతున్న ‘మోడల్‌ విలేజ్‌’. ఆ మార్పుకి కారణం రామస్వామి షణ్ముగం.


పదవి చేపట్టి...

దాదాపు పాతికేళ్ల క్రితం సంగతిది. రైతుగా ఒకరి మీద ఆధారపడకుండా హాయిగా సాగిపోయేది నలభయ్యేళ్ల షణ్ముగం జీవితం. ఊరి పరిస్థితులే అతడికి విసుగు తెప్పించేవి. తాగునీటి వసతి లేదు, రోడ్లు లేవు, పిల్లలకు బడులు లేవు, కరెంటు లేదు. ప్రభుత్వాలేమో ఏమేమో చేసేస్తున్నామని వార్తల్లో చెబుతుంటాయి. తన ఊరేమో ఎన్నేళ్లయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. గ్రామసభ జరిగినప్పుడల్లా ప్రెసిడెంటుని నిలదీసేవారు. కానీ అటునుంచి సరైన సమాధానం వచ్చేది కాదు. విసిగిపోయిన షణ్ముగం 1996లో తానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రెసిడెంటు అయ్యారు. ఊరి ప్రజలకు స్థానిక పాలన ఎలా ఉండాలో చేసి మరీ చూపించారు. ఊరివాళ్లకు ఆయన చెప్పిందే వేదం. రెండు దశాబ్దాలపాటు ఆయన ప్రతిపాదించిన ఏ పథకానికీ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవలేదు. మొదటి పదేళ్లూ ఆయనా, ఆ తర్వాత పదేళ్లూ ఆయన భార్య లింగమ్మాళ్‌(పంచాయతీని మహిళలకు కేటాయించడంతో) పంచాయతీ ప్రెసిడెంట్లుగా పనిచేసి ఊరి అభివృద్ధిని ఓ కొలిక్కి తెచ్చారు. ఈ దంపతుల కృషి వల్ల గ్రామ ఆదాయం ఎన్నో రెట్లు పెరిగింది. దానికి తగ్గట్టుగా ప్రజల జీవన ప్రమాణాలూ పెరిగాయి. అవినీతిరహితంగా సాగిన వారి పాలనే అందుకు కారణం


అలా... డబ్బొచ్చింది!

ఎన్నికల్లో గెలిచి బల్లకు ఇటువైపు కూర్చున్నాక అసలు పరిస్థితి అర్థం అయింది... అంటారు షణ్ముగం తొలి రోజుల్ని గుర్తుచేసుకుంటూ. ఊళ్లో ఎటు చూసినా సమస్యలే. పంచాయతీ ఆదాయమేమో కేవలం రూ.20వేలు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియలేదు. డబ్బుంటే ఏ పని అయినా చేయొచ్చని ముందుగా ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించారు. గ్రామసభ పెట్టి పరిస్థితి ప్రజలకు వివరించారు. నూరుశాతం పన్నులు కడితే దానికి మూడు రెట్లు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇస్తుందనీ ఆ డబ్బు ఉంటే ఎన్ని పనులో చేసుకోవచ్చనీ చెప్పారు. వారూ సహకరించారు. దాంతో ఆదాయం రూ.1.75 లక్షలకు పెరిగింది. ప్రభుత్వం నుంచి రూ.5.25 లక్షలు వచ్చాయి. అలా ఆ తర్వాత ఏడాది రూ.3.5 లక్షలు వసూలు చేస్తే ప్రభుత్వం పదిన్నర లక్షలిచ్చింది. చేతికి డబ్బు అందడంతో షణ్ముగం అభివృద్ధి ప్రణాళికల మీద దృష్టిపెట్టారు. పన్నుల వసూళ్లలో కఠినంగా వ్యవహరించడం పట్ల ప్రజలెవరూ అభ్యంతరం చెప్పలేదు. అందుకు తగినట్లుగా పంచాయతీ అందిస్తున్న సేవల్ని వారు గుర్తించారు. ఎవరు ఏ ఫిర్యాదుతో వచ్చినా రెండురోజుల్లో పరిష్కారమయ్యేలా చూసేవారు షణ్ముగం.


ఇంటికి... నీరు

నిజానికి ఆ రోజుల్లో ఊరి జనాభా రెండు వేలు మాత్రమే. అంతమందికీ ఒకే ఒక్క బోరుబావి ఉండేది. అందుకే చాలామంది దూరంగా ఉన్న నదినుంచో, తోటల్లోని బావుల నుంచో నీరు తెచ్చుకునేవారు. అవి శుభ్రమైనవి కాకపోవటంతో తరచూ అనారోగ్యాలకు గురయ్యేవారు. మరికొన్ని బోరుబావులు వేయించినా వేసవిలో అవి ఎండిపోయే ప్రమాదం ఉంది. అందుకని భవానీ నది నుంచి పన్నెండు పల్లెలకూ పైపుల ద్వారా నీటి సరఫరాకి రూ.30లక్షల ప్రతిపాదనతో ప్రాజెక్టు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. అంత డబ్బు ఒక్క పంచాయతీకే ఇవ్వడం కుదరదన్నారు అధికారులు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రపంచబ్యాంకు సహకారంతో గ్రామీణ నీటి సరఫరాకోసం కొత్త పథకాన్ని ప్రకటించింది. దానికింద అయితే పది శాతం ఖర్చు పంచాయతీ పెట్టుకోవాలి. కలెక్టర్‌ ఆ విషయాన్ని షణ్ముగం దృష్టికి తెచ్చారు. మరోసారి ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపొందిస్తే ఈసారి ఖర్చు 48 లక్షలు తేలింది. దాంతో షణ్ముగం పరిస్థితిని ప్రజలకు వివరించారు. పదోవంతు అంటే దాదాపు ఐదు లక్షలు ఊరి తరఫున కట్టడానికి ప్రజలు అంగీకరించారు. డబ్బున్నవారు ఎక్కువిచ్చారు. లేనివాళ్లు తమ స్తోమత మేరకు వందా ఐదొందలూ... ఇచ్చారు. ఆ పథకం అమలుపై మంగళూరులో జరిగిన దక్షిణ ప్రాంత సదస్సుకి- ప్రజల నుంచి అంత పెద్ద మొత్తం కడతామన్న హామీతో హాజరైన పంచాయతీ ప్రెసిడెంటు షణ్ముగం ఒక్కరే. దాంతో తొలి ప్రాజెక్టు వారికే మంజూరయింది. ఏడాదికల్లా 13కి.మీ.ల పైప్‌లైన్‌, ఫిల్టర్‌ పాయింట్‌, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు సిద్ధమై అన్ని పల్లెలకీ నీళ్లు వచ్చాయి. ఎంత పెద్ద పని తప్పిందో... అంటూ ఆనందంతో పొంగిపోయారు గృహిణులు. పిల్లల్ని బడికి పంపించడం మొదలెట్టారు.


అంతలోనే...

ఊరివాళ్లందరికీ నీళ్లిచ్చామన్న సంతోషం ఎంతో కాలం నిలవలేదు ప్రెసిడెంటుకి. మోటార్లతో పంపింగ్‌ వల్ల కరెంటు బిల్లు భారంతో పంచాయతీ నడ్డి విరిగినంత పనైంది. బడ్జెట్‌లో సగానికి పైగా ఆ బిల్లుకే సరిపోతే ఇక మిగతా పనులేం చేయగలం అనుకున్న షణ్ముగం ప్రత్యామ్నాయాల కోసం వెతుకులాట మొదలెట్టారు. బయోమాస్‌ గ్యాసిఫయర్‌ విధానాన్ని ప్రయత్నిద్దామనుకున్నారు. ఈ పద్ధతిలో ఏవైనా జీవవ్యర్థాలను ఉపయోగించి గ్యాస్‌ని తయారుచేయవచ్చు. దాని గురించి బరోడా వెళ్లి శిక్షణ పొంది వచ్చారు. రాగానే తొమ్మిది కిలోవాట్ల గ్యాసిఫయర్‌ని ఏర్పాటుచేశారు. కలప మిల్లుల్లో వ్యర్థంగా పడివుండే కర్రముక్కల్ని కిలో 60పైసల చొప్పున కొని అందులో వాడేవారు. దాంతో కరెంటు ఖర్చు సగానికి తగ్గి, నాలుగేళ్లు బండి సాఫీగా సాగింది. ఇంతలో కర్రముక్కల ధర కిలో రూ.3.50కి పెరిగింది. మరో పక్క కరెంటేమో యూనిట్‌కి రూ.1.75 మాత్రమే. దాంతో గ్యాసిఫయర్‌ని మూసేసి మళ్లీ కరెంటే వాడారు.


అయితే పునరుత్పాదక ఇంధన వనరుల అన్వేషణ మాత్రం ఆపలేదు షణ్ముగం. ఎక్కడ సదస్సు జరిగినా హాజరవుతూ సోలార్‌ వీధి దీపాల గురించి తెలుసుకున్నారు. రెండు పల్లెల్లో వీధి దీపాలకోసం 2కెవి సోలార్‌ సిస్టమ్స్‌ని ఏర్పాటుచేశారు. దాంతో కరెంటు బిల్లు ఐదు వేలు తగ్గింది. ఈ రెండు ప్రయోగాల అనుభవాన్నీ క్రోడీకరించి రెండు పాఠాలు నేర్చుకున్నానంటారు షణ్ముగం. అవేంటంటే- విద్యుత్‌ బోర్డు ద్వారా సరఫరా అయ్యే కరెంటుని ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉంచుకోవాలి. రెండోది పునరుత్పాదక విద్యుత్‌ వనరులతో డబ్బు పొదుపు చేయడమే కాదు, డబ్బు సంపాదించవచ్చు కూడా అని. దాంతో ఈసారి పెద్ద లక్ష్యాన్నే పెట్టుకున్నారాయన. ఏకంగా విండ్‌ మిల్‌కి ప్రణాళిక సిద్ధంచేసుకున్నారు.


సరిగ్గా ఆ సమయానికి ప్రెసిడెంట్‌గా ఆయన పదవీ కాలం ముగిసింది. అయితే ఆ సీటును మహిళలకు కేటాయించడంతో తన భార్యనే ప్రెసిడెంట్‌గా నిలబెట్టి గెలిపించి, ఇద్దరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు.


గాలిమరతో విద్యుత్తు

ఒక గ్రామపాలనా సంస్థ విండ్‌మిల్‌(గాలిమర)ని ఏర్పాటుచేయడం (2006లో) దేశంలోనే ప్రథమం. ఒడంతురైకి 140కి.మీ. దూరంలో మైవాడి అనే ప్రాంతంలో చాలా గాలిమరలున్నాయి. విండ్‌ఫార్మ్‌ అంటారా ప్రాంతాన్ని. పలు వ్యాపార సంస్థలు అక్కడ గాలిమరలను ఏర్పాటు చేసుకున్నాయి. షణ్ముగం కూడా తమ గాలిమరను తీసుకెళ్లి అక్కడ పెట్టించారు. అలా చేయడం వల్ల ప్రత్యేకంగా దాని నిర్వహణ ఖర్చు తప్పింది. ఒక్కో గాలిమర నుంచి తయారైన విద్యుత్తు రాష్ట్ర విద్యుత్తు శాఖ గ్రిడ్‌కి చేరుతుంది. దాని ధర సంబంధిత యజమాని ఖాతాలో జమవుతుంది. 350 కిలోవాట్ల సామర్థ్యం కల ఈ విద్యుత్తు ప్లాంట్‌ ఏడాదికి ఆరులక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అందులో రెండు లక్షల యూనిట్లను రాష్ట్ర విద్యుత్‌ బోర్డుకు అమ్ముతారు. దానికి పెట్టుబడి కోటిన్నర పైనే అయింది. నలభై లక్షలు పంచాయతీ దాచుకున్న సొమ్ము. మిగతాది బ్యాంకు నుంచి లోను తీసుకున్నారు. 2013లో ఆ లోను కూడా తీరిపోయింది. ఇప్పుడు విద్యుత్తు అమ్మడం వల్ల పంచాయతీకి ఏటా దాదాపు 20 లక్షల వరకూ ఆదాయం వస్తోంది. ఆ డబ్బంతా ఏం చేస్తున్నారూ అంటే...


అభివృద్ధికి చిరునామా

ఆదాయం పెరుగుతున్నకొద్దీ ఒక్కో సమస్యా పరిష్కరించుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించారు షణ్ముగం. పంచాయతీ పరిధిలోని అన్ని పల్లెలకూ పక్కా రోడ్లు వేయించారు. సౌరశక్తితో వెలిగే వీధి దీపాలు పెట్టించారు. వీధులన్నీ ఎప్పుడూ శుభ్రంగా ఉంటాయి. అన్ని ఊళ్లకీ పాఠశాలలు అందుబాటులో ఉండేలా చూశారు. పై చదువులకు పట్టణానికి వెళ్లే పిల్లల కోసం బస్సు సౌకర్యం కల్పించారు. ఒకప్పుడు ఆ పంచాయతీలో నలభై మంది పిల్లలు బడికెళ్తే గొప్ప. ఇప్పుడు 400 మంది వెళ్తున్నారు. గ్రామ పరిసరాల్లో అందుబాటులో ఉండే వనరులను ఉపయోగించి స్వావలంబన సాధించడానికి యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించారు. జామ్‌, లెదర్‌ పాలిషింగ్‌ పౌడర్‌ తయారీ లాంటి చిన్న పరిశ్రమలు పెట్టుకున్నారు యువకులు. అంతే కాదు, ఆ పంచాయతీ పరిధిలో ఇప్పుడు ఒక్క గుడిసె కూడా లేదు. అన్నీ పక్కా ఇళ్లే!


