Thursday, August 20, 2020

Best examples

 #అనుమానం_పెను_భుతం_అనడానికి_మహ #భారతం_జరగిన_సంఘటన 


మహాభారతంలో.. పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం మొదలవబోతుందని తెలిసిన కృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్తాడు. ఎందుకంటే యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో భీష్ముడు, ద్రోణుడు ఆయన కొడుకు అశ్వద్దాముడు, కర్ణుడు లాంటి చాలా మంచి యోధులు ఉన్నారని కృష్ణుడికి బాగా తెలుసు. అందులోనూ అశ్వద్దాముడు మరణం లేని వరం పొందినవాడని చిరంజీవి అని తెలుసు.. కౌరవుల పక్షంలో అశ్వద్దాముడు కనుక సైన్యాధిపతిగా నియమించబడితే పాండవులు గెలవలేరని తలచిన కృష్ణుడు ఒక ఆలోచనను పన్నాడు.. అది అమలుపరిచేందుకై హస్తినాపురం చేరుకున్న కృష్ణుడు సభలోని అందరికి నమస్కరించి అశ్వద్దాముడిని మాత్రం ఒంటరిగా తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా దుర్యోధనుడు ఇది గమనించసాగాడు..


అపుడు కృష్ణుడు అశ్వద్దాముడి క్షేమసమాచారాలు అడుగుతూనే తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని కిందకు జారవిడిచాడు.. అలా ఉంగరం పడిపోవటం చుసిన అశ్వద్దాముడు వంగి నేల పైన ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా కృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు. కృష్ణుడు ఎం చుపిస్తున్నాడో అని ఆకాశం వైపు చూసిన తరువాత అశ్వద్దాముడు కృష్ణుడి వేలికి కింద పడ్డ ఉంగరాన్ని తొడిగాడు.


ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు, అశ్వద్దాముడు “నేను కౌరవుల పక్షంలో ఉన్నా పాండవుల గెలుపుకు తోడ్పడతానని ఆ నింగి నేల సాక్షిగా ప్రమాణం చేసి మాటాయిస్తున్నాను ” అన్నట్లు అర్థం చేసుకున్నాడు. ఈ అనుమానం తోనే చివరివరకు అతన్ని యుద్ధం లో సైన్యాధిపతిగా నియమించలేదు దుర్యోధనుడు. కురుక్షేత్రం17వ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడి దెబ్బకు కాళ్ళు విరిగి పడిపోయిన సమయంలో అశ్వద్దాముడు దుర్యోధనుడి వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు..


నేను చిరంజీవి వరం పొందినవాడిని అని తెలుసు కదా.. నన్ను గనక సేనాధిపతిగా నియమించి ఉంటె యుద్ధంలో మనం గెలిచేవారం కదా అని అడగగా…అప్పుడు దుర్యోధనుడు నువ్వు పాండవులకు సహాయం చేస్తానని ఆ కృష్ణుడికి మాట ఇచ్చావు కదా అని అంటాడు.. దీనికి బదులుగా “ఎవరు మాట ఇచ్చింది” అని అశ్వద్దాముడు అడగగా అక్కడ జరిగింది అతను అర్థం చేసుకున్నది దుర్యోధనుడు వివరించగా ఆ మాటలు విన్న అశ్వద్దాముడు ముందు విరక్తితో నవ్వి.. ఆ రోజు కృష్ణుడి ఉంగరం జారిపడిపోతే అది తీసి ఇచ్చాను కానీ నేను ఎటువంటి మాట ఇవ్వలేదు.


నాపైన నీకు కలిగిన అనుమానంతో నీ ఓటమికి నువ్వే కారణం అయ్యావు.. అప్పుడే నన్ను ఈ విషయం అడిగి ఉంటె నీకు నిజం తెలుసుండేది, ఇది కూడా ఆ పరమాత్మ పాండవులను గెలిపించటానికి ఆడిన నాటకమే అయి ఉంటుంది అని చెప్పాడు అశ్వద్దాముడు.  నిజమే అనుమానం వస్తే వెంటనే అడిగేయడం ఉత్తమం అంతే కానీ మనసులో దాచుకుని దానిని పెంచుకుంటూ పోతే జీవితాల్లో దుర్యోధనుడిలా మనకు ఓటమి తప్పదు.. అనుమానం పెను భూతం అనే మాట నిజమే అనడానికి మంచి ఉదాహరణ భారతంలోని ఈ ఘట్టం.





