Read this beautiful story completely.
*ఉపాధ్యాయులు మాత్రమే కాదు అందరూచదవవలసిన ఓ మంచికథ!!*
*🔮బహుమతి* ....తప్పకుండా చదవండి.. నాకైతే కళ్ళు చెమర్చాయి..
```
ఉదయం పూజ అయ్యాక, పేపరు చదువుకుంటున్న నేను... ఎవరో కాలింగ్‌బెల్ కొడితే వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఓ యువకుడు చేతిలో శుభలేఖలతో ‘‘మాస్టారూ, బాగున్నారా?’’ అని పలకరించాడు.
వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్ల ‘ఎవరా’ అని ఆలోచిస్తూ యథాలాపంగా ‘‘ఆ, బాగానే ఉన్నాను. లోపలికి రా బాబూ’’ అన్నాను.
లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ‘అతడెవరా’ అని ఆలోచిస్తున్నాను. మర్యాద కోసం ‘‘మంచినీళ్ళు కావాలా?’’ అని అడిగాను. వద్దన్నాడు.
గొంతు సవరించుకుని అతడే అడిగాడు- ‘‘నన్ను గుర్తుపట్టారా మాస్టారూ?’’ అని.
నేను తటపటాయిస్తుంటే చిరునవ్వుతో అన్నాడు ‘‘నేను సత్యమూర్తి నీ. మీ స్కూల్లో చదివాను. మా నాన్నగారు ఆ రోజుల్లో జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా చేసేవారు’’ అని.
అప్పుడు గుర్తుకు వచ్చింది. సత్యమూర్తి చాలా మంచి స్టూడెంట్. బాగా తెలివైనవాడు. ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. అతడు స్కూల్లో చేరినరోజే వాళ్ళ నాన్నగారు నన్ను కలిసి ‘మాస్టారూ, మావాడు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని నా కోరిక. ఏ తప్పుచేసినా అల్లరిచేసినా జిల్లా పరిషత్ ఛైర్మన్ కొడుకని చూడకుండా దండించండి. నేనేమీ అనుకోను. వాడు బాగా చదువుకుంటే అదే పదివేలు’ అని చెప్పారు. వృత్తిరీత్యా ఎంతోమంది రాజకీయ నాయకులని చూసిన నాకు, ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ రోజుల్లో నేను హెడ్‌మాస్టర్‌గా పనిచేసేవాణ్ణి. పిల్లలకి గణితం, సైన్సు బోధించేవాణ్ణి.
అయితే సత్యమూర్తి దండించే పరిస్థితులు వచ్చేలా ప్రవర్తించలేదు. చాలా బాగా చదివేవాడు. ఏ సందేహం వచ్చినా అడిగి నివృత్తి చేసుకునేవాడు. అతడికి చదువులో, ముఖ్యంగా గణితం మీద ఉన్న అభిరుచి చూసి అతడికి మరింత శ్రద్ధతో కిటుకులు బోధించేవాణ్ణి.
కుశలప్రశ్నలయ్యాక, అతడు వచ్చిన పని చెప్పాడు. ‘‘మాస్టారూ, వచ్చే పదిహేనో తారీఖున నా పెళ్ళి, మా స్వగ్రామంలో. మర్నాడు సాయంత్రం ఈ ఊళ్ళోనే రిసెప్షన్. మీరూ అమ్మగారూ పెళ్ళికి తప్పకవచ్చి మమ్మల్నిద్దరినీ ఆశీర్వదించాలని నా ప్రార్థన. మీరు ఎప్పుడు బయల్దేరతారో చెబితే, నేను మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి కారు ఏర్పాటు చేస్తాను’’ అంటూ, నా చేతిలో శుభలేఖ పెట్టి, నాకూ మా ఆవిడకీ పాదాభివందనం చేశాడు.
శుభలేఖ చూశాను. అర్ధరాత్రి ముహూర్తం. నేను అతడికి మృదువుగా చెప్పాను- ఆరోగ్యరీత్యా ప్రయాణించలేమనీ వీలైతే రిసెప్షన్‌కి వస్తాననీ చెప్పాను. పెళ్ళికి రాలేమని అనేసరికి అతడి ముఖం కొద్దిగా చిన్నబోయింది. అయితే రిసెప్షన్‌కి ఇద్దరూ తప్పక రావాలని మాట తీసుకుని మరీ బయల్దేరాడు. కారు పంపవద్దనీ మేమే వస్తామనీ చెప్పాను.