ఊరంతా సొంతిళ్లే!

అక్కడి ప్రజల్లో దాదాపు 90 శాతం తోటల్లో కూలిపనులు చేసేవాళ్లే. తిండి గడవడమే కష్టమైన వారికి స్థలమూ సొంతిల్లూ కలలో మాట. చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవారు. వారికోసం ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అప్పటి ముఖ్యమంత్రి పేదరిక నిర్మూలన పథకం ప్రవేశపెట్టారు. షణ్ముగం వెంటనే దరఖాస్తు చేసి 45 ఇళ్లు మంజూరుచేయించుకుని కట్టించారు. ఆ తర్వాత రెండేళ్లకు మరో 25, మూడేళ్ల తర్వాత 135 అలా గిరిజనుల కోసమే మొత్తం 250 ఇళ్లు నిర్మించి ఇచ్చారు. వినోబాజీ నగర్‌ అనే మరో పల్లెలో 101 ఇళ్లు కట్టారు. సౌరశక్తిని ఉపయోగించుకునేలా కట్టిన గ్రీన్‌ హౌస్‌లు అవన్నీ. ఒక్క పంచాయతీ పరిధిలో వందకు పైగా పర్యావరణ హిత నివాసాలు కట్టడం ఇక్కడ మాత్రమే జరిగింది. ప్రభుత్వ నియమం ప్రకారం సొంత స్థలం ఉంటేనే ఇళ్ల నిర్మాణానికి నిధులిస్తారు. అందుకని వారందరికీ ముందుగా ప్రభుత్వ భూమిని పట్టాలుగా రాసిచ్చారు లింగమ్మాళ్‌. ఆ తర్వాత ప్రభుత్వ పథకం సాయంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేశారు. అలా సోలార్‌ పవర్డ్‌ గ్రీన్‌ హౌస్‌ పథకం కింద పేదలకు దాదాపు వెయ్యి ఇళ్లు కట్టించారు. నీటి పైపులైనుతో పాటు ప్రతి ఇంటికీ సౌరఫలకాన్నీ ఏర్పాటుచేశారు. ఇప్పుడు మొత్తం పంచాయతీ పరిధిలో ఇల్లులేని పేద ఒక్కరు కూడా లేరు. అందరివీ సొంతిళ్లే. అందులో సగానికి పైగా సర్కారు కట్టించినవే. రాష్ట్రంలో అత్యధికంగా గ్రీన్‌ హౌస్‌లు కట్టించిన పంచాయతీ- ఒడంతురై.


అప్పు ఇస్తారు!

ఒడంతురై పంచాయతీ పరిధిలో నివసించేవారికి ఎలాంటి అవసరమొచ్చినా వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లరు. వైద్యం, కాన్పులు, దుకాణాల్లో పెట్టుబడి లాంటి పెద్ద అవసరాలే కాదు, ఆఖరికి పిల్లలకు చెవులు కుట్టించడమూ, పుస్తకాలు కొనడమూ కూడా పల్లెల్లో పెద్ద విశేషాలే. అందుకని ఆ అవసరాలన్నిటికీ గ్రామ పంచాయతీలోని సూక్ష్మరుణ నిధి నుంచి అప్పులు ఇస్తారు. గ్రామస్థులు తమ అవసరాన్ని తెలుపుతూ వినతిపత్రం రాసిస్తే చాలు, సాయంత్రానికి డబ్బు చేతికందుతుంది. వారికి డబ్బు అందినప్పుడు నామమాత్రపు వడ్డీతో ఆ అప్పుని చెల్లించేస్తారు. ఒకేసారి కట్టలేనివారు వాయిదాల్లో కడతారు. పెద్ద వ్యాపారాలు చేయాలనుకునేవాళ్లకి బ్యాంకు లోన్లు కూడా గ్రామపంచాయతీ అండగా ఉండి ఇప్పిస్తుంది. పాతికేళ్ల క్రితం 1500 ఉన్న జనాభా ఇప్పుడు పదివేలు అవడానికి కారణం... జరుగుతున్న అభివృద్ధిని చూసి వలసవెళ్లిన వాళ్లంతా తిరిగిరావడమే.


కొంచెం బిజినెస్‌...

ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం అన్ని పల్లెల పంచాయతీ ప్రెసిడెంట్లనీ సమావేశపరిచింది. ‘ఒడంతురై పంచాయతీకి వెళ్లి చూసి నేర్చుకోండి’ అని పంపించింది. అది మొదలు... గ్రామీణాభివృద్ధి, పునరుత్పాదక ఇంధన వనరులు, విద్యుత్తు, నీటి పారుదల... ఒకటని కాదు ఎన్నో శాఖల అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించారు. కేరళ, కర్ణాటక, సిక్కిం తదితర రాష్ట్రాల నుంచి, జర్మనీ, ఫ్రాన్స్‌, జపాన్‌ లాంటి దేశాల నుంచి, ఆఖరికి ప్రపంచబ్యాంకు అధ్యక్షుడితో సహా ఎందరో వచ్చి చూసి వెళ్లారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయవచ్చో తెలుసుకున్నారు.


‘అయితే ఇలా వచ్చేవారందరికీ ఊరిని చూపించడానికీ వివరించి చెప్పడానికీ మాకేం అభ్యంతరం లేదు. కానీ అంత సమయం వారికోసం వెచ్చిస్తున్నప్పుడు మాకూ ఏదైనా లాభం ఉండాలిగా. అందుకే అలా వచ్చేవాళ్లు మాకు వెయ్యి రూపాయలు చెల్లించాలని నియమం పెట్టాం. అలా వచ్చిన డబ్బుని సూక్ష్మరుణ నిధికి జమచేస్తున్నాం...’ అని చెబుతారు షణ్ముగం. ‘ఆయనలో మంచి వ్యాపారవేత్త లక్షణాలు ఉన్నాయి. చేసే ప్రతి పనిలో ఎంతో కొంత మిగిలేలా చూసేవారు. అదే మరో కొత్త పథకానికి పెట్టుబడి అయ్యేది’ అంటారు గ్రామస్థులు. ‘ఆయన వేసిన దారిలోనే ముందుకు వెళ్తున్నాం’ అంటారు ప్రస్తుత ప్రెసిడెంట్‌ తంగవేల్‌.   ఇప్పటికీ ఎక్కడెక్కడి నుంచో షణ్ముగంకి ఆహ్వానాలు అందుతుంటాయి. అంత మార్పు ఎలా తేగలిగారో వచ్చి మాకూ చెప్పమంటారు. ‘స్థానిక సంస్థలు ప్రభుత్వ పథకాలను సరిగ్గా ఉపయోగించుకోవడం ముఖ్యం. నీటి సరఫరాకీ, ఇళ్లు కట్టించడానికీ ఆఖరికి కోటిన్నర ఖర్చుతో విండ్‌మిల్‌ పెట్టడానికీ... అన్నిటికీ మేము ప్రభుత్వ పథకాలనే ఆధారం చేసుకున్నాం. గాలీ ఎండా కావలసినంత ఉచితంగా దొరుకుతాయి. వాటిని సాధ్యమైనంతగా ఉపయోగించుకోవాలి. అలాగే ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వగలగాలి’... అని చెబుతారాయన.


*        *        *


ఒడంతురై వెళ్లినవాళ్లు ఆ ఇళ్లూ నీళ్లూ కరెంటూ... అన్నీ చూసి ఎంత ముచ్చట పడతారో మరో విషయం చూసి అంతకన్నా ఎక్కువగా ఆశ్చర్యపోతారు.







8888888888888888888888888888888888888888







"ఆసియన్ పెయింట్స్" - ది మోస్ట్ ఇన్నోవేటివ్ కంపనీ ఇన్ ఇండియా !


ఆసియన్ పెయింట్స్ భారతదేశం లో నంబర్ వన్, ఆసియాలో మూడో అతి పెద్ద పెయింట్ కంపనీ. 


అవి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు, ఇండియా లో మాత్రం క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుంది. టాటా గ్రూప్ కి JRD టాటా నియమితుడైనాడు, బిర్లాలు మ్యానిఫ్యాక్చురింగ్ లో బిజీ. రెండవ ప్రపంచ యుద్ధం వలన బయటిదేశాల నుంచి పెయింట్స్ ఇంపోర్ట్ చేసుకునే అవకాశం లేదు. ఆ రోజుల్లో షాలిమర్స్ పెయింట్స్ ఒక్కటే ప్రధానం గా ఉంది. 


26 యేండ్ల యువకుడు ఒక సమస్యని పరిష్కరించాలనుకున్నాడు, అదీ స్వాతంత్రం రాకముందు. ఆ యువకుడే చంపక్ లాల్ సోక్సీ. తన ముగ్గురు స్నేహితులు చమన్ లాల్ సోక్సీ, సూర్యకాంత్ ధాని, అరవింద్ వాకిల్ లతో కలిసి ఫిబ్రవరి 1, 1942 న బొంబాయి లో "ఆసియన్ పెయింట్స్" ఒక ఇంటి వసారా లో ప్రారంభించారు.


ఇప్పుడు ఆసియన్ పెయింట్స్ భారతదేశం లో నంబర్ వన్ ఇంకా ఆసియాలోనే మూడో అతి పెద్దది. ఇండియన్ పెయింట్ రంగం లో 50% షేర్ వాళ్ళదే. గతం లో ఫోర్బ్స్ పత్రిక ప్రకారం ప్రపంచం లోని 100 ఇన్నోవేటివ్ కంపనీల్లో ఆసియన్ పెయింట్స్ ఒకటి. ప్రపంచం లో 18 వ ర్యాంకు, ఇండియా లో నంబర్ వన్ (ఇన్నోవేషన్ కంపనీల్లో).  


"హర్ ఘర్ కుచ్ కెహ్తా హై (ప్రతి ఇళ్ళూ ఒకటి చెప్తుంది) అనేది 1980 లో వాళ్ళ నినాదం. పెద్ద పెద్ద సంస్థలు ఉన్నా పోటీలో నిలబడి, అన్నీటీకి మించి ఒక సమస్యని సాల్వ్ చేయాలనుకున్నారు, అందుకే అత్యంత గొప్ప విజయం సాధించారు. ఆసియన్ పెయింట్స్ విజయగాధ పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్ లో ఒక పాఠం గా చెప్తారు.


Yes, "Every home says something" and every company says something. రేపు కంపనీ ఫలితాలని వెలువరించబోతున్న తరుణం లో ఆసియన్ పెయింట్స్ ఎప్పుడూ బాగుండాలి అని కోరుకుంటూ🙏 


- జగన్


పంచాయతీ ఆదాయమూ, చేపట్టిన పథకాలూ, ఖర్చుల గురించి ఏకంగా పంచాయతీ కార్యాలయం గోడల మీదే రాసి ఉంటుంది. అది కోట్ల రూపాయల గృహనిర్మాణ పథకం కావచ్చు, జనన మరణ ధ్రువపత్రానికి చెల్లించే వంద రూపాయలు కావచ్చు. ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన ప్రతి సందర్భమూ ఆ గోడల మీదికి ఎక్కాల్సిందే. ఎక్కడా పైసా తేడా రాదు.


నాయకుడికి పారదర్శకత అన్నిటికన్నా ముఖ్యమని షణ్ముగం చెప్పకనే చెప్పారు!.

Saturday, August 22, 2020

Plasma

  #ప్లాస్మా అంటే ఏమిటి..

రక్తం కావాలంటే వెంటనే వచ్చి ఇస్తున్నారు,ప్లాస్మా అనగానే బయపడుతున్నారు...

మన రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ఫ్లూయిడ్ నే ప్లాస్మా అంటారు...కరోనా వంటి వైరస్ లు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్లరక్త కణాలు గుర్తించి, చంపేందుకు కావలిసిన యాంటీబాడీలు తయారవుతుంటాయి...ఆ యాంటీ బాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి....కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మా లోనూ ఈ యాంటీ బాడీలు పెద్దసంఖ్యలో తయారై ఉంటాయి..

అందువల్ల సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంట్లకు, ఆల్రెడీ వైరస్ సోకి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాను ఎక్కిస్తే...త్వరగా కోలుకుని,ప్రాణాపాయం నుండి బయటపడే చాన్స్ ఉంటుంది...

(ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం ప్లీజ్ వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయండి)



... .  :....::..:.:..:.:.:..:.:.:..:.:.:.:..:.:.:.:.:.:..:.:.:.:.:.:.:.:.:.:..:.:.:.:.:. .




🌀 *_అత్యంత సులువుగా అరికట్టగలిగే ఒక వైరస్ కు భయంకర రూపం చిత్రించి సమూహంలోకి వదిలారు._* కరోన నిజంగా సోకింది 2 కోట్లమందికి ఆయితే కరోన భయం 400 కోట్ల మందికి సోకింది. *6 అడుగుల దూరం, మాస్కు ధారణ, పరిశుభ్రత పాటించడం* చేతకాని మనిషి వాక్సిన్ కోసం దీనంగా చూస్తున్నాడు.