.............,,,,,,,,,,,,,,      ,,,,,,,,...........,,,,,,,,      .........,,,,,,,,,,    ......





అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?


వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం.. మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. కానీ... ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమయాత్ర అవుతుంది.


ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే... శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు.


బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో... శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా... ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి... తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది.


పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని

(డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు.

ఎందుకంటే.. శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద.. తన వాళ్ళ మీద.. ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే... ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే.. అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ... తిరిగి మొదటి నుండి లెక్కించాలి.


శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే... కుండా నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో... నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాం అంటే.. ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో.. అని ఆత్మకు మనమిచ్చే సంకేతం.


హిందూ సాంప్రదాయం లో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు. అదే మన ఖర్మ...

ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే...

ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేసాడు నేను ఇలాగే చేస్తున్నాను

కానీ.. ఎందుకు చేస్తున్నానో తెలియదు.


దయచేసి భారత ఆచార, సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది.🙏🙏




:::::::::::::::::   :::::::::::::::::     :::::::::: ::::::::::::     :::::::::    ::::::::::::





హాలీవుడ్ మహానటి సల్మా హాయెక్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలతో...


సల్మా హాయెక్ తల్లితండ్రులు లెబనాన్ నుంచి మెక్సికో వలస వచ్చారు. పొద్దున్నే లేసి పేడకాళ్ళు తీసి, కళాపు చల్లి, ముగ్గు వేసి పుస్తకాలు చేతపట్టుకొని 3 కిలోమీటర్లు దూరం నడిచి వెళ్ళి ఏమీ కష్టపడి చదువుకోలేదు. మిలియనీర్ కుటుంభం లోనే పుట్టింది, కానీ ఆమె తెలివి, అందం, వ్యక్తిత్వం, ఎదిగిన తీరు ప్రపంచంలోనే చాలా ప్రత్యేకం.


మెక్సికో లో TV షోస్ చేస్తూ మిదాక్ అలే (ద అలే ఆఫ్ మిరాకిల్స్) అనే మెక్సికన్ సినెమాలో(1995) నటించింది. ఆ సినెమా 1988 లో సాహిత్యం లో నోబెల్ బహిమతి సాధించిన అరబ్ రచయిత (ఈజిప్ట్) నగీబ్ మెహఫోజ్ రాసిన నవల ఆధారం గా నిర్మించారు. మెక్సికో సిటీ లోని దిగువ మధ్యతరగతి కుటుంభాలలోని కొన్ని గే, లెస్బియన్ లాంటి కాంప్లెక్స్ సబ్జెక్ట్ ని తీసుకొని తెరకెక్కించారు. ఆ సినెమా విమర్శకుల ప్రశంసలు అందుకొంది. అల్మా క్యారక్టర్ చేసిన సల్మా హాయెక్ మొదటి సినెమా తోనే మెక్సికన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అవార్డ్ కి నామినేట్ అయ్యింది.


ఆ సినెమా చూసి హాలీవుడ్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. సల్మా హాయెక్ కి చిన్నప్పుడు నత్తి ఉండేది ఇంకా ఆమె మాట్లాడుతుంటే డబ్బాలో రాళ్ళు వేసి ఊపుతుంటే ఎలా సౌండ్ వస్తుందో అలా వస్తుంది (అప్పట్లో). మొదట నీ పేరు ఇక్కడ (హాలీవుడ్ లో) నోరు తిరగదు, పేరు మార్చుకోమన్నారు. ఇంకా నీ యాక్సెంట్ బాలేదు, తొందరగా యాక్సెంట్ మార్చుకోమన్నారు. నా పేరు, యాక్సెంట్ మీ కోసం మార్చుకుంటే నేను వేరే లాగా కనపడతాను, నన్ను నేను కోల్పోతాను. మీ హాలీవుడ్ సినెమా కోసం నన్ను నేను కోల్పోలేను అని తెగేసి చెప్పింది.  