పెళ్ళి రెండ్రోజులుందనగా మా ఆవిడ జయ, రిసెప్షన్ గురించి గుర్తుచేసి, బహుమతి ఏమిద్దామని అడిగింది. సత్యమూర్తి చాలా ధనవంతుడు. అతడి స్థాయికి తగిన బహుమతి ఇచ్చే తాహతు నాకు లేదు. చాలాసేపు ఆలోచించిన తరవాత నా ఉద్దేశ్యం జయకి చెప్పాను, తనూ అంగీకరించింది.
రిసెప్షన్‌కి నేనూ జయా వెళ్ళాం. సత్యమూర్తి స్నేహితులైన నా పూర్వవిద్యార్థులు కొంతమంది కలిశారు. సత్యమూర్తి తండ్రి వచ్చి పలకరించారు. రిసెప్షన్ మొదలయ్యాక నేనూ జయా వేదిక మీదకి వెళ్ళి వధూవరులని ఆశీర్వదించాం. సత్యమూర్తి చేతిలో నేను తీసుకెళ్ళిన కవరు పెట్టాను.
ఆ కవరులో పెట్టిన ఉత్తరంలో ఇలా రాశాను.
చిరంజీవి సత్యమూర్తికి
ఆశీస్సులు.
ఈ సమయంలో ఉత్తరం ఏమిటీ అని ఆశ్చర్యపోతున్నావా? తమ ఉన్నతికి పాటుబడిన ఉపాధ్యాయులని ఏమాత్రం పట్టించుకోని ప్రస్తుత కాలంలో నువ్వు గుర్తుపెట్టుకుని వెతుక్కుంటూ వచ్చి ఎంతో అభిమానంగా మమ్మల్ని నీ పెళ్ళికి ఆహ్వానించినందుకు చాలా సంతోషమైంది.
వృద్ధాప్యం వల్ల ఈమధ్య మా బంధువులలోనైనా ఎవరైనా పెళ్ళికి ఆహ్వానించినా అంతగా వెళ్ళడం లేదు. నీ విషయంలో ఈ పద్ధతికి విరామం
ఇద్దామని నిర్ణయించుకున్నాను. కారణాలు అనేకం. నువ్వు నా అభిమాన విద్యార్థివి కావడం, మీ తండ్రిగారి మీద నాకున్న గౌరవం... వగైరా.
వచ్చిన చిక్కల్లా ‘నీకు ఏ బహుమతి ఇవ్వాలా’ అన్నదే. మనమిచ్చే బహుమతి అవతలివారికి ఉపయోగపడేలా ఉండాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో నీకు ఎలాంటి బహుమతి ఇవ్వాలా అని చాలా తర్జనభర్జనపడ్డాను. ఎంత ఆలోచించినా సరైన వస్తువేదీ నా బుద్ధికి తట్టలేదు. ఏ వస్తువు అనుకున్నా అది నీ తాహతుకి చాలా తక్కువవుతుందనిపించింది లేదా నీ దగ్గర ఇప్పటికే ఉండి ఉంటుందని పించింది. డబ్బే ఇద్దామనుకుంటే, నేనివ్వగలిగిన మొత్తం నీకు చాలా తక్కువవుతుందనిపించింది. అటువంటి సమయంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఉత్తరంతో జతచేసిన కాగితమే నేను నీకు ఇస్తున్న బహుమతి.
నువ్వూ నీ సహధర్మచారిణీ ఎంతో ఆనందంగా మీ భావిజీవితాన్ని గడిపేలా చేయమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం....
దీవెనలతో,
శంకరం మాస్టారు
డిన్నర్ చేశాక వద్దంటున్నా మా ఇద్దరికీ బట్టలు పెట్టారు అతడి తల్లిదండ్రులు. తీసుకోకపోతే సత్యమూర్తి బాధపడతాడంటూ బలవంతం చేశారు. చాలా మొహమాట మేసింది మాకు. అలాగే వద్దంటున్నా మమ్మల్ని కారులో మా ఇంటి దగ్గర దిగబెట్టారు.