*నిజాలు:*

1.ఇది చాలా మామూలు వైరస్

2.కానీ వేగంగా వ్యాప్తి చెందగలిగే వైరస్

3.1000 మందిలో ఒకరికి ప్రమాదకరం... ఆ ఒక్కరం మనమే కావచ్చు

4.వస్తువుల ద్వారా వ్యాప్తి తక్కువ, మనుషుల ద్వారానే ఎక్కువ.

5. *_మనుషులకు దూరంగా ఉంటే 100%, 6 అడుగుల దూరం పాటిస్తే 96%, మాస్కు వాడితే 85% ఈ వైరస్ ని నివారించవచ్చు._* 

_మన జాగ్రత్తే మనకు రక్ష_ *నిర్లక్ష్యమే కరోనాకు ఆహ్వానం*

_చాలా మంది నన్ను అడిగే ప్రశ్నలు_

1.కూరగాయలు ఎలా కడగాలి.

2.పాల ప్యాకెట్స్ ఎలా కడగాలి.

3. కిరాణా సామాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

4. ప్యాకెడ్ వస్తువుల పట్ల ఏ జాగ్రత్తలు తీసుకోవాలి.

5. న్యూస్ పేపర్ ఏమి చేయాలి (ఏప్రిల్ లో నేను షాప్ కి వెళ్లి పేపర్ కొనుక్కుని వచ్చి చదివా. ఎండలో పెట్టలేదు, ఇస్త్రీ చేయలేదు, సానిటీజర్ చేయలేదు)

_ఏకైక సమాధానం:_

*మనం పుట్టినప్పటి నుండి ఏమి చేస్తున్నామో అదే చేయండి. కొత్తగా ఏమి చేయకండి.*

*_విచిత్రం ఏమిటంటే..._*


*వస్తువుల నుండి మనుషులకు వైరస్ వచ్చే అవకాశం 1%, కానీ మనం తీసుకుంటున్న జాగ్రత్తలు 99%.*

*_మనుషుల నుండి మనుషులకు వైరస్ వచ్చే అవకాశం 99% , కానీ మనం పాటిస్తున్న జాగ్రత్తలు 1%._*

_భయపడటం మానేసి, అవగాహన తో బ్రతుకుదాం!_

_Dr. A. Venu Gopala Reddy_

_MSc, PhD_ (Microbiology)


--- సేకరణ : 


బొంతపురి రవి ప్రకాష్ .


Reservations

 ....రిజర్వేషన్లు.

        ●●●

✍-భారత రాజ్యాంగము రిజర్వేషన్లు 26 జనవరి 1950 నుండి  అమలులోకి వచ్చాయి.


👉-మరి 1950 కంటే ముందు రిజర్వేషన్లు లేవా..? అంటే  ఉన్నాయి అవి గత 3,000 సంవత్సరాల నుండి కేవలం ఈ దేశంలో ఉన్న  15% బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య అనే ద్విజ  కులకు ఉన్నాయి.


✍-రిజర్వేషన్లు ఎవరికి లేవు అంటే..?


👉-శుద్రులకు మరియు స్త్రీలకు రిజర్వేషన్లు లేవు.

✍-శుద్రులు అంటే ఎవరు...?


👉-ద్విజత్వము లేదా ఉపనయనం లేదా జంధ్యము లేని వారు శుద్రులు.


✍స్త్రీలు శుద్రులు కాదా..?


👉-స్ర్రీలకు ఉపనయనం లేదు కాబట్టి వారు కూడా శుద్రులతో సమానం.


✍-☆ భగవద్గీత ప్రకారం -

-ఓ అర్జునా! పాపయోనులందు పుట్టిన స్త్రీలు, వైశ్యులు, శుద్రులు నన్ను ఆశ్రయించినచో మోక్షమును పొందగలరు..


✍భారత రాజ్యాంగము కంటే ముందు  అమలులో ఉన్న రిజర్వేషన్లు  ఒక పరిశీలన....


✍- మనుధర్మశాస్త్రం 1-96 ప్రకారం 

సకల చరాచర జగత్తులో మానవులు శ్రేష్టులు.మానవులలో బ్రహ్మణులు శ్రేష్టులు...


✍-మనుధర్మశాస్త్రం 2-31 ప్రకారం ..

నామకరణం బ్రహ్మణులకు శుభసూచకంగాను, క్షత్రియులకు బలసూచకంగాను, వైశ్యులకు ధనసూచకంగా, శుద్రులకు జుగుస్సను కలిగించేదిగా ఉండాలి.


✍మనుధర్మశాస్త్రం 1-88 ప్రకారం...

బబ్రహ్మణులువేదశాస్త్రములను చదువుట , బోదించుట , యజ్జములు చేయుట , దానము స్వీకరించుట  అను ధర్మములను పాటించవలేను 


✍మనుధర్మశాస్త్రం 1-89 ప్రకారం...

పరిపాలన ,ప్రజారక్షణ, వేదములను చదువుట  అను ధర్మములను క్షత్రియులు పాటించవలేను.


✍మనుధర్మశాస్త్రం 1-90 ప్రకారం పశుపాలన , వ్యవసాయం , వేదములను చదువుట వైశ్యులు చేయవలెను. 


✍మనుధర్మశాస్త్రం 1-91 ప్రకారం....

ఎలాంటి ఈర్ష్య,  అసుయలేకుండా శుద్రులు బ్రహ్మణ,క్షత్రియ, వైశ్య కులాలకు సేవ చేయవలేను.

ఈ విధంగా కేవలం 15% ఉన్న మూడు వర్గాల వారికి  అన్ని రకాల రిజర్వేషన్లు శాస్త్రబద్దంగా అమలు చేశారు , మరియు ఈ రోజు కూడా ఇది అమలులో ఉంది. 

పై మూడు వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే క్రమంలో 85% శుద్రుల జీవితాలను నాశనం చేసింది బ్రహ్మణ హిందూ ధర్మ రిజర్వేషన్లు.


ఉదాహరణకు...


✍- మనుధర్మశాస్త్రం 10-96 ప్రకారం...

తక్కువ కులానికి చెందిన వ్యక్తి  ఎక్కువ కులాల వృత్తిని  అవలంభిస్తాడో అట్టివాని ధనము లాగుకోని దేశము నుంచి భహిష్కరించాలి.


✍- మనుధర్మశాస్త్రం 10-129 ప్రకారం...

సామర్థ్యాము  ఉన్నప్పటికీ శుద్రుడు ధనార్జన చేయరాదు. 


✍- మనుధర్మశాస్త్రం 10-50 ప్రకారం...

శుద్రులు మహావృక్షాల వద్ద, కొండలపైన, నివసిస్తూ ప్రత్యేకమైన వృత్తులకు తగిన విధంగా కొన్ని గుర్తింపు చిహ్నాలను ధరించి సంచరించాలి.


✍- మనుధర్మశాస్త్రం 10-51 ప్రకారం....

ఛండాలురు , శ్వాపకులు నివాసాలు ఊరిబయట ఉండాలి. వీరి నివాసాలు కర్రలతో ,ఆకులతో నిర్మించుకోవాలి. కుక్కలు గాడిదలు వీరి సంపదగా ఉండాలి.


✍మనుధర్మశాస్త్రం 10-53 ప్రకారం...

ఛండాలురు శవాలమీది వస్త్రాలే ధరించాలి. పగిలిన కుండపెంకులలోనే తినాలి. ఇనుపనగలే ధరించాలి.

వారు నిరంతరము దేశదిమ్మరులుగా ఉండాలి.


✍-మనుధర్మశాస్త్రం 10-54 ప్రకారం...

అతిశుద్రులకు అన్నము ప్రత్యక్షంగా పెట్టరాదు. పనివారితో పగిలిన పాత్రలో పెట్టింవలేను.వీరు రాత్రులు యందు గ్రామాలలో గాని నగరాలలో గాని తిరగరాదు.


✍- మనుధర్మశాస్త్రం 10-55 ప్రకారం...

రాజాజ్జమేరకు అతిశుద్రులు గుర్తింపు చిహ్నాలతో రాజు నిర్ణయించే పనులకు వెల్లాలి. బంధువులు లేని శవాలను వారు మొయ్యాలి.


✍-విష్ణుధర్మం 5-104 ప్రకారం...

ఛండాలురను , హీన కులస్తులను ఎవరు తాకరాదు.

ఛండాలులు ద్విజులను తాకినట్లయితే మరణదండన విధించాలి.


👉ఈ విధంగా బ్రహ్మణ హిందూ ధర్మ రిజర్వేషన్ల కాలంలో మరియు ఈ రోజు కూడా ఛండాలురు ఈ రోజు యస్సి లు దుర్భర దారిద్య్ర జీవితాన్ని గుడుపుతున్నారు. శుద్రులు ఈ రోజు బి.సి.లు చదవు నుండి బహిష్కరించబడి కేవలం కులవృత్తులు చేసుకుంటు పేదరికాన్ని  అనుభవిస్తున్నారు.యస్టీలు ఐతే అసలు మానవసంభాందులు లేకుండా అడవులలో పశువులా బ్రతుకుతున్నారు.

కేవలం 15% బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలకు రిజర్వేషన్లను కల్పించడానికే 85% ఉన్న శుద్రుల జీవితాలను చీకటిమయం చేసింది బ్రహ్మణ హిందూ ధర్మ రిజర్వేషన్లు.


👉ఈ బ్రహ్మణహిందూ ధర్మ రిజర్వేషన్ల మూలంగా భారత దేశ సామాజిక వ్యవస్థలో నెలకొన్న  అసమానతలను తొలగించడానికి డా.బాబాసాహేబ్ అంబేడ్కర్ గారు బ్రహ్మణ హిందూ ధర్మ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి..


👉- ఈ దేశం అందరిది.ఈ దేశం పై ప్రజలందరికి సమానహక్కలు ఉన్నాయి అని సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులు అందరికి సమానంగా ఉండాలి అని , ఈ దేశ వనరుల పై అందరికి సమాన హక్కులు  ఉండాలని సంవిధాన సభలో బ్రహ్మణ పెత్తందారీ కులాల పై గళమెత్తారు.ఈ దేశంలో ఉన్న భూమి , పరిశ్రమలు, ఖనిజ సంపద ను జాతియం చేయాలని సంవిధాన సభకు సూచించారు. వేల సంవత్సరాల నుండి అన్నిరకాలుగా బలపడి ఉన్న బ్రహ్మణ పెత్రందారీ కులాలు ఈ విషయాన్ని ఒప్పుకోకుండా  వారి కుల గౌరవానికి భంగం కలగకుండా, కులం పేరిట వేల సంవత్సరాల నుండి అనుభవిస్తున్న  ఆస్తులకు భంగం కలగకుండా 85% శాతం ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు....


👉ఒక వ్యక్తి వారి కోటను కదలించగలడని వారు ఊహించలేదు.

ఒక చాకలి 

ఒక మంగలి 

ఒక గౌడ 

ఒక కాపు 

ఒక కుమ్మరి 

ఒక బెస్త 

ఒక కంసాలి 

ఒక లంబాడి

ఒక గోండు

ఒక  మాల 

ఒక మాదిగ.....ఈ విధంగా సుమారు 7,000 కులాలు 3,000 సంవత్సరాల నుండి అనేక అవమానాలు సహిస్తూ వెట్టి చాకిరీ చేసేవారు.వారు  చదవుకుని వారికి సమానంగా నిలబడతారని ఊహించలేదు... వారికి పై ఆఫీసర్ లుగా ఎదిగి వారినే  శాసించగలరని వారు ఊహించలేదు...

మంత్రులుగా , ముఖ్యమంత్రులుగా , ప్రధాన మంత్రులుగా , రాష్ట్రపతులుగా ఎదుగుతారని వారు ఊహించలేదు... 

వేల సంవత్సరాల నుండి అన్యాయన్ని ఎదుర్కోవడానికి దేవుడు పుడతాడంటు రకరకాల దేవుళ్ళను సృష్టించి కేవలం కేవలం బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలకు రక్షణ కల్పించి...

ఈ దేశ అధికశాతం ప్రజలను మోసం చేసే దేవున్ని తిరిగి అవతారమెత్తకుండా ఒక వ్యక్తి చేయగలడని వారు ఊహించలేదు...

 వారు ఊహించలోపే 3000 సంవత్సరాల నుండి అజ్జానం,అంధకారం , అంధవిశ్వాసం , ఈశ్వరవాదం, కర్మవాదం , ....మొదలగు రోగాలతో రోగగ్రస్తమైన ఈ దేశానికి ఒక్కడే ఆ రోగాలన్నింటికి చికిత్స చేశాడు.

 ఆ రోగాలన్నింటికి ఒకే మందు కనుక్కున్నాడు అదే #భారత_రాజ్యాంగము. 



ఫేస్ బుక్ నుండి సేకరించినది.