హాలీవుడ్ లో మొదట డెస్పరాడో సినెమా లో నటించింది.ఆ తర్వాత జార్జ్ క్లూనీ తో, విల్ స్మిత్ తో, మ్యాట్ డామెన్ తో నటించింది 2002 లో విడుదలైన ఫ్రిదా లో నటనకి ఏకం గా ఆస్కార్ అవార్డ్ కి నామినేట్ అయ్యింది. నిజానికి ఆ సినెమా ప్రొడ్యూస్ చేయటానికి ఎవరూ ముందుకు రాకపోతే తనే ఆ సినెమాని నిర్మించింది. మెక్సికన్ ఆర్టిస్ట్ ఫ్రిదా కాహ్లో జీవితం ఆధారం గా తెరకెక్కించిన సినెమా అది. 12 మిలియన్ డాలర్లతో నిర్మిస్తే బాక్స్ ఆఫీస్ లో 57 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది.


ఫ్రాన్స్ లో మూడో అత్యంత ధనవంతుడు, బిలయనీర్ ఫ్రాంకోస్ హెన్రీ పినాల్ట్ ని పెండ్లి చేసుకుంది. ఆ తర్వాత అతనికి ఎఫైర్ ఉంది, రిలేషన్ లో అబ్యూస్ ఉన్నా సగటు మనిషి లా ఆలోచించి అతనితో మాట్లాడి పరిష్కరించుకొని కుటుంభ జీవనానికే ప్రాధాన్యత ఇచ్చింది కానీ విడాకులు తీసుకొని తను కూడా బిలయనీర్ అవ్వాలనుకోలేదు (హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ప్రకారం ప్రపంచం లోని 30 బెస్ట్ CEO ల్లో ఆమె భర్త ఫ్రాంకోస్ పినాల్ట్ ఒకరు, ప్రపంచంలోనే 3 వ ర్యాంక్).  


ఐక్యరాజ్యసమితి చిల్ద్రన్స్ ఫండ్ (UNICEF) కి ఆమె అంతర్జాతీయ అంబాసిడర్. ఖాళీ సమయం ఉంటే చాలు ఏదో ఒక సహాయక కార్యక్రమాల్లో పాల్గొనటం ఆమె హాబీ. టెటానిస్ వ్యాక్సిన్ కోసం చాలా ప్రచారం చేసింది, ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ని ప్రమోట్ చేస్తూ స్వయం గా తనే వేరే పిల్లలకి బ్రెస్ట్ ఫీడ్ చేసింది. అక్షయ్ కుమార్ స్త్రీల సమస్యల మీద "టాయ్ లెట్" సినెమా రిలీజ్ అప్పుడు అక్షయ్ కుమార్ & టాయ్ లెట్ సినెమా కి శుభాకాంక్షలు చెప్పింది. ఆమె ట్వీట్ చూసే మిగతా హాలీవుడ్ వాళ్ళకి టాయ్ లెట్ సినెమా గురించి ఎక్కువ తెలిసింది.


మిగతా హాలీవుడ్ భామల్లా 5.6/5.7 ఎత్తూ ఉండదు, జీరో సైజ్ మెయింటెన్ చేయదు, ఇంగ్లీష్ ఫ్ల్యూయంట్ గా మాట్లాడదు, ఆమె ఎత్తు 5.2 అడుగులే. అయినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదు. అమెరికాలో హీరో, హీరోయిన్స్ లో సెక్సీ అనగానే మీకు ఎవరు గుర్తు వస్తారు అని అడిగితే 60% కి  పైగా సల్మా హాయెక్ అన్నారు. స్త్రీల సమస్యల మీద, స్త్రీ సాధికారికత మీద నిర్మాణాత్మకం గా మాట్లాడే అతికొంది మందిలో సల్మా హాయెక్ ఒకరు. 


నీకు నీలానే ఉండు, నీ బలం పెంచుకో బలహీనతలు తగ్గించుకో కానీ వేరే వాళ్ళని అనుకరించి నిన్ను నీవు మార్చుకోకు, నిన్ను నీవు కోల్పోకు, You are unique, నీకు నీవు ప్రాధాన్యత ఇచ్చుకో అంటుంది సల్మా హాయెక్.


Happy birthday. Many more happy returns of the day Salma Hayek.


You are my HERO Salma 🙏


- జగన్

:


No comments:

Post a Comment

Keybord shortcuts

 కంప్యూటర్   ఉపయోగిస్తూన్నారా   ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన   ఆపరేటింగ్  వర్డ్స్ CTRL+A. . . . . . . . . . . . . . . . . Select All CTRL+C. . ...