నెల రోజుల తర్వాత నా పేరున ఓ ఉత్తరమొచ్చింది. తెరిచి చూస్తే అది సత్యమూర్తి రాసినది.
దైవసమానులైన మాస్టారుగారికి,
నమస్కారములు.
నా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఇద్దరినీ ఆశీర్వదించినందుకు సంతోషం. ఆరోజు నా పెళ్ళి రిసెప్షన్‌లో మీరు ఇచ్చిన బహుమతి చూశాక, దానికి జతచేసిన ఉత్తరం చదివాక చాలాసేపు అలా ఉండిపోయాను. మేధావులు ఎందుకు ప్రత్యేకంగా ఉంటారో అర్థమయింది.
మీరు రూ.1,116 నా పేరున ఓ అనాథ శరణాలయానికి విరాళంగా ఇచ్చి, ఆ రసీదు జత చేశారు. నా పెళ్ళికి వచ్చిన అన్ని బహుమతులలో దీన్ని అత్యంత విలువైనదిగా భావిస్తాను.
స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మీరు నాకు ఓ రోల్‌మోడల్. చిన్నప్పటి నుండీ నేను ఇతరులని ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాణ్ణి. అలాగే స్కూల్లో చదువుతున్నప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉండేవాణ్ణి. అందువల్ల నేనుచాలా మంచి విషయాలే నేర్చుకున్నాను.
నేను ప్రస్తుతం ఇంత మంచి స్థాయిలో ఉండటానికి అవి ఎంతో ఉపయోగపడ్డాయి. కానీ, మీ బహుమతి నన్ను ఆలోచించేలా చేసింది. మీరన్నట్లు మామూలుగా అయితే రూ.1,116 నాకు చాలా చిన్న మొత్తమే. కానీ మీరు ఆ మొత్తాన్ని ఓ అనాథశరణాలయానికి విరాళంగా ఇచ్చారు- అదీ నా పేరున.
మీరు చేసిన ఈ గొప్పపని నాలో ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. అనేకసార్లు నేను చేసే అనవసర ఖర్చుల్ని గుర్తుచేసింది. మీరు ఇచ్చిన బహుమతిని నేను అప్పుడే అనుకరించేశాను. నా పెళ్ళయిన మూడు రోజులకి మా కజిన్ పెళ్ళి అయ్యింది. వాడికి లెక్కపెట్టలేనంత డబ్బు ఉంది. అందుకని మేమిద్దామనుకున్న రూ.50,000లని ఓ అనాథ శరణాలయానికి వాడి పేరుమీద విరాళంగా ఇచ్చాం. వాడెంత సంతోషించాడో మాటల్లో చెప్పలేను. మీరు మాకు ఓ కొత్త మార్గాన్ని చూపారు. మేమెందరమో ఈ కొత్త దారిలో ప్రయాణించే అవకాశం కల్పించారు.
ఇలా మీరు మీ చర్యలతో మాకు ఎప్పుడూ బోధిస్తూనే ఉన్నారు- ఉద్యోగంలో ఉన్నప్పుడూ రిటైర్ అయ్యాకా కూడా. అదే మీ గొప్పతనం.
పాదాభివందనాలతో,
మీ విద్యార్ది,
సత్యమూర్తి.
అతడి గొప్ప వ్యక్తిత్వానికి మనసులోనే హర్షిస్తూ, ఉత్తరం జయ చేతిలో పెట్టాను```కథ
Dr.B.Srinivas🌹🤝
,,,,........ ,,,,,....... ,,,,,,,..... ,,,,,,,......... ,,,,,,....
కథ – ధర్మం 🙏
ఒక ఊళ్లో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్లవాడు చదువుకొనేందుకు అవసరమైన డబ్బులు కూడా ఉండేవి కావు వాడి దగ్గర. అందుకని వాడు ఇల్లిల్లూ తిరిగి, ఇంట్లోకి పనికి వచ్చే వస్తువులను అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బుతో చదువుకొనేవాడు.
ఒకరోజున, అలా అమ్మకానికి పోయినప్పుడు, అతనికి బాగా ఆకలి వేసింది. ఎండ విపరీతంగా ఉన్నది; నీరసంగా ఉంది; ఇక తిరగలేని పరిస్థితి. చేతిలో ఒక్క రూపాయి మాత్రమే ఉంది. ఏంచేయాలి?