ఇట్లు

భారత నాస్తిక సమాజం మీకు తెలిసిన నాస్తికులను పరిచయం చేయడం మరువకండి.7013160831

FIR s

 *11ఏళ్ళుగా.. 143 మంది..!*


*నాలుగు వేల 15 రోజులకు 5వేల సార్లు అత్యాచారం*


*పంజాగుట్ట పీఎస్ లో కేసు నమోదు*


*హైదరాబాద్ (పంజాగుట్ట)*


11 ఏళ్లుగా 143 మంది రేప్ చేశారు అంటూ ఓ యువతి పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. సోమాజీగూడలో నివాసం ఉంటున్న యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ జారీ జారీ అయ్యింది. 42 పేజీలతో ఇది ఉంది. 138 మంది ప్రముఖులు, విద్యార్థి సంఘాల నేతల పేర్లు, మరో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులంటూ పోలీసులు రిజిస్టర్‌ చేశారు.


వివరాల్లోకి వెళితే.

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం సెట్టిపాలెం గ్రామానికి చెందిన యువతికి (25) 2009లోనే వివాహమైంది. అత్తింటిల్లో శారీరకంగా, మానసికంగా వేధించారు. 9 నెలల తర్వాత ఈ విషయాన్ని పుట్టింటి వారికి తెలియచేసింది. 2010లో భర్త నుంచి విడాకులు తీసుకుని పుట్టింటిలో ఉంటూ..చదవడం ప్రారంభించింది. ఓ _విద్యార్థి సంఘం నాయకుడు తనపై అత్యాచారం చేశాడని. నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడని వెల్లడించారు. గడిచిన 11 ఏళ్లలో అనేక మంది నటులు, యాంకర్లు, ప్రముఖుల పీఏలు తనను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లారని, వారితోపాటు స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు కలిసి తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.


ఐదు వేల సార్లు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని, వీళ్లంతా తన ఫొటోలు, వీడియోలు యూట్యూబ్‌లో పెడతానని భయపెట్టేవారని, బలవంతంగా అఘాయిత్యాలకు పాల్పడ్డారని పోలీసుల వద్ద వాపోయింది. తాము చెప్పినట్లు వినకపోతే గన్‌తో కాల్చేస్తామని, ముఖంపై యాసిడ్‌ పోస్తామని కొందరు బెదిరించేవారని, తనతో కూడా బలవంతంగా మద్యం తాగించేవారని, కొన్ని సందర్భాల్లో తాను గర్భవతిని అయ్యానని, ఆ దుండగులే బలవంతంగా గర్భం తీయించారని తెలిపింది.

బాధలు భరించలేకపోయిన తాను గాడ్‌ పవర్‌ ఫౌండేషన్‌ సంస్థ వారిని కలిశానని, వారిచ్చిన ధైర్యం, సహకారంతోనే పోలీసులను ఆశ్రయించానని తెలిపింది. ఈ మేరకు 42 పేజీలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Story's

 Read this beautiful story completely.


