సాధారణ జీవితం నుంచి 680 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయిన రామ్ కుమార్ తోట.
ఒక సాధారణ పల్లెటూరి యువకుడు దుబాయిలో నవాబులా ఖరీదైన రోల్స్‌రాయిస్ కారులో తిరగగలడా? బతుకుదెరువు కోసం నానా అగచాట్లు పడినవాడు.. ఒక కంపెనీకి యజమాని కాగలడా? గల్లీలోని అనామకుడు.. గల్ఫ్‌లో నాయకుడు.. కాగలడా? సొంతూరు కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా)లోని వేములవాడ నుంచి... దుబాయి విమానం ఎక్కే వరకు తోట రామ్ కుమార్‌కు గమ్యం తెలీదు. వెళ్లేప్పుడు లగేజీలో బీటెక్కులు, ఎమ్మెస్‌లు లేవు. ఒకసారి తప్పి, మళ్లీ గట్టెక్కిన పదో తరగతి సర్టిఫికెట్టు మాత్రమే ఉంది. అలా మొదలైన ప్రయాణం.. ఎన్నో మలుపులు తిరిగింది. రూ.680 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేతను చేసింది..
1980 ప్రాంతం. కరీంనగర్ జిల్లా.. కరువు.. నిరుద్యోగం.. అటు పోలీసులు.. ఇటు అన్నలు.. బతకాలంటే బట్టలు సర్దుకుని బయటికి వెళ్లిపోవాల్సిందే! పని దొరికితే ఉప్పో కారమో తిని ఊపిరిపీల్చుకోవచ్చు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో.. ఎడారి దేశం ఊరించింది. రెండు జతల బట్టలు, టెన్తు సర్టిఫికెట్టు పట్టుకుని గల్ఫ్ బాట పట్టారు తెలంగాణ గ్రామీణ యువకులు. వారిలో ఒకడు.. వేములవాడ పిలగాడు. ఊరోళ్లకు ‘రాము’. స్కూలోళ్లకు ‘తోట రామ్‌కుమార్’. గల్ఫ్ దేశానికి ఫ్లయిట్ ఎక్కాడు కానీ.. తన బతుకు ఎక్కడ ల్యాండ్ అవుతుందో, ఎలా ఉంటుందో తనకే స్పష్టతలేని పరిస్థితి. పాజిటివ్‌గా ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుందన్న నమ్మకమే ముందుకు నడిపించింది.
కరీంనగర్ జిల్లా వేములవాడలోని ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు రామ్‌కుమార్. తల్లిదండ్రులు తోట నారాయణ, నర్సమ్మ. వ్యవసాయ కుటుంబం. ‘చూడు బిడ్డా... బతుకుడు అంటే.. నువ్వొక్కనివే తినుడు కాదు. నువ్వు బాగా బతకాలె, మరో పదిమందినీ బతికించాలె. అదీ బతుకంటే!’ దుబాయి వెళుతున్న కొడుక్కి మంచిచెడ్డలు చెప్పాడు తండ్రి. అలా.. 1989లో దుబాయికి చేరుకున్నాడు రాము. ఓ కంపెనీలో అకౌంట్స్ అసిస్టెంట్‌గా చేరాడు. రోజులు గడుస్తున్నాయి కానీ.. ఎదుగూబొదుగూ లేదు. ‘నువ్వు పాసైంది పదో తరగతే భయ్యా. ఇంతకంటే మంచి ఉద్యోగం ఏమొస్తుంది?’ అన్నారు దోస్తులు. అవును, నిజమే! పదికే పరిమితమైతే ప్రయోజనం లేదు. పైచదువులు చదవాలన్న కసిని రగిలించాయా మాటలు. దుబాయిలోనే ఇంటర్ పూర్తి చేశాడు. కొన్నాళ్లకు అదీ అర్థమైంది. పైకి రావాలంటే ఈ చదువు సరిపోదని. అకౌంటింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్ నైపుణ్యాలు అవసరం. అక్కడే చార్టర్డ్ అకౌంటెన్సీ చదివాడు. ఒకవైపు సీఏ పరీక్షలకు సిద్ధం అవుతూనే... సేల్స్ మేనేజర్‌గా పనిచేసేవాడు. ఆ తరువాత అదానీ గ్రూప్‌లో సేల్స్ డైరెక్టర్‌గా పెద్ద కొలువే వరించింది.