‘అక్కడున్న ఇంటి తలుపుతట్టి, కొంచెం అన్నం పెట్టమని అడుగుదాం’ అనుకున్నాడు అతను. వెళ్ళి ఇంటి తలుపు కొట్టాడు- అయితే ఓ చక్కని యువతి ఇంటి తలుపు తెరిచేసరికి, వాడికి ఇక ఏమి అడగాలో తోచలేదు- “ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తారా?” అని మాత్రం అడగ గల్గాడు.అయితే, పిల్లవాడి ముఖం చూస్తే, ‘వాడికి ఆకలిగా ఉంది’ అని ఎవరైనా కనుక్కోగలరు. అందుకని ఆమె మంచినీళ్లకు బదులు, వాడికి ఒక పెద్ద గ్లాసెడు పాలు తీసుకొచ్చి ఇచ్చింది. పిల్లవాడికి ప్రాణం లేచివచ్చినట్లైంది. సంతోషంగా గ్లాసెడు పాలూ త్రాగేశాడు- త్రాగేశాక మళ్ళీ గుర్తుకొచ్చింది- ‘తన దగ్గర ఉన్నది ఒక్క రూపాయే!’ అని.
పిల్లవాడికి చాలా సిగ్గు వేసింది. అయినా అడిగాడు, జేబులోచెయ్యి పెడుతూ- “మీకు ఎంత చెల్లించాలి?” అని.
“నువ్వు ఏమీ చెల్లించనవసరం లేదులే!”అన్నది ఆ యువతి నవ్వుతూ. “దయతో చేసిన పనికి ప్రతిఫలం తీసుకోకూడదట- మా అమ్మ చెప్పింది!” అన్నది.
పిల్లవాడి కళ్ళు చెమర్చాయి. “అయితే మీరు కనీసం నా హృదయపూర్వక కృతజ్ఞతలు స్వీకరించాలి” అని చెప్పి, వాడు అక్కడినుండి ముందుకు సాగాడు.
ఆ గ్లాసెడు పాలతో పిల్లవాడి ఆకలి అప్పటికి ఎలాగూ తీరింది- శారీరకంగా సత్తువ వచ్చింది. అయితే దానితోబాటు వాడి మనస్సూ మార్పుకు లోనైంది. మనిషిలోని మంచితనం పట్లా, దేవుని కరుణ పట్లా ఆ పసి హృదయంలో నమ్మకం ఒకటి, చిన్న విత్తనం మొలకెత్తినట్లు, మొలకెత్తింది. రాను రాను అది బలపడింది-
ఆ పిల్లవాడు పెద్దయ్యేసరికి, ఆ నమ్మకం అతనిలో వ్రేళ్ళూనుకున్నది.
చాలా సంవత్సరాలు గడిచాయి. రోజులు ఒకేలాగా ఉండవు. అప్పటి ఆ యువతి ఇప్పుడు పెద్దదైంది. ఏదో ప్రమాదకరమైన జబ్బుకు లోనై, ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. స్థానికంగా ఉన్న వైద్యులకు లొంగలేదు ఆ జబ్బు. వాళ్ళు ఆమెను పట్టణానికి వెళ్ళి ప్రత్యేక వైద్యులకు చూపించమన్నారు. ఆమెను చేర్చుకున్న ఆసుపత్రి వాళ్ళు ఆమె సమస్యను పెద్ద డాక్టరు గారికి అప్పగించ దలచారు. ఆమె వివరాలున్న ఫైలును డాక్టరుగారి దగ్గరికి పంపించారు. ఆమె ఊరి పేరు చూసిన డాక్టరుగారు వెంటనే లేచి, ఆమెను చూసేందుకు బయలుదేరి వచ్చారు.
ఆమెను చూడగానే పెద్ద డాక్టరుగారికి కళ్ళు చెమర్చాయి. ‘ఎలాగైనా ఆమెను రక్షించాలి’ అని నిశ్చయించుకొని, ఆయన ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది- చాలా రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన తర్వాత, చివరికి ఆమె తన జబ్బు నుండి బయటపడింది!