*ఉపాధ్యాయులు మాత్రమే కాదు అందరూచదవవలసిన ఓ మంచికథ!!*


*🔮బహుమతి* ....తప్పకుండా చదవండి.. నాకైతే కళ్ళు చెమర్చాయి..


```

ఉదయం పూజ అయ్యాక, పేపరు చదువుకుంటున్న నేను... ఎవరో కాలింగ్‌బెల్‌ కొడితే వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఓ యువకుడు చేతిలో శుభలేఖలతో ‘‘మాస్టారూ, బాగున్నారా?’’ అని పలకరించాడు.

వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్ల ‘ఎవరా’ అని ఆలోచిస్తూ యథాలాపంగా ‘‘ఆ, బాగానే ఉన్నాను. లోపలికి రా బాబూ’’ అన్నాను.

లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ‘అతడెవరా’ అని ఆలోచిస్తున్నాను. మర్యాద కోసం ‘‘మంచినీళ్ళు కావాలా?’’ అని అడిగాను. వద్దన్నాడు.

గొంతు సవరించుకుని అతడే అడిగాడు- ‘‘నన్ను గుర్తుపట్టారా మాస్టారూ?’’ అని.

నేను తటపటాయిస్తుంటే చిరునవ్వుతో అన్నాడు ‘‘నేను సత్యమూర్తి నీ. మీ స్కూల్లో చదివాను. మా నాన్నగారు ఆ రోజుల్లో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా చేసేవారు’’ అని.

అప్పుడు గుర్తుకు వచ్చింది. సత్యమూర్తి చాలా మంచి స్టూడెంట్‌. బాగా తెలివైనవాడు. ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేవాడు. అతడు స్కూల్లో చేరినరోజే వాళ్ళ నాన్నగారు నన్ను కలిసి ‘మాస్టారూ, మావాడు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని నా కోరిక. ఏ తప్పుచేసినా అల్లరిచేసినా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కొడుకని చూడకుండా దండించండి. నేనేమీ అనుకోను. వాడు బాగా చదువుకుంటే అదే పదివేలు’ అని చెప్పారు. వృత్తిరీత్యా ఎంతోమంది రాజకీయ నాయకులని చూసిన నాకు, ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ రోజుల్లో నేను హెడ్‌మాస్టర్‌గా పనిచేసేవాణ్ణి. పిల్లలకి గణితం, సైన్సు బోధించేవాణ్ణి.

అయితే సత్యమూర్తి దండించే పరిస్థితులు వచ్చేలా ప్రవర్తించలేదు. చాలా బాగా చదివేవాడు. ఏ సందేహం వచ్చినా అడిగి నివృత్తి చేసుకునేవాడు. అతడికి చదువులో, ముఖ్యంగా గణితం మీద ఉన్న అభిరుచి చూసి అతడికి మరింత శ్రద్ధతో కిటుకులు బోధించేవాణ్ణి.

కుశలప్రశ్నలయ్యాక, అతడు వచ్చిన పని చెప్పాడు. ‘‘మాస్టారూ, వచ్చే పదిహేనో తారీఖున నా పెళ్ళి, మా స్వగ్రామంలో. మర్నాడు సాయంత్రం ఈ ఊళ్ళోనే రిసెప్షన్‌. మీరూ అమ్మగారూ పెళ్ళికి తప్పకవచ్చి మమ్మల్నిద్దరినీ ఆశీర్వదించాలని నా ప్రార్థన. మీరు ఎప్పుడు బయల్దేరతారో చెబితే, నేను మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి కారు ఏర్పాటు చేస్తాను’’ అంటూ, నా చేతిలో శుభలేఖ పెట్టి, నాకూ మా ఆవిడకీ పాదాభివందనం చేశాడు.

శుభలేఖ చూశాను. అర్ధరాత్రి ముహూర్తం. నేను అతడికి మృదువుగా చెప్పాను- ఆరోగ్యరీత్యా ప్రయాణించలేమనీ వీలైతే రిసెప్షన్‌కి వస్తాననీ చెప్పాను. పెళ్ళికి రాలేమని అనేసరికి అతడి ముఖం కొద్దిగా చిన్నబోయింది. అయితే రిసెప్షన్‌కి ఇద్దరూ తప్పక రావాలని మాట తీసుకుని మరీ బయల్దేరాడు. కారు పంపవద్దనీ మేమే వస్తామనీ చెప్పాను.

పెళ్ళి రెండ్రోజులుందనగా మా ఆవిడ జయ, రిసెప్షన్‌ గురించి గుర్తుచేసి, బహుమతి ఏమిద్దామని అడిగింది. సత్యమూర్తి చాలా ధనవంతుడు. అతడి స్థాయికి తగిన బహుమతి ఇచ్చే తాహతు నాకు లేదు. చాలాసేపు ఆలోచించిన తరవాత నా ఉద్దేశ్యం జయకి చెప్పాను, తనూ అంగీకరించింది.

రిసెప్షన్‌కి నేనూ జయా వెళ్ళాం. సత్యమూర్తి స్నేహితులైన నా పూర్వవిద్యార్థులు కొంతమంది కలిశారు. సత్యమూర్తి తండ్రి వచ్చి పలకరించారు. రిసెప్షన్‌ మొదలయ్యాక నేనూ జయా వేదిక మీదకి వెళ్ళి వధూవరులని ఆశీర్వదించాం. సత్యమూర్తి చేతిలో నేను తీసుకెళ్ళిన కవరు పెట్టాను.

ఆ కవరులో పెట్టిన ఉత్తరంలో ఇలా రాశాను.


చిరంజీవి సత్యమూర్తికి

ఆశీస్సులు.

ఈ సమయంలో ఉత్తరం ఏమిటీ అని ఆశ్చర్యపోతున్నావా? తమ ఉన్నతికి పాటుబడిన ఉపాధ్యాయులని ఏమాత్రం పట్టించుకోని ప్రస్తుత కాలంలో నువ్వు గుర్తుపెట్టుకుని వెతుక్కుంటూ వచ్చి ఎంతో అభిమానంగా మమ్మల్ని నీ పెళ్ళికి ఆహ్వానించినందుకు చాలా సంతోషమైంది.

వృద్ధాప్యం వల్ల ఈమధ్య మా బంధువులలోనైనా ఎవరైనా పెళ్ళికి ఆహ్వానించినా అంతగా వెళ్ళడం లేదు. నీ విషయంలో ఈ పద్ధతికి విరామం

ఇద్దామని నిర్ణయించుకున్నాను. కారణాలు అనేకం. నువ్వు నా అభిమాన విద్యార్థివి కావడం, మీ తండ్రిగారి మీద నాకున్న గౌరవం... వగైరా.

వచ్చిన చిక్కల్లా ‘నీకు ఏ బహుమతి ఇవ్వాలా’ అన్నదే. మనమిచ్చే బహుమతి అవతలివారికి ఉపయోగపడేలా ఉండాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో నీకు ఎలాంటి బహుమతి ఇవ్వాలా అని చాలా తర్జనభర్జనపడ్డాను. ఎంత ఆలోచించినా సరైన వస్తువేదీ నా బుద్ధికి తట్టలేదు. ఏ వస్తువు అనుకున్నా అది నీ తాహతుకి చాలా తక్కువవుతుందనిపించింది లేదా నీ దగ్గర ఇప్పటికే ఉండి ఉంటుందని పించింది. డబ్బే ఇద్దామనుకుంటే, నేనివ్వగలిగిన మొత్తం నీకు చాలా తక్కువవుతుందనిపించింది. అటువంటి సమయంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఉత్తరంతో జతచేసిన కాగితమే నేను నీకు ఇస్తున్న బహుమతి.

నువ్వూ నీ సహధర్మచారిణీ ఎంతో ఆనందంగా మీ భావిజీవితాన్ని గడిపేలా చేయమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం....

దీవెనలతో,

శంకరం మాస్టారు


డిన్నర్‌ చేశాక వద్దంటున్నా మా ఇద్దరికీ బట్టలు పెట్టారు అతడి తల్లిదండ్రులు. తీసుకోకపోతే సత్యమూర్తి బాధపడతాడంటూ బలవంతం చేశారు. చాలా మొహమాట మేసింది మాకు. అలాగే వద్దంటున్నా మమ్మల్ని కారులో మా ఇంటి దగ్గర దిగబెట్టారు.

నెల రోజుల తర్వాత నా పేరున ఓ ఉత్తరమొచ్చింది. తెరిచి చూస్తే అది సత్యమూర్తి రాసినది.


దైవసమానులైన మాస్టారుగారికి,


నమస్కారములు.

నా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఇద్దరినీ ఆశీర్వదించినందుకు సంతోషం. ఆరోజు నా పెళ్ళి రిసెప్షన్‌లో మీరు ఇచ్చిన బహుమతి చూశాక, దానికి జతచేసిన ఉత్తరం చదివాక చాలాసేపు అలా ఉండిపోయాను. మేధావులు ఎందుకు ప్రత్యేకంగా ఉంటారో అర్థమయింది.

మీరు రూ.1,116 నా పేరున ఓ అనాథ శరణాలయానికి విరాళంగా ఇచ్చి, ఆ రసీదు జత చేశారు. నా పెళ్ళికి వచ్చిన అన్ని బహుమతులలో దీన్ని అత్యంత విలువైనదిగా భావిస్తాను.

స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మీరు నాకు ఓ రోల్‌మోడల్‌. చిన్నప్పటి నుండీ నేను ఇతరులని ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాణ్ణి. అలాగే స్కూల్లో చదువుతున్నప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉండేవాణ్ణి. అందువల్ల నేనుచాలా మంచి విషయాలే నేర్చుకున్నాను.

నేను ప్రస్తుతం ఇంత మంచి స్థాయిలో ఉండటానికి అవి ఎంతో ఉపయోగపడ్డాయి. కానీ, మీ బహుమతి నన్ను ఆలోచించేలా చేసింది. మీరన్నట్లు మామూలుగా అయితే రూ.1,116 నాకు చాలా చిన్న మొత్తమే. కానీ మీరు ఆ మొత్తాన్ని ఓ అనాథశరణాలయానికి విరాళంగా ఇచ్చారు- అదీ నా పేరున.

మీరు చేసిన ఈ గొప్పపని నాలో ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. అనేకసార్లు నేను చేసే అనవసర ఖర్చుల్ని గుర్తుచేసింది. మీరు ఇచ్చిన బహుమతిని నేను అప్పుడే అనుకరించేశాను. నా పెళ్ళయిన మూడు రోజులకి మా కజిన్ పెళ్ళి అయ్యింది. వాడికి లెక్కపెట్టలేనంత డబ్బు ఉంది. అందుకని మేమిద్దామనుకున్న రూ.50,000లని ఓ అనాథ శరణాలయానికి వాడి పేరుమీద విరాళంగా ఇచ్చాం. వాడెంత సంతోషించాడో మాటల్లో చెప్పలేను. మీరు మాకు ఓ కొత్త మార్గాన్ని చూపారు. మేమెందరమో ఈ కొత్త దారిలో ప్రయాణించే అవకాశం కల్పించారు.

ఇలా మీరు మీ చర్యలతో మాకు ఎప్పుడూ బోధిస్తూనే ఉన్నారు- ఉద్యోగంలో ఉన్నప్పుడూ రిటైర్‌ అయ్యాకా కూడా. అదే మీ గొప్పతనం.

పాదాభివందనాలతో,

మీ విద్యార్ది,

సత్యమూర్తి.


అతడి గొప్ప వ్యక్తిత్వానికి మనసులోనే హర్షిస్తూ, ఉత్తరం జయ చేతిలో పెట్టాను```కథ 

Dr.B.Srinivas🌹🤝





,,,,........     ,,,,,.......      ,,,,,,,.....       ,,,,,,,.........      ,,,,,,....







కథ – ధర్మం 🙏


ఒక ఊళ్లో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్లవాడు చదువుకొనేందుకు అవసరమైన డబ్బులు కూడా ఉండేవి కావు వాడి దగ్గర. అందుకని వాడు ఇల్లిల్లూ తిరిగి, ఇంట్లోకి పనికి వచ్చే వస్తువులను అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బుతో చదువుకొనేవాడు.


ఒకరోజున, అలా అమ్మకానికి పోయినప్పుడు, అతనికి బాగా ఆకలి వేసింది. ఎండ విపరీతంగా ఉన్నది; నీరసంగా ఉంది; ఇక తిరగలేని పరిస్థితి. చేతిలో ఒక్క రూపాయి మాత్రమే ఉంది. ఏంచేయాలి?


‘అక్కడున్న ఇంటి తలుపుతట్టి, కొంచెం అన్నం పెట్టమని అడుగుదాం’ అనుకున్నాడు అతను. వెళ్ళి ఇంటి తలుపు కొట్టాడు- అయితే ఓ చక్కని యువతి ఇంటి తలుపు తెరిచేసరికి, వాడికి ఇక ఏమి అడగాలో తోచలేదు- “ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తారా?” అని మాత్రం అడగ గల్గాడు.అయితే, పిల్లవాడి ముఖం‌ చూస్తే, ‘వాడికి ఆకలిగా ఉంది’ అని ఎవరైనా కనుక్కోగలరు. అందుకని ఆమె మంచినీళ్లకు బదులు, వాడికి ఒక పెద్ద గ్లాసెడు పాలు తీసుకొచ్చి ఇచ్చింది. పిల్లవాడికి ప్రాణం లేచివచ్చినట్లైంది. సంతోషంగా గ్లాసెడు పాలూ త్రాగేశాడు- త్రాగేశాక మళ్ళీ గుర్తుకొచ్చింది- ‘తన దగ్గర ఉన్నది ఒక్క రూపాయే!’ అని.


పిల్లవాడికి చాలా సిగ్గు వేసింది. అయినా అడిగాడు, జేబులో‌చెయ్యి పెడుతూ- “మీకు ఎంత చెల్లించాలి?” అని.


“నువ్వు ఏమీ చెల్లించనవసరం లేదులే!”అన్నది ఆ యువతి నవ్వుతూ. “దయతో చేసిన పనికి ప్రతిఫలం తీసుకోకూడదట- మా అమ్మ చెప్పింది!” అన్నది.


పిల్లవాడి కళ్ళు చెమర్చాయి. “అయితే మీరు కనీసం నా హృదయపూర్వక కృతజ్ఞతలు స్వీకరించాలి” అని చెప్పి, వాడు అక్కడినుండి ముందుకు సాగాడు.


ఆ గ్లాసెడు పాలతో పిల్లవాడి ఆకలి అప్పటికి ఎలాగూ తీరింది- శారీరకంగా సత్తువ వచ్చింది. అయితే దానితోబాటు వాడి మనస్సూ మార్పుకు లోనైంది. మనిషిలోని మంచితనం పట్లా, దేవుని కరుణ పట్లా ఆ పసి హృదయంలో నమ్మకం ఒకటి, చిన్న విత్తనం మొలకెత్తినట్లు, మొలకెత్తింది. రాను రాను అది బలపడింది-

ఆ పిల్లవాడు పెద్దయ్యేసరికి, ఆ నమ్మకం అతనిలో వ్రేళ్ళూనుకున్నది.


చాలా సంవత్సరాలు గడిచాయి. రోజులు ఒకేలాగా ఉండవు. అప్పటి ఆ యువతి ఇప్పుడు పెద్దదైంది. ఏదో ప్రమాదకరమైన జబ్బుకు లోనై, ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. స్థానికంగా ఉన్న వైద్యులకు లొంగలేదు ఆ జబ్బు. వాళ్ళు ఆమెను పట్టణానికి వెళ్ళి ప్రత్యేక వైద్యులకు చూపించమన్నారు. ఆమెను చేర్చుకున్న ఆసుపత్రి వాళ్ళు ఆమె సమస్యను పెద్ద డాక్టరు గారికి అప్పగించ దలచారు. ఆమె వివరాలున్న ఫైలును డాక్టరుగారి దగ్గరికి పంపించారు. ఆమె ఊరి పేరు చూసిన డాక్టరుగారు వెంటనే లేచి, ఆమెను చూసేందుకు బయలుదేరి వచ్చారు.


ఆమెను చూడగానే పెద్ద డాక్టరుగారికి కళ్ళు చెమర్చాయి. ‘ఎలాగైనా ఆమెను రక్షించాలి’ అని నిశ్చయించుకొని, ఆయన ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది- చాలా రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన తర్వాత, చివరికి ఆమె తన జబ్బు నుండి బయటపడింది!


ఇక ఆమె ఇంటికి వెళ్ళవచ్చు- వెళ్ళేముందు ఆసుపత్రికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించటమే తరువాయి: ఎంత ఖర్చు అయ్యిందో‌మరి! ఆమెకు బిల్లు పంపించేముందు దాన్ని తనకోసారి చూపించమని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు పెద్ద డాక్టరుగారు. దాన్ని చూసిన తరువాత, ఆయన ఆ బిల్లు చివరలో ఏదో రాసి, ఆమెకు అందజేసారు.

ఆమె ఆ బిల్లును చూసేందుకు కూడా భయపడింది- ఎందుకంటే, ఆమెకు తెలుసు- అంత పెద్ద మొత్తాన్ని తను జీవితాంతం కష్టపడినా చెల్లించలేదు! అయినా చేసేదేమీ లేదు- ఆసుపత్రికి డబ్బు కట్టాల్సిందే! వణికే చేతులతో కవరును తెరిచిందామె… బిల్లు చివర్లో‌ రంగు ఇంకుతో వ్రాసిన అక్షరాలు ఆమెను ఆకర్షించాయి:


ఒక పెద్ద గ్లాసెడు పాలద్వారా ఈ బిల్లు మొత్తం పూర్తిగా చెల్లించబడింది.

సం/-


దయ కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేయాలి. మన కరుణ, సహాయం చేసే గుణం తిరిగి మనకెలా అక్కరకు వస్తాయో ఎవ్వరమూ చెప్పలేము!