అదానీ గ్రూప్‌లో ఉద్యోగం రాము జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ పెట్రో కెమికల్ విభాగం అధిపతి యోగేష్ మెహతా ప్రోత్సాహం మరువలేనిది. కార్పొరేట్ పాలనా వ్యవహారాల్లోని లోతుపాతుల్ని తెలుసుకునే అవకాశం కలిగింది. ‘నా కళ్ల ముందు ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృతం అయ్యింది. మెహతా అనుభవం నాకెన్నో పాఠాలను నేర్పింది. ఆయనతో పోల్చుకుంటే, పదిశాతం కష్టపడినా పైకి రావొచ్చని అనిపించింది. నాకు నేనే ఒక కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకునేలా చేసింది’ అంటాడు రాము. అదానీ గ్రూప్‌లో పనిచేస్తున్నప్పుడు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని పలు కంపెనీల సేల్స్ డైరెక్టర్లతో పరిచయం కలిగింది. నెట్‌వర్క్‌ను విస్తరించుకున్నాడు. వివిధ కంపెనీల సేల్స్ డైరెక్టర్ల గ్రూప్‌లో చేరాడు. అక్కడ అంతర్జాతీయ వాణిజ్య అంశాల గురించి చర్చలు జరిగేవి. కొత్త పరిణామాలపై విశ్లేషించు కునేవారు. దీంతో ప్రణాళికలు కొత్త రూపు తీసుకునేవి. సరిగ్గా అప్పుడే దుబాయిలో నిర్మాణరంగం ఊపందుకుంటున్నది. అప్పటి వరకు ఉద్యోగమే జీవితం అనుకున్న ఆయన.. కొత్త అవతారం ఎత్తాలనుకున్నాడు. బిల్డింగ్ మెటీరియల్ ట్రేడింగ్‌పై కన్నేశాడు.
కొన్నేళ్లపాటు పైసా పైసా కూడబెట్టిన డబ్బుకు తోడు.. బ్యాంకుల చుట్టూ తిరిగితే కొంత రుణం లభించింది. ఓ స్నేహితుడు చేతులు కలిపాడు. దుబాయిలోనే 2004లో బిల్డింగ్ మెటీరియల్ ట్రేడింగ్‌కు శ్రీకారం చుట్టాడు రామ్‌కుమార్. ఆయన నెలకొల్పిన కంపెనీ ‘టోటల్ సొల్యూషన్స్’. ఊహించిన దానికంటే గొప్పగా సాగింది వ్యాపారం. లాభాలు కళ్లజూసినప్పుడే భాగస్వామితో పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. 2007లో ఆయన్ని వదులుకోవాల్సి వచ్చింది. సొంతంగా వ్యాపారం చేయడమే తన ముందున్న ఏకైక మార్గం. దేశం కాని దేశం వెళ్లినప్పుడు.. ఏ చిన్న కష్టం వచ్చినా.. ముందు గుర్తొచ్చేది మన ఊరి దేవుడే! వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి అంటే రామ్‌కుమార్‌కు ఎనలేని భక్తి. ఆ దేవుడికే దండం పెట్టుకుని.. అదే పేరుతో దుబాయిలో ‘శ్రీ రాజరాజేశ్వర బిల్డింగ్ మెటీరియల్ ట్రేడింగ్’ (ఎస్‌ఆర్‌ఆర్ బీఎంటీ)ని ప్రారంభించాడు. అప్పటికే పరిచయమున్న కస్టమర్లు తోడ్పాటును అందించారు. పెద్ద పెద్ద భవనాలు, షాపింగ్‌మాల్స్, నివాస ప్రాంతాలు.. ఇలా ఏ నిర్మాణం జరిగినా తనే మెటీరియల్‌ను సరఫరా చేయడం మొదలుపెట్టాడు.
ఆత్మీయుల్ని ఆదుకోవడమే కాదు... పండుగలనూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలన్నది నా ఆశయం. అందుకే పన్నెండేళ్లుగా దుబాయ్‌లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నా.