ఇక ఆమె ఇంటికి వెళ్ళవచ్చు- వెళ్ళేముందు ఆసుపత్రికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించటమే తరువాయి: ఎంత ఖర్చు అయ్యిందోమరి! ఆమెకు బిల్లు పంపించేముందు దాన్ని తనకోసారి చూపించమని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు పెద్ద డాక్టరుగారు. దాన్ని చూసిన తరువాత, ఆయన ఆ బిల్లు చివరలో ఏదో రాసి, ఆమెకు అందజేసారు.
ఆమె ఆ బిల్లును చూసేందుకు కూడా భయపడింది- ఎందుకంటే, ఆమెకు తెలుసు- అంత పెద్ద మొత్తాన్ని తను జీవితాంతం కష్టపడినా చెల్లించలేదు! అయినా చేసేదేమీ లేదు- ఆసుపత్రికి డబ్బు కట్టాల్సిందే! వణికే చేతులతో కవరును తెరిచిందామె… బిల్లు చివర్లో రంగు ఇంకుతో వ్రాసిన అక్షరాలు ఆమెను ఆకర్షించాయి:
ఒక పెద్ద గ్లాసెడు పాలద్వారా ఈ బిల్లు మొత్తం పూర్తిగా చెల్లించబడింది.
సం/-
దయ కలిగి ఉండాలి. ఇతరులకు సహాయం చేయాలి. మన కరుణ, సహాయం చేసే గుణం తిరిగి మనకెలా అక్కరకు వస్తాయో ఎవ్వరమూ చెప్పలేము!
మనం ఏపంట వేస్తే అదే పంట కోస్తాం మనం పుణ్యంచేస్తే ఆ పుణ్యమే మనల్ని కాపాడు తుంది అదే పాపం చేస్తే అదే పాపం మనల్ని భక్షిస్తూంది అందుకే మనం ధర్మం చెస్తూ మన పిల్లల చేత కూడా ఈ ధర్మం చేయుస్తూ ఉండాలి అప్పుడు వారు ఎంత పెద్దవారైనా ధర్మం చేయుటం మర్చి పోకుండా ఉంటారు ఆ ధర్మమే వారిని రక్షిస్తుంది.🙏
శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏
.......,,,,,,,,, ....... .,,,,, ,......... ........,,, ,, .....
🌹🌹🌹🌹🌹🌹🌹
*ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు.. ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట! కాని కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.*
*నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే.. నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం...ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..మనిషికి ఎంత బలం వస్తుందో...ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.*
*ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!*
*రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా* *ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా* *అదిలించాడు. అంతే! రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది.*
*పెద్దాయన ఆశ్చర్యంతో, " సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?"*
*రైతు, "ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా!* *ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకంతో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!"*
*రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!*
*పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం.*.
*కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేక పోవటం...*
*కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేయండి..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి.. మనలో ఒకరికి ఒకరు ఐక్యత ముఖ్యం.*
*ప్రతి ఒక్కరి కథా కంచికి చేరుతుంది. ఆలోపునే మనం మనుషులుగా ఎదగాలి*
🌹🌹🌹🌹🌹🌹
::::::::::::::::: :::::::::::::::: :::::::::::::::: :::::::::::::::: : ::: : : :::::::::
ఉదయం 6:00 అయ్యింది. రాత్రి ఏమైందో ఏమో బాగా అలసట గా అనిపించి, గుండెల్లో కొంచెం నొప్పి అనిపించింది. తట్టుకోలేక అక్కడే పడిపోయాను. తర్వాత నన్ను ఎవరు తీసుకొచ్చారు ఎవరు పడుకోబెట్టారు ఏమి గుర్తు లేదు. అబ్బా! తల పగిలిపోతుంది వెంటనే లేచి కాఫీ తాగాలి. నా భార్య ఎక్కడ? ఈపాటికే నన్ను లేపి కాఫీ టేబుల్ మీద పెట్టి వెళ్తుంది. ఇవాళ ఏంటి ఆలస్యం అయింది ? సరేలే ఏదో పనిలో ఉంటుంది. నేనే వెళ్ళి అడిగి తెచ్చుకుంటా. ఇదేంటి! హాల్ లో ఎంత మంది ఉన్నారు ఏంటి? ఏమైంది? సరే దగ్గరికి వెళ్లి చూద్దాం.