మనం ఏపంట వేస్తే అదే పంట కోస్తాం మనం పుణ్యంచేస్తే ఆ పుణ్యమే మనల్ని కాపాడు తుంది అదే పాపం చేస్తే అదే పాపం మనల్ని భక్షిస్తూంది అందుకే మనం ధర్మం చెస్తూ మన పిల్లల చేత కూడా ఈ ధర్మం చేయుస్తూ ఉండాలి అప్పుడు వారు ఎంత పెద్దవారైనా ధర్మం చేయుటం మర్చి పోకుండా ఉంటారు ఆ ధర్మమే వారిని రక్షిస్తుంది.🙏


శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏





.......,,,,,,,,,         .......   .,,,,, ,.........    ........,,, ,,  .....






🌹🌹🌹🌹🌹🌹🌹

*ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు.. ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట! కాని కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.*


*నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే.. నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం...ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..మనిషికి ఎంత బలం వస్తుందో...ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.*


*ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!*


*రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా* *ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా* *అదిలించాడు. అంతే!    రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది.*

*పెద్దాయన ఆశ్చర్యంతో, " సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ‌, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?"*

*రైతు, "ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా!* *ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకంతో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!"*

*రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!*


*పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం.*. 

*కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేక పోవటం...*


*కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేయండి..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి..  మనలో ఒకరికి ఒకరు ఐక్యత ముఖ్యం.*


*ప్రతి ఒక్కరి కథా కంచికి చేరుతుంది. ఆలోపునే మనం మనుషులుగా ఎదగాలి*

    🌹🌹🌹🌹🌹🌹





::::::::::::::::: :::::::::::::::: :::::::::::::::: :::::::::::::::: : ::: : :    ::::::::: 






ఉదయం 6:00 అయ్యింది. రాత్రి ఏమైందో ఏమో బాగా అలసట గా అనిపించి, గుండెల్లో కొంచెం నొప్పి అనిపించింది. తట్టుకోలేక అక్కడే పడిపోయాను. తర్వాత నన్ను ఎవరు తీసుకొచ్చారు ఎవరు పడుకోబెట్టారు ఏమి గుర్తు లేదు. అబ్బా! తల పగిలిపోతుంది వెంటనే లేచి కాఫీ తాగాలి. నా భార్య ఎక్కడ? ఈపాటికే నన్ను లేపి కాఫీ టేబుల్ మీద పెట్టి వెళ్తుంది. ఇవాళ ఏంటి ఆలస్యం అయింది ? సరేలే ఏదో పనిలో ఉంటుంది. నేనే వెళ్ళి అడిగి తెచ్చుకుంటా. ఇదేంటి! హాల్ లో ఎంత మంది ఉన్నారు ఏంటి? ఏమైంది? సరే దగ్గరికి వెళ్లి చూద్దాం.


నా భార్య ఏడుస్తోంది ఏంటి? నా కొడుకు కి ఏమైంది వాడు ఎందుకు అంతలా ఏడుస్తున్నాడు? నా స్నేహితుడు కూడా వచ్చాడు. వాడికి నాకు ఏడాది క్రితం గొడవైంది. ఇప్పటివరకూ మాట్లాడుకోలేదు. వాడు మాట్లాడకపోతే నేను ఎందుకు మాట్లాడాలి. ఏమో ఎందుకు వచ్చాడో.  ఏంటిది ?  ఎవరో చచ్చిపోయినట్టు ఉన్నారు. ఈ ఇంట్లో ? ఎవరై ఉంటారు? అమ్మానాన్న లో ఎవరైనా? లేదు ముందు వాళ్ళ రూమ్ లో చూద్దాం. అమ్మ నాన్న బానే ఉన్నారు కదా. కానీ వీళ్లు కూడా ఏడుస్తున్నారు ? అసలు ఎవరో ఒకసారి చూస్తే గానీ అర్థం కాదు.


ఎవరది? ఏంటి అది అది అది నేనే. నేను చనిపోయానా ? ఎలా ? లేదు నేను చనిపోలేదు. నా భార్య ముందు బిగ్గరగా అరుస్తున్న వినట్లేదు. నా కొడుకు కూడా నేను పిలుస్తున్న పలకట్లేదు. పోనీ అమ్మానాన్నలు చెబుదామా? అయ్యో వాళ్లు కూడా నా మాట వినట్లేదు. నా స్నేహితుడికి చెప్తే? ఇంక ఈగో చంపుకొని నేనే వెళ్ళి వాణ్ణి క్షమాపణ అడుగుతాను. జరిగిన గొడవలో ఎంతో కొంత నాతో కూడా ఉంది కదా. అరే వీడు కూడా పలకట్లేదు ఏంటి? అంటే నేను నిజంగానే చనిపోయానా ?


అయ్యో ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కష్టపడి నన్ను బాబుని అమ్మానాన్నల్ని చూసుకుంటున్న నా భార్యతో ఒక్కసారి కూడా తను అందంగా ఉందని చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలి. అలాగే నాకు ఏ సమస్య రాకుండా ఇంటి బాధ్యత మొత్తం తనే తీసుకున్నందుకు థాంక్స్ కూడా చెప్పాలి. ఉద్యోగంలో పడి నా కొడుకుతో ఇప్పటివరకు నేను సరిగ్గా మాట్లాడలేదు. వాడితో మాట్లాడాలి. ఆడుకోవాలి. మా అమ్మ నాన్న లను కూడా ఈ మధ్య సరిగా పట్టించుకోవడం లేదు. వాళ్లతో కొంత సమయం గడపాలి. అలాగే నా స్నేహితుడికి క్షమాపణ చెప్పాలి. కుటుంబం మొత్తాన్ని ఎక్కడికైనా టూర్ కి తీసుకెళ్లాలి. వాళ్లతో కొన్ని రోజులు సరదాగా గడపాలి.


ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి..

ప్లీజ్ దేవుడా నా తప్పులను క్షమించి ఇంకొక అవకాశం ఇవ్వు దేవుడా. ఒక్కసారి బ్రతికించు దేవుడా ప్లీజ్ దేవుడా. నాకు ప్రాణబిక్ష పెట్టు దేవుడా. ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా. ఇలా అంటుండగానే నన్ను ఎవరో గట్టిగా కుదిపినట్టు అనిపించింది. నాకేం అర్థం కావట్లేదు. మెల్లగా నా భార్య నన్ను లే అంటున్నట్టు వినిపిస్తోంది. ఇప్పుడు ఇంకా బిగ్గరగా వినిపిస్తోంది. ఒక్కసారిగా కళ్లు తెరుచుకున్నా. నా భార్య పక్కనే ఉంది. నేను నా రూమ్ లోనే ఉన్నాను. టేబుల్ మీద కాఫీ కూడా ఉంది. ” ఏమైంది ఏమైనా కల వచ్చిందా? ఎందుకలా కలవరిస్తున్నావు?” అని నవ్వింది నా భార్య. అంటే నేను బతికే ఉన్నానా? హమ్మయ్య నేను బతికే ఉన్నా! 


కాఫీ తాగి లేచి రెడీ అయ్యి ఆఫీస్ కి వెళుతూ నా భార్యకి నువ్వు అందంగా ఉన్నావు. నువ్వు ఇంట్లో అంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు కాబట్టి నేను ఆఫీసులో శ్రద్ధతో పని చేయగలుగుతున్నాను. అన్నిటికీ థాంక్యూ. అని చెప్పాను. ఆనందంతో తన కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అమ్మానాన్నలతో కూడా ఓ పావుగంట మాట్లాడాను. బాబుని స్కూల్లో దించేసి. నేను ఆఫీస్ కి బయలుదేరాను. దారిలో నా స్నేహితుడికి ఫోన్ చేశాను. సారీ చెప్పాను. అరే మనలో మనకు సారీలు ఏంట్రా? సాయంత్రం కలుద్దాం అని అన్నాడు.


ఎందుకో తెలీదు రోజు కంటే ఇవాళ ఆఫీస్ కి కొంచెం ఉత్సాహం తో వెళ్తున్నాను. ఏదో బరువు తగ్గినట్టు అనిపిస్తోంది. బహుశా ఇవాళ నా ఇగో ని పక్కన పెట్టి మనసు చెప్పిన మాట విన్నాను. అందుకే ఏమో కొంచెం తేలికగా అనిపిస్తుంది. మీరు కూడా నాకెందుకు ? నేను ఏంటి ఒకళ్ళకి సారీ చెప్పేది? ఇష్టముంటే వాళ్లే వచ్చి మాట్లాడారు. ఇలాంటి ఆలోచనలను పక్కన పెట్టి అందరితో మంచిగా మాట్లాడండి. కుటుంబానికి కొంత సమయం కేటాయించండి. స్నేహితులతో మంచి రిలేషన్ ఏర్పరుచుకోండి. తర్వాత చేద్దాం అన్న ఆలోచన తీసేయండి. ఏదైనా మంచి పని చేయాలి అనిపిస్తే వెంటనే చేసేయండి. ఈ జీవితం మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్లు తప్పు లేకుండా నొప్పించకండి. నెగిటివిటీ ని దూరంగా ఉంచండి. ఉన్న ఈ ఒక్క జీవితాన్ని నవ్వుతూ హాయిగా గడపండి. సంతోషం మీ ఆలోచనలకు బలం. మీ అర్జున్...








::::::::: :::::::::::    :::::::::    ::::::::::::   ::::::::::::     ::::::::::: :::::: :::::






మన పూర్వీకులు అసలు ముగ్గు ఎందుకు పెట్టేవారు ఆ ముగ్గుల అర్థం పరమార్థం ఎటి అనేది తెలుసుకుందాంమే🙏


💮ఇంటి   గడప ముందు ముగ్గులో భాగంగాగీసే రెండు అడ్డగీతలు ఇంటి లోనికి దుష్టశక్తులను రాకుండా    నిరోధి స్తాయి.

ఇంట్లోఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళ కుండా చూస్తాయి.

💮ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభ కార్యాలు,     మంగళకరమైన     పనులు జరుగుతున్నాయని గుర్తు!      పండుగల సమయంలో   ఈ విధంగా   ఖచ్చితంగా వేయాలి.  

💮💮💮💮💮 ఏదేవతపూజచేస్తున్నా దైవాన్నిఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు   వైపులా    రెండేసి    గీతలను తప్పక గీయాలి.

💮నక్షత్రం ఆకారం  వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత,  పిశాచాలను ఆ దరిదాపులకు  రాకుండా చూస్తుంది. అంతే కాదు,   మనం వేసే పద్మాలు,చుక్కల ముగ్గులలో కూడా మనకుతెలీని అనేక కోణాలు   దాగి ఉన్నాయి.అవి కేవలం గీతలే కాదు,  యంత్రాలు కూడా!యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో   కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

💮తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి!    

💮💮💮💮💮యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం 

మీద  నాలుగు   గీతలతో కూడిన ముగ్గులేయాలి.     దైవకార్యలలో  కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

💮నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి  చుట్టు ప్రక్కల    లతలు,  పుష్పాలు,  తీగలతో కూడిన ముగ్గులు వేయాలి!

💮దేవతా రూపాలను, ఓం,  స్వస్తిక్, శ్రీ గుర్తులను     పోలిన ముగ్గులు   వేయ కూడదు,    ఒకవేళ   వేసినా      వాటిని తొక్కకూడదు.

💮ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు,   

శ్రీ మహావిష్ణు వు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో,  ఆస్త్రీకి ఏడు జన్మలవరకు వైధవ్యం రాదని, మరియు సుమంగళిగానే మరణిస్తుందని     దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం     చెబు తున్నాయి.

💮పండుగ వచ్చింది కదా అని, నడవ డానికి చోటు లేకుండా     వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు!

💮ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తాము.దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీ కరించదు. ఏరోజుకారోజు బియ్యపు పిండి తో ముగ్గు పెట్టాలి!

💮నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర దీపా రాధన  చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. 

💮ముగ్గు  పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

💮ముగ్గులు శుభసూచకాలుగా   పని చేస్తాయి. 

💮  పూర్వం రోజూ సాధువులు,సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగే వారు.ఏఇంటిముందైనా ముగ్గులేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు.  వారే కాదు అడ్డుక్కునే వారు   కూడా  ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. 

💮ముగ్గు లేదంటే   అక్కడ    అశుభం జరిగిందని గుర్తు! అందుకే మరణించి న వారికి    శ్రాద్ధకర్మలు    చేసే   రోజున ఉదయం ఇంటిముందు ముగ్గువేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యా హ్నమైనా ముగ్గు వేస్తారు.

💮ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి.మనం ఆచరించే ఏఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ  అనేకా నేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.🙏







Friday, August 21, 2020

Telugu Satires

 ఛ.. చెవులు పిండాలని తెలియక మా అమ్మ నాకు తొడపాశం పెట్టేది.

మా అమ్మ కంటే పంతులమ్మే నయమనుకుని సచ్చినట్టు బడికి పోయిన.

లేదంటే, నేను కూడా మోదీలెక్క బడి గోడ దుంకి,‌ ఛాయ్ అమ్మి, ఆఖర్కి ఈ దేశాన్ని కూడా అమ్మేంత గొఫ్ఫోన్ని అయ్యె'టోన్ని'.

తెలుగు నేల హిస్టోరికల్ అచీవ్మెంట్ మిస్సైంది 



.....,,,    ,  ......,,,,.....,,,,......,,,....       ,,,,.......    ,,,,,,...... 




ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం..

*ఐస్క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది*.

జీవితం కూడా అంతే...

*ఏంజాయ్ చేసినా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది*.

• అదేదో ఏంజాయ్ చేసిపోతే, ఆ జీవితానికి ఓ పరమార్థం వుంటుంది.

• *తర్వాత నరకం, స్వర్గం అంటారా*?!?! ఉన్నాయో, లేవో కూడా ఎవడికి తెలియదు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు.

• తాగినోడు *ఎదవ కాదు, తాగలేనోడు మహానుభావుడు* కాదు.

• పోని తాగలేనోడు నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే, ఆ గ్యారంటీ లేదు.

• ఎవడిపాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది. 

ఫైనల్ గా చెప్పదేంటంటే...

*టైం టు టైం తినండి, పడుకొండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యాలు జాగ్రత్త*. 

• ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద *ఐశ్వర్యమా*?

• లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం *ఐశ్వర్యమా*!.

• *ఐశ్వర్యం* అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!

• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు *ఐశ్వర్యం*.

• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య *ఐశ్వర్యం*. 

• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు *ఐశ్వర్యం*. 

• అమ్మ చేతి భోజనం *ఐశ్వర్యం*. 

• భార్య చూసే ఓర చూపు *ఐశ్వర్యం*. 

• పచ్చటి చెట్టు, పంటపొలాలు *ఐశ్వర్యం*. 

• వెచ్చటి సూర్యుడు *ఐశ్వర్యం*. 

• పౌర్ణమి నాడు జాబిల్లి *ఐశ్వర్యం*. 

• మనచుట్టూ ఉన్న పంచభూతాలు *ఐశ్వర్యం*. 

• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు *ఐశ్వర్యం*. 

• ప్రకృతి అందం *ఐశ్వర్యం*.  

• పెదాలు పండించే నవ్వు *ఐశ్వర్యం*. 

• అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు *ఐశ్వర్యం*. 

• బుద్ధికలిగిన బిడ్డలు *ఐశ్వర్యం*. 

• బిడ్డలకొచ్చే చదువు  *ఐశ్వర్యం*. 

• భగవంతుడిచ్చిన ఆరోగ్యం  *ఐశ్వర్యం*. 

• చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి *ఐశ్వర్యం*. 

• పరులకు సాయంచేసే మనసు మన *ఐశ్వర్యం*.

• *ఐశ్వర్యం* అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు. 

• కళ్ళు చూపెట్టే ప్రపంచం *ఐశ్వర్యం*. 

• మనసు పొందే సంతోషం *ఐశ్వర్యం* ధన్యవాదాలు _  🙏 .




88888888888   8888888   88888   8888::::::    ::::::::   




*అప్పట్లో కష్టం అంటే* - 🤔


తినడానికి..... సరైన తిండి దొరక్కపోవడం🍱


చదివినా.... ఉద్యోగం దొరక్కపోవడ0👨🏻👨🏻👨🏻‍🎓


భార్యకి... భర్తపోరు👨🏻👨🏻👨🏻‍💼... అత్తపోరు👵🏻 


ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు👰🏻 


ఆరుగాలం కష్టపడిన రైతుకి... పంట చేతికి అందకపోవడం🌽🌾

 

ఇంటిల్లపాది....

ఒక్కరి సంపాదనతో బ్రతకడం💰 


చాలీచాలని జీతాలు💵


ఇలా ఒకస్థాయిలో ఉండేవి. 


మిగతావాటికి చాలావరకు సర్దుకుపోయేవారు.... సరిపెట్టుకునేవారు. 


*ఇప్పుడు కష్టం అనే రూపురేఖలు మారిపోయాయి* - 🙄


పరీక్ష తప్పితే కష్టం📝 


అమ్మ తిడితే కష్టం🙅🏻 


నాన్న కొడితే కష్టం🥊 


పాఠాలు నేర్పే గురువు అరిస్తే కష్టం🗣 


సరైన చీర కొనకపోతే కష్టం🛍...! 


*ఇప్పటివారి కష్టాలకి కారణం ఒక్కటే* - 🤔


అనుకున్నది.... దొరకాలి 😃

అప్పుడు.... కష్టం లేనట్లు 😀 


పిన్నీసు📎 దొరక్కపోయినా, 

ప్రాణం పోయేంత.... కష్టం వచ్చినట్లు బాధ పడిపోతున్నారు😭


అప్పట్లో మనస్సు చాలా బలంగా ఉండేది❤ 


ఎందుకంటే చిన్ననాటి నుండి కష్టాలు చూసి పెరిగేవారు😧 


ఇప్పుడు కష్టం అంటే ఏంటో తెలియకుండా.... 

తల తాకట్టుపెట్టయినా పిల్లలు కోరిందల్లా...


వాళ్ళ కాళ్ళ ముందు పెడుతున్నాము📱⌚👖 


మానసిక బలం తగ్గిపోబట్టి వాళ్ళకిప్పుడు ప్రతీది కష్టమే😣 


అంతెందుకు మొన్న 


కర్ణాటక లో ఒక IAS ఆఫీసర్🤵🏻

కోస్తాంధ్ర లో ఒక IPS ఆఫీసర్👨🏻👨🏻👨🏻‍✈️ 

సినిమా హీరోలు🕺🏻👨🏻👨🏻👨🏻👨🏻👨🏻‍🎤

ఎంతోమంది సబ్ ఇన్స్పెక్టర్లు👮🏻

ఐఐటీ స్టూడెంట్స్👨🏻👨🏻👨🏻👨🏻👨🏻‍💻👩🏻👩🏻👩🏻👩🏻👩🏻‍💻

మెడికోస్👨🏻👨🏻👨🏻👨🏻👨🏻‍⚕👩🏻👩🏻👩🏻👩🏻👩🏻‍⚕


కూడా మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య లు చేసుకున్నారు🔪🔫⚰


ఇప్పటి *కొత్తతరం పెద్దలకి* చెప్పేది ఏంటంటే - 👌🏼


చదవండి.. చదివించండి. 

దాంతోపాటే కష్టపడడం నేర్పండి👨🏻👨🏻👨🏻👨🏻👨🏻‍🔧👩🏻👩🏻👩🏻👩🏻👩🏻‍🌾👩🏻👩🏻👩🏻👩🏻👩🏻‍🍳👨🏻👨🏻👨🏻👨🏻👨🏻‍🚒


"మేము పడుతున్న కష్టం చాలు,....

పిల్లలెందుకు కష్టపడాలి🤔" 

అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు☹️!


మీరు ఎంత కష్టపడుతున్నారో తెలియజేస్తూ వారిని పెంచండి😇 


అప్పుడే వారికి కష్టం విలువ తెలుస్తుంది.


జీవితంలో వారు స్థాయిలను చేరుకోవడానికి పునాది అవుతుంది 

🙏🙏🙏👍👍👍

Hope that you will understand....😍


Thursday, August 20, 2020

Best examples

 #అనుమానం_పెను_భుతం_అనడానికి_మహ #భారతం_జరగిన_సంఘటన 


మహాభారతంలో.. పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం మొదలవబోతుందని తెలిసిన కృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్తాడు. ఎందుకంటే యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో భీష్ముడు, ద్రోణుడు ఆయన కొడుకు అశ్వద్దాముడు, కర్ణుడు లాంటి చాలా మంచి యోధులు ఉన్నారని కృష్ణుడికి బాగా తెలుసు. అందులోనూ అశ్వద్దాముడు మరణం లేని వరం పొందినవాడని చిరంజీవి అని తెలుసు.. కౌరవుల పక్షంలో అశ్వద్దాముడు కనుక సైన్యాధిపతిగా నియమించబడితే పాండవులు గెలవలేరని తలచిన కృష్ణుడు ఒక ఆలోచనను పన్నాడు.. అది అమలుపరిచేందుకై హస్తినాపురం చేరుకున్న కృష్ణుడు సభలోని అందరికి నమస్కరించి అశ్వద్దాముడిని మాత్రం ఒంటరిగా తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా దుర్యోధనుడు ఇది గమనించసాగాడు..


అపుడు కృష్ణుడు అశ్వద్దాముడి క్షేమసమాచారాలు అడుగుతూనే తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని కిందకు జారవిడిచాడు.. అలా ఉంగరం పడిపోవటం చుసిన అశ్వద్దాముడు వంగి నేల పైన ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా కృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు. కృష్ణుడు ఎం చుపిస్తున్నాడో అని ఆకాశం వైపు చూసిన తరువాత అశ్వద్దాముడు కృష్ణుడి వేలికి కింద పడ్డ ఉంగరాన్ని తొడిగాడు.


ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు, అశ్వద్దాముడు “నేను కౌరవుల పక్షంలో ఉన్నా పాండవుల గెలుపుకు తోడ్పడతానని ఆ నింగి నేల సాక్షిగా ప్రమాణం చేసి మాటాయిస్తున్నాను ” అన్నట్లు అర్థం చేసుకున్నాడు. ఈ అనుమానం తోనే చివరివరకు అతన్ని యుద్ధం లో సైన్యాధిపతిగా నియమించలేదు దుర్యోధనుడు. కురుక్షేత్రం17వ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడి దెబ్బకు కాళ్ళు విరిగి పడిపోయిన సమయంలో అశ్వద్దాముడు దుర్యోధనుడి వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు..


నేను చిరంజీవి వరం పొందినవాడిని అని తెలుసు కదా.. నన్ను గనక సేనాధిపతిగా నియమించి ఉంటె యుద్ధంలో మనం గెలిచేవారం కదా అని అడగగా…అప్పుడు దుర్యోధనుడు నువ్వు పాండవులకు సహాయం చేస్తానని ఆ కృష్ణుడికి మాట ఇచ్చావు కదా అని అంటాడు.. దీనికి బదులుగా “ఎవరు మాట ఇచ్చింది” అని అశ్వద్దాముడు అడగగా అక్కడ జరిగింది అతను అర్థం చేసుకున్నది దుర్యోధనుడు వివరించగా ఆ మాటలు విన్న అశ్వద్దాముడు ముందు విరక్తితో నవ్వి.. ఆ రోజు కృష్ణుడి ఉంగరం జారిపడిపోతే అది తీసి ఇచ్చాను కానీ నేను ఎటువంటి మాట ఇవ్వలేదు.


నాపైన నీకు కలిగిన అనుమానంతో నీ ఓటమికి నువ్వే కారణం అయ్యావు.. అప్పుడే నన్ను ఈ విషయం అడిగి ఉంటె నీకు నిజం తెలుసుండేది, ఇది కూడా ఆ పరమాత్మ పాండవులను గెలిపించటానికి ఆడిన నాటకమే అయి ఉంటుంది అని చెప్పాడు అశ్వద్దాముడు.  నిజమే అనుమానం వస్తే వెంటనే అడిగేయడం ఉత్తమం అంతే కానీ మనసులో దాచుకుని దానిని పెంచుకుంటూ పోతే జీవితాల్లో దుర్యోధనుడిలా మనకు ఓటమి తప్పదు.. అనుమానం పెను భూతం అనే మాట నిజమే అనడానికి మంచి ఉదాహరణ భారతంలోని ఈ ఘట్టం.





.............,,,,,,,,,,,,,,      ,,,,,,,,...........,,,,,,,,      .........,,,,,,,,,,    ......





అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?


వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం.. మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. కానీ... ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమయాత్ర అవుతుంది.


ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే... శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు.


బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో... శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా... ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి... తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది.


పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని

(డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు.

ఎందుకంటే.. శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద.. తన వాళ్ళ మీద.. ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే... ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే.. అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ... తిరిగి మొదటి నుండి లెక్కించాలి.


శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే... కుండా నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో... నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాం అంటే.. ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో.. అని ఆత్మకు మనమిచ్చే సంకేతం.


హిందూ సాంప్రదాయం లో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు. అదే మన ఖర్మ...

ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే...

ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేసాడు నేను ఇలాగే చేస్తున్నాను

కానీ.. ఎందుకు చేస్తున్నానో తెలియదు.


దయచేసి భారత ఆచార, సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది.🙏🙏




:::::::::::::::::   :::::::::::::::::     :::::::::: ::::::::::::     :::::::::    ::::::::::::





హాలీవుడ్ మహానటి సల్మా హాయెక్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలతో...


సల్మా హాయెక్ తల్లితండ్రులు లెబనాన్ నుంచి మెక్సికో వలస వచ్చారు. పొద్దున్నే లేసి పేడకాళ్ళు తీసి, కళాపు చల్లి, ముగ్గు వేసి పుస్తకాలు చేతపట్టుకొని 3 కిలోమీటర్లు దూరం నడిచి వెళ్ళి ఏమీ కష్టపడి చదువుకోలేదు. మిలియనీర్ కుటుంభం లోనే పుట్టింది, కానీ ఆమె తెలివి, అందం, వ్యక్తిత్వం, ఎదిగిన తీరు ప్రపంచంలోనే చాలా ప్రత్యేకం.


మెక్సికో లో TV షోస్ చేస్తూ మిదాక్ అలే (ద అలే ఆఫ్ మిరాకిల్స్) అనే మెక్సికన్ సినెమాలో(1995) నటించింది. ఆ సినెమా 1988 లో సాహిత్యం లో నోబెల్ బహిమతి సాధించిన అరబ్ రచయిత (ఈజిప్ట్) నగీబ్ మెహఫోజ్ రాసిన నవల ఆధారం గా నిర్మించారు. మెక్సికో సిటీ లోని దిగువ మధ్యతరగతి కుటుంభాలలోని కొన్ని గే, లెస్బియన్ లాంటి కాంప్లెక్స్ సబ్జెక్ట్ ని తీసుకొని తెరకెక్కించారు. ఆ సినెమా విమర్శకుల ప్రశంసలు అందుకొంది. అల్మా క్యారక్టర్ చేసిన సల్మా హాయెక్ మొదటి సినెమా తోనే మెక్సికన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అవార్డ్ కి నామినేట్ అయ్యింది.


ఆ సినెమా చూసి హాలీవుడ్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. సల్మా హాయెక్ కి చిన్నప్పుడు నత్తి ఉండేది ఇంకా ఆమె మాట్లాడుతుంటే డబ్బాలో రాళ్ళు వేసి ఊపుతుంటే ఎలా సౌండ్ వస్తుందో అలా వస్తుంది (అప్పట్లో). మొదట నీ పేరు ఇక్కడ (హాలీవుడ్ లో) నోరు తిరగదు, పేరు మార్చుకోమన్నారు. ఇంకా నీ యాక్సెంట్ బాలేదు, తొందరగా యాక్సెంట్ మార్చుకోమన్నారు. నా పేరు, యాక్సెంట్ మీ కోసం మార్చుకుంటే నేను వేరే లాగా కనపడతాను, నన్ను నేను కోల్పోతాను. మీ హాలీవుడ్ సినెమా కోసం నన్ను నేను కోల్పోలేను అని తెగేసి చెప్పింది.  


హాలీవుడ్ లో మొదట డెస్పరాడో సినెమా లో నటించింది.ఆ తర్వాత జార్జ్ క్లూనీ తో, విల్ స్మిత్ తో, మ్యాట్ డామెన్ తో నటించింది 2002 లో విడుదలైన ఫ్రిదా లో నటనకి ఏకం గా ఆస్కార్ అవార్డ్ కి నామినేట్ అయ్యింది. నిజానికి ఆ సినెమా ప్రొడ్యూస్ చేయటానికి ఎవరూ ముందుకు రాకపోతే తనే ఆ సినెమాని నిర్మించింది. మెక్సికన్ ఆర్టిస్ట్ ఫ్రిదా కాహ్లో జీవితం ఆధారం గా తెరకెక్కించిన సినెమా అది. 12 మిలియన్ డాలర్లతో నిర్మిస్తే బాక్స్ ఆఫీస్ లో 57 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది.