తొలి ఏడాదిలోనే సుమారు రూ.200 కోట్ల లావాదేవీలతో గల్ఫ్ దేశాల దృష్టిని ఆకర్షించాడు రామ్‌కుమార్. ప్రఖ్యాత బుర్జ్‌ఖలీఫాతో పాటు మొహమ్మద్ బిన్ రషీద్ సిటీ, అల్ మక్‌టౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, అరేబియన్ రాంచెస్, స్పోర్ట్స్ సిటీ, మోటార్‌సిటీ, దుబాయ్ మాల్, ఫామ్ జుమేరా, బిజినెస్ బే... వీటన్నిటికీ భవన నిర్మాణ సామగ్రిని సరఫరా చేసింది ఎస్‌ఆర్‌ఆర్. ‘బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం. ఇలాంటి నిర్మాణానికి మెటీరియల్ సరఫరా చేసే అవకాశం రావడం.. నా జీవితంలో మరపురాని అనుభవం’ అని గుర్తు చేసుకుంటాడు రామ్‌కుమార్. దుబాయిలో ఏ పెద్ద నిర్మాణం చేపట్టినా తన కంపెనీ మెటీరియల్ ఉండాల్సిందే! యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈ తరహా వ్యాపారం చేస్తున్న కంపెనీల్లో ఆయనది రెండోస్థానం. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) టాప్ బిలియనీర్ కంపెనీల జాబితాలో 23వ స్థానం దక్కించుకుంది ఎస్‌ఆర్‌ఆర్.
అంతటితో ఆగలేదు. చైనాలోనూ అడుగుపెట్టాడు రామ్‌కుమార్. అక్కడ అల్యూమినియం ప్యానెళ్ల పరిశ్రమను నెలకొల్పాడు. 2005లో మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు రూ.200 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. ఇందులో తన వాటా 40 శాతం. ఇటు దుబాయిలో వ్యాపారం విస్తరిస్తోంది, అటు చైనాలో విజయవంతమైంది. మరికొందరి సహాయంతో ఒమన్‌లో కూడా ఒక శాఖను ప్రారంభించాడు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌కు బిల్డింగ్ మెటీరియల్ సరఫరా చేసే టాప్ డీలర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. దుబాయి, ఒమన్... రెండు చోట్లా కలిపి ఎస్‌ఆర్‌ఆర్ సంస్థ ఏడాదికి రూ.600 కోట్ల లావాదేవీలను నిర్వహిస్తోంది. సుమారు 16 అవుట్‌లెట్లలో 345 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లలో తెలుగువారితో పాటు ఇతర దేశాల వాళ్లు కూడా ఉన్నారు. దాదాపు వెయ్యి రకాల మెటీరియల్‌ను ఈ కంపెనీ సరఫరా చేస్తోంది.
మా ఊరికి ఏం చేసినా తక్కువే. నాకు జీవితాన్ని ఇచ్చిన పల్లె అది. ఇప్పటిదాకా చేసిన సాయం వేరు. ఇకపై చేయాల్సింది వేరు. అందుకే సేవ ఆర్గనైజ్డ్‌గా ఉండాలని వేములవాడలో టీఆర్‌కే ట్రస్టును ప్రారంభించాను. మా బావ వుప్పుల దేవరాజు, మిత్రులు నాయిని శేఖర్, గోలి శ్రీనివాస్, బూర సదానందంలను ట్రస్టీలుగా నియమించాను. ట్రస్టు కోసం ఒక భవనాన్ని నిర్మిస్తున్నాను. చుట్టుపక్కల గ్రామాలకు సైతం సేవల్ని విస్తరించే ఆలోచన ఉంది.
2008లో దుబాయిలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. రెండేళ్లపాటు వ్యాపారాలను అతలాకుతలం చేసింది. ఆ అడ్డంకుల్ని ధైర్యంగా తట్టుకుని నిలబడింది ఎస్‌ఆర్‌ఆర్ సంస్థ. అంతటి సంక్షోభంలోనూ ఒక్క ఉద్యోగినీ తొలగించలేదు, ఎవరికీ ఒక్క రూపాయి జీతమూ తగ్గించలేదు. కొన్నాళ్లు ఓపికతో వ్యాపారాన్ని నడిపించాడు రామ్‌కుమార్. ఆ తరువాత అదే ఊపందుకుంది. లాభాల పంట పండింది. అయితే 2016లో గట్టి దెబ్బ తగిలింది. కొందరు కస్టమర్లు విలువైన సరుకు తీసుకుని.. రూ.10 కోట్లకు చెక్కులు ఇచ్చారు. అంతలోనే తమ కంపెనీని గుట్టుచప్పుడు కాకుండా మూసేశారు. ఆ మోసాన్ని జీర్ణించుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. అలాంటి ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలిచాడు రామ్‌కుమార్.
నాకు స్నేహితులంటే చాలా ఇష్టం. జీవితంలోని ప