నా భార్య ఏడుస్తోంది ఏంటి? నా కొడుకు కి ఏమైంది వాడు ఎందుకు అంతలా ఏడుస్తున్నాడు? నా స్నేహితుడు కూడా వచ్చాడు. వాడికి నాకు ఏడాది క్రితం గొడవైంది. ఇప్పటివరకూ మాట్లాడుకోలేదు. వాడు మాట్లాడకపోతే నేను ఎందుకు మాట్లాడాలి. ఏమో ఎందుకు వచ్చాడో. ఏంటిది ? ఎవరో చచ్చిపోయినట్టు ఉన్నారు. ఈ ఇంట్లో ? ఎవరై ఉంటారు? అమ్మానాన్న లో ఎవరైనా? లేదు ముందు వాళ్ళ రూమ్ లో చూద్దాం. అమ్మ నాన్న బానే ఉన్నారు కదా. కానీ వీళ్లు కూడా ఏడుస్తున్నారు ? అసలు ఎవరో ఒకసారి చూస్తే గానీ అర్థం కాదు.
ఎవరది? ఏంటి అది అది అది నేనే. నేను చనిపోయానా ? ఎలా ? లేదు నేను చనిపోలేదు. నా భార్య ముందు బిగ్గరగా అరుస్తున్న వినట్లేదు. నా కొడుకు కూడా నేను పిలుస్తున్న పలకట్లేదు. పోనీ అమ్మానాన్నలు చెబుదామా? అయ్యో వాళ్లు కూడా నా మాట వినట్లేదు. నా స్నేహితుడికి చెప్తే? ఇంక ఈగో చంపుకొని నేనే వెళ్ళి వాణ్ణి క్షమాపణ అడుగుతాను. జరిగిన గొడవలో ఎంతో కొంత నాతో కూడా ఉంది కదా. అరే వీడు కూడా పలకట్లేదు ఏంటి? అంటే నేను నిజంగానే చనిపోయానా ?
అయ్యో ఇంకా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కష్టపడి నన్ను బాబుని అమ్మానాన్నల్ని చూసుకుంటున్న నా భార్యతో ఒక్కసారి కూడా తను అందంగా ఉందని చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలి. అలాగే నాకు ఏ సమస్య రాకుండా ఇంటి బాధ్యత మొత్తం తనే తీసుకున్నందుకు థాంక్స్ కూడా చెప్పాలి. ఉద్యోగంలో పడి నా కొడుకుతో ఇప్పటివరకు నేను సరిగ్గా మాట్లాడలేదు. వాడితో మాట్లాడాలి. ఆడుకోవాలి. మా అమ్మ నాన్న లను కూడా ఈ మధ్య సరిగా పట్టించుకోవడం లేదు. వాళ్లతో కొంత సమయం గడపాలి. అలాగే నా స్నేహితుడికి క్షమాపణ చెప్పాలి. కుటుంబం మొత్తాన్ని ఎక్కడికైనా టూర్ కి తీసుకెళ్లాలి. వాళ్లతో కొన్ని రోజులు సరదాగా గడపాలి.
ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి..
ప్లీజ్ దేవుడా నా తప్పులను క్షమించి ఇంకొక అవకాశం ఇవ్వు దేవుడా. ఒక్కసారి బ్రతికించు దేవుడా ప్లీజ్ దేవుడా. నాకు ప్రాణబిక్ష పెట్టు దేవుడా. ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా. ఇలా అంటుండగానే నన్ను ఎవరో గట్టిగా కుదిపినట్టు అనిపించింది. నాకేం అర్థం కావట్లేదు. మెల్లగా నా భార్య నన్ను లే అంటున్నట్టు వినిపిస్తోంది. ఇప్పుడు ఇంకా బిగ్గరగా వినిపిస్తోంది. ఒక్కసారిగా కళ్లు తెరుచుకున్నా. నా భార్య పక్కనే ఉంది. నేను నా రూమ్ లోనే ఉన్నాను. టేబుల్ మీద కాఫీ కూడా ఉంది. ” ఏమైంది ఏమైనా కల వచ్చిందా? ఎందుకలా కలవరిస్తున్నావు?” అని నవ్వింది నా భార్య. అంటే నేను బతికే ఉన్నానా? హమ్మయ్య నేను బతికే ఉన్నా!