ఫ్రాన్స్ లో మూడో అత్యంత ధనవంతుడు, బిలయనీర్ ఫ్రాంకోస్ హెన్రీ పినాల్ట్ ని పెండ్లి చేసుకుంది. ఆ తర్వాత అతనికి ఎఫైర్ ఉంది, రిలేషన్ లో అబ్యూస్ ఉన్నా సగటు మనిషి లా ఆలోచించి అతనితో మాట్లాడి పరిష్కరించుకొని కుటుంభ జీవనానికే ప్రాధాన్యత ఇచ్చింది కానీ విడాకులు తీసుకొని తను కూడా బిలయనీర్ అవ్వాలనుకోలేదు (హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ప్రకారం ప్రపంచం లోని 30 బెస్ట్ CEO ల్లో ఆమె భర్త ఫ్రాంకోస్ పినాల్ట్ ఒకరు, ప్రపంచంలోనే 3 వ ర్యాంక్).  


ఐక్యరాజ్యసమితి చిల్ద్రన్స్ ఫండ్ (UNICEF) కి ఆమె అంతర్జాతీయ అంబాసిడర్. ఖాళీ సమయం ఉంటే చాలు ఏదో ఒక సహాయక కార్యక్రమాల్లో పాల్గొనటం ఆమె హాబీ. టెటానిస్ వ్యాక్సిన్ కోసం చాలా ప్రచారం చేసింది, ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ని ప్రమోట్ చేస్తూ స్వయం గా తనే వేరే పిల్లలకి బ్రెస్ట్ ఫీడ్ చేసింది. అక్షయ్ కుమార్ స్త్రీల సమస్యల మీద "టాయ్ లెట్" సినెమా రిలీజ్ అప్పుడు అక్షయ్ కుమార్ & టాయ్ లెట్ సినెమా కి శుభాకాంక్షలు చెప్పింది. ఆమె ట్వీట్ చూసే మిగతా హాలీవుడ్ వాళ్ళకి టాయ్ లెట్ సినెమా గురించి ఎక్కువ తెలిసింది.


మిగతా హాలీవుడ్ భామల్లా 5.6/5.7 ఎత్తూ ఉండదు, జీరో సైజ్ మెయింటెన్ చేయదు, ఇంగ్లీష్ ఫ్ల్యూయంట్ గా మాట్లాడదు, ఆమె ఎత్తు 5.2 అడుగులే. అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదు. అమెరికాలో హీరో, హీరోయిన్స్ లో సెక్సీ అనగానే మీకు ఎవరు గుర్తు వస్తారు అని అడిగితే 60% కి  పైగా సల్మా హాయెక్ అన్నారు. స్త్రీల సమస్యల మీద, స్త్రీ సాధికారికత మీద నిర్మాణాత్మకం గా మాట్లాడే అతికొంది మందిలో సల్మా హాయెక్ ఒకరు. 


నీకు నీలానే ఉండు, నీ బలం పెంచుకో బలహీనతలు తగ్గించుకో కానీ వేరే వాళ్ళని అనుకరించి నిన్ను నీవు మార్చుకోకు, నిన్ను నీవు కోల్పోకు, You are unique, నీకు నీవు ప్రాధాన్యత ఇచ్చుకో అంటుంది సల్మా హాయెక్.


Happy birthday. Many more happy returns of the day Salma Hayek.


You are my HERO Salma 🙏


- జగన్

:


Tuesday, August 18, 2020

Privations of land purchase

 స్థలాలు లేదా ఇల్లు కొని లేదా అమ్మినప్పుడు #Brokers, #Banks నమ్మకంగా మన పక్కనే ఉండే వాళ్ళు చేసే మోసాలు. చాలా మంది తెలియక మోసపోతూ ఉంటారు వారికోసం ఇది. ( కొంత మంది  మాత్రమే) 


%%%%ముందుగా Brokers చేసే మోసాలు%%%%%

1) #Brokers స్థలం కొనేటప్పుడు తప్పుడు వివరాలు ఇస్తారు. 100% వాళ్ళ మాటలు నమ్మవద్దు. సంపాదించడం చేతకాని వాళ్ళు ఇలాంటి తప్పుడు మాటలు చెప్పి సంపాదిస్తారు. ఎంగిలి మెతుకులు కోసం ఆశ పడే వారు ( కొంత మంది కి మాత్రమే)


 2) 2% broker commision తీసుకుంటారు. బేరం మాట్లాడేటప్పుడు ఎక్కువ brokers వస్తారు. మనలని రెచ్చ కొట్టి ఎక్కువ రేట్ కి కొనే విధముగా చేస్తారు. 


3)నిజ యజమానిని తీసుకురాకుండా నకిలీ వాళ్ళని తీసుకొచ్చి బేరం చేస్తారు.


4) ఆస్తి ఎవరి పేరు మీద ఉందొ తెలుసుకోవాలి అంటే #registration office లో #EC  తెస్తే తెలుస్తుంది. 300 అవుతుంది EC కి.


5) కొనే ముందు original #sale #deed (Original document) లో ఉండే యజమాని photo చూడండి. అన్ని links documents history చూడాలి.


6) ఎట్టి పరిస్థితుల్లో #Sale agreement ( #contract) min 3months ఉండేలా చూడండి. మీ దగ్గర డబ్బు ఉన్న 3Months తక్కువ వెయ్యవద్దు. ఈరోజు ఏమి జరుగుతుందో తెలియదు. Agreement amount 5-10% కన్నా ఎక్కువ ఇవ్వవద్దు. #Agrement cancel చేస్తే తిరిగి ఇవ్వకుండా బాగా తిప్పుకుంటారు.


7) మీ సొంత మనుషులు, మీ స్నేహితులు చెప్పే మాటలు నమ్మవద్దు. వల్లే #commission కోసం కకృతి పడతారు.


8.) A, B brokers ఉన్నారు అనుకుందాం. A broker నీకు తెలుసు, వీడు B broker దగ్గరకి బేరం కోసం తీసుకొని వెళ్తాడు. యజమాని B broker కి agrement వేసాడు అని అబద్ధం చెపుతారు. స్థలం రేట్ 1Lakh అనుకుందాం, స్థలం యజమానికి తో ఈ brokers  1Lakh కన్నా ఎక్కువ వస్తే మేము తీసుకుంటాము అని deal చేసుకుంటారు. అప్పుడు B broker 1,10,000 కి కొనే వారి దగ్గర బేరం కుదుర్చుకుంటాడు. 


9) ఎట్టి పరిస్థితుల్లో బేరం మాట్లాడే తప్పుడు నిజమైన యజమానితోనే మాట్లాడండి. ఈ brokers యజమాని busy గా ఉన్నాడు, వేరే దేశాలలో ఉన్నాడు అని అబద్దాలు చెపుతారు. కనీసం video call లో ఇన మాట్లాడండి. యజమాని ఏదయినా ID proof చూపించమనాలి.


10) మీరు కొనే స్థలం , వాటి డాకుమెంట్స్ #address నిజమో కాదో తెలుసుకోండి. ఎక్కడో ఉన్న స్థలం డాకుమెంట్స్ తో  మంచి area లో ఉన్న స్థలం చూపించి మోసం చేస్తారు. 

మీరు అనుకున్న స్థలం orginal స్థలాలు వేరుగా ఉంటాయి.


11) original స్థలం size, document స్థలం size లో తేడాలు ఉంటాయి.


 #Documents required for Property

1) Main Owner Sale Deed document original, ఒరిజినల్ పేపర్స్ మీద stamp చూడాలి. 

2) All Linked Documents

3)  అన్ని డాకుమెంట్స్ లో కొనేవారు, అమ్మేవారు ఒక్కరు కాకపోతే అమ్మేవాడి Family tree certificate ( తండ్రి చనిపోతే పిల్లలు స్థలం ఆమ్మితె లేదా వరాసత్వముగా వచ్చే ఆస్తి ఐతే)

4) Documents front page లో ఏదయినా court seal, sign ఉంటే property మీద case ఉన్నది అని అర్థం.

5) EC - Encumbrance certificate (EC)

6) #Mother deed certificate

7) #RTC - Record of Rights, Tenancy and Crops (For Agriculture Land)

8.) Survey Sketch

9) #Layout Approval

10) #Katha Certificate

11) #DC #Conversion certificate ( agriculture to Non-Agriculture land conversion) 

12) #Property Tax Certificate

13) SC, ST సోదరులకు ప్రభుత్వామ్ ఉచితముగా స్థలాలు ఇచ్చినది. అటువంటి స్థలాలు కొన్న మళ్ళీ వారికే వెళ్తాయి, రిజిస్ట్రేషన్ చెల్లదు.

14) పేద వారికి ప్రభుత్వామ్ ఉచితముగా స్థలాలు ఇచ్చినది, అటువంటి స్థలాలు కొనకూడదు.

14) #apartments ఐతే plan approval, OC, CC ఉండాలి. 3Floors కి plan approval తీసుకొని 4 or 5 floors కడతారు. వాళ్ళు బ్యాంక్ వాడితో link పెట్టుకొని మీ లోన్ easy గా చేపిస్తారు resale అప్పుడు problem అవుతుంది.


15) మనతో మంచిగా నటిస్తూ మనం అనుకునే మాటలని brokers చెప్తూ #commission తీసుకుంటారు. వాళ్ళతో జాగ్రత్త.


16) స్థలం కాగితాల copys ఎట్టి పరిస్థితులలో ఎవరికి ఇవ్వకండి. ఆ copy #paper ఇతరుల దగ్గర ఉండటం వల్ల మనకి చెడు చేసే అవకాశం ఎక్కువ.


17) ఇల్లు కట్టి ఉంటే #building #Plan #approval ఉండాలి.


18)Agrement రోజు, #Registration ముందు రోజు  EC తీయండి. కొంత మంది వేరే వాళ్ళకి అమ్మి మన దగ్గర Agrement వేస్తారు. EC లో స్థల యజమాని ఎవరో , ఎప్పుడు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు ఉంటాయి.


19) ఆ ల్యాండ్ పైన ఎమైనా విద్యుత్ lines ఉన్నాయా, ల్యాండ్ క్రింద ఎమైనా #underground #drainage ఉన్నదా.  #Land govt ప్రజా అవసరాలకు తీసుకుంటున్న కోనకూడదు.


20) ఇప్పుడు Online Registration process ఉన్నది. 15Years back online లేదు ఆ time లో ఒకే property ని ఎక్కువ మంది పేరుతో రిజిస్టర్ చేశారు మోసం చేసి.


 21) మీరే నెను కింద ఇచ్చిన గవర్నమెంట్ వెబ్ సైట్ లో స్వయంగా మీరే చూసి తెలుసుకోండి. మీరు కోనాలనుకున్న, లేదా కోనుకున్న స్థలం, ప్లాట్ భూమి ఎదైనా కావచ్చు. దానికి సంబంధిత ఈసి, అది ప్రబుత్వ స్థలమా పోరంబోకు స్థలమా పట్టా ఉన్న స్థలమా అనేవి ఇందులో పోందుపరచిఉంటాయి. మీ ప్లాట్, భూమి కి సంబంధిత రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు లింక్ డాక్యుమెంట్స్ తో సహా. మీ ప్లాట్ కోలతలు హద్దులు ఎవరి నుంచి ఎవరికి హక్కుగా సంక్రమించింది తదితర వివరాలు ప్రింటుతో సహా ఉచితంగా తిసుకోవచ్చు. మీరుకోనే భూమి, ప్లాట్ రిజిస్ట్రేషన్ విలువ ఎంత తదితర వివరాలకు సైతం ఈ వెబ్ సైట్ చాలా చాలా ఉపయోగం. మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధిత రిజిస్ట్రేషన్ సైట్స్.


http://registration.ap.gov.in/


http://registration.telangana.gov.in/

.

.

.

.


**** #Loan తీసుకొనేఅప్పుడు బ్యాంక్ వాళ్ళు చేసే మోసాలు*****


1) ఎట్టి పరిస్థితుల్లోనూ Broker లేదా  యజమాని Refer చేసిన బ్యాంక్ లో Loan తీసుకోవద్దు. వాళ్ళు బ్యాంక్ వాడికి కమిషన్ ఇచ్చి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉన్నది. Agrement time period లో మీకు loan sanction కాకుండా చేసి agreement డబ్బులు brokers, bank, owner పంచుకుంటారు.


2) బ్యాంక్ Loan రావాలి అంటే పైన చెప్పిన documents compulsary ఉండాలి. అవి లేకుండా బ్యాంక్ loan ఇవ్వదు. 


3) బ్యాంక్ loan 70% నుంచి 80% వరకు ఇస్తారు. అది కూడా మీరు Registration Document లో చూపించిన Property value లో. Property government value 5Lak అనుకోండి. Actual market price 30Lak అనుకోండి. మీకు loan 15Lak కావాలి అనుకోండి. అప్పుడు మీరు registration document లో 20L చూపించి Register చేసుకోవాలి. మీకు 20L లో 75% అంటే 15L బ్యాంక్ లోన్ ఇష్టది. 


4) మీరు 20Lks registration document లో చూపిస్తే మీకు registration charges పెరుగుతాయి. స్థల యజమానికి TAX పడుతుంది. INDEX based Tax యజమాని Govt కి కట్టాలి.  అందువల్ల యజమాని ఒప్పుకొడు.


5) బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు processing fee ఉంటది min 10,000. 1.5%  loan amount లో #Insurance తీసుకోవాలి . కొన్ని Banks (#DHFL)  5% కన్నా ఎక్కువ insurance charge చేస్తాయి మనకి తెలియకుండా Enable చేస్తారు. Mortage(తాకట్టు) registration బదులు 0.3% value లో #Revenue #stamp మీద లోన్ agrement వేస్తే సరిపోతుంది.


6) Registration అప్పుడు #Bank #agent వచ్చి #check యజమానికి ఇచ్చి, అన్ని Original documents తీసుకొనిపోతారు. అందువల్ల వాటి zerox తీసుకోండి.


7) పైన చెప్పిన process బ్యాంక్ లో చేసేది. అవి అవసరం లేదు మేము Loan ఇప్పిస్తాము , Sale agreement వేసుకొండి అని బ్యాంక్స్ చెపుతాను. 1Week లో Loan process complete అవుతుంది అని చెపుతారు.  Agreement వేసుకొని వెళ్లిన తరువాత చుక్కలు చూపిస్తారు. 


8) బ్యాంక్ లోన్ process min 20days పడుతుంది. బ్యాంక్ వెదవలు ( కొంత మందికి మాత్రమే) చెప్పే మాటలు నమ్మి  sale agrement తక్కువ రోజుల్లో వేసుకోవద్దు. Min 3months agreement వేసుకోవాలి.


9) #personalLoan తీసుకుంటే Processing fee ఉంటది, #Insurance optional.  ముందే Insurance వద్దు అని చెప్పాలి.


10) బ్యాంక్ Loan కి రెండు రకాల వడ్డీలు ఉంటాయి #fixed, #variable. #Fixed #interest ఐతే future లో వడ్డీ rates మారవు. Variable interest ఐతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వడ్డీ rates మారుస్తూ ఉంటారు.


11) pre Closing charges, #pre #Closing ఎన్ని నెలలు తరువాత చెయ్య వచ్చు. #Parshial #closing #charges వంటి వివరాలు తెలుసుకోవాలి.


12) బ్యాంక్ వాళ్లు చెప్పిన ప్రతి మాటని #record చేసుకోండి. వాడు చెప్పిన దానిని #official mail నుంచి మీ mail కి పంపమని చెప్పండి.


13) ఇప్పుడు కొంత మంది #Bank వాళ్లే పెద్ద దొంగలు, వారితో జాగ్రత్త


14) బ్యాంక్ #EMI లో  .. వడ్డీ + అసలు . ఉండాలి. కొన్ని దొంగ బ్యాంక్స్ వడ్డీ మాత్రమే తీసుకుంటాయి. #Principle మనం బ్యాంక్ కి వెళ్లి కట్టాలి. దొంగ rules ఇవి.


15) #Land కొంటె #Income #Tax #Exception క్రింద రాదు. 


#House #Flat #Plot #Fraud #Mindgame #Careing #Land #Property #Bank #Brokers #Loan #HomeLoan #PersonalLoan #DHFL #IncomeTax #Registration #Documents #Brokers


రచయిత - సుజీవన్ గారు

Keybord shortcuts

 కంప్యూటర్   ఉపయోగిస్తూన్నారా   ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన   ఆపరేటింగ్  వర్డ్స్ CTRL+A. . . . . . . . . . . . . . . . . Select All CTRL+C. . ...