కాఫీ తాగి లేచి రెడీ అయ్యి ఆఫీస్ కి వెళుతూ నా భార్యకి నువ్వు అందంగా ఉన్నావు. నువ్వు ఇంట్లో అంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు కాబట్టి నేను ఆఫీసులో శ్రద్ధతో పని చేయగలుగుతున్నాను. అన్నిటికీ థాంక్యూ. అని చెప్పాను. ఆనందంతో తన కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అమ్మానాన్నలతో కూడా ఓ పావుగంట మాట్లాడాను. బాబుని స్కూల్లో దించేసి. నేను ఆఫీస్ కి బయలుదేరాను. దారిలో నా స్నేహితుడికి ఫోన్ చేశాను. సారీ చెప్పాను. అరే మనలో మనకు సారీలు ఏంట్రా? సాయంత్రం కలుద్దాం అని అన్నాడు.
ఎందుకో తెలీదు రోజు కంటే ఇవాళ ఆఫీస్ కి కొంచెం ఉత్సాహం తో వెళ్తున్నాను. ఏదో బరువు తగ్గినట్టు అనిపిస్తోంది. బహుశా ఇవాళ నా ఇగో ని పక్కన పెట్టి మనసు చెప్పిన మాట విన్నాను. అందుకే ఏమో కొంచెం తేలికగా అనిపిస్తుంది. మీరు కూడా నాకెందుకు ? నేను ఏంటి ఒకళ్ళకి సారీ చెప్పేది? ఇష్టముంటే వాళ్లే వచ్చి మాట్లాడారు. ఇలాంటి ఆలోచనలను పక్కన పెట్టి అందరితో మంచిగా మాట్లాడండి. కుటుంబానికి కొంత సమయం కేటాయించండి. స్నేహితులతో మంచి రిలేషన్ ఏర్పరుచుకోండి. తర్వాత చేద్దాం అన్న ఆలోచన తీసేయండి. ఏదైనా మంచి పని చేయాలి అనిపిస్తే వెంటనే చేసేయండి. ఈ జీవితం మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్లు తప్పు లేకుండా నొప్పించకండి. నెగిటివిటీ ని దూరంగా ఉంచండి. ఉన్న ఈ ఒక్క జీవితాన్ని నవ్వుతూ హాయిగా గడపండి. సంతోషం మీ ఆలోచనలకు బలం. మీ అర్జున్...
::::::::: ::::::::::: ::::::::: :::::::::::: :::::::::::: ::::::::::: :::::: :::::
మన పూర్వీకులు అసలు ముగ్గు ఎందుకు పెట్టేవారు ఆ ముగ్గుల అర్థం పరమార్థం ఎటి అనేది తెలుసుకుందాంమే🙏
💮ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగాగీసే రెండు అడ్డగీతలు ఇంటి లోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధి స్తాయి.
ఇంట్లోఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళ కుండా చూస్తాయి.
💮ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభ కార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు! పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి.
💮💮💮💮💮 ఏదేవతపూజచేస్తున్నా దైవాన్నిఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.
💮నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతే కాదు, మనం వేసే పద్మాలు,చుక్కల ముగ్గులలో కూడా మనకుతెలీని అనేక కోణాలు దాగి ఉన్నాయి.అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా!యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.
💮తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి!
💮💮💮💮💮యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం
మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.
💮నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టు ప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి!
💮దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయ కూడదు, ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.
💮ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు,
శ్రీ మహావిష్ణు వు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆస్త్రీకి ఏడు జన్మలవరకు వైధవ్యం రాదని, మరియు సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం చెబు తున్నాయి.
💮పండుగ వచ్చింది కదా అని, నడవ డానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు!
💮ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తాము.దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీ కరించదు. ఏరోజుకారోజు బియ్యపు పిండి తో ముగ్గు పెట్టాలి!
💮నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర దీపా రాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి.
💮ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.
💮ముగ్గులు శుభసూచకాలుగా పని చేస్తాయి.
💮 పూర్వం రోజూ సాధువులు,సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగే వారు.ఏఇంటిముందైనా ముగ్గులేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునే వారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు.
💮ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు! అందుకే మరణించి న వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గువేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యా హ్నమైనా ముగ్గు వేస్తారు.
💮ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి.మనం ఆచరించే ఏఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకా నేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.🙏
No comments:
Post a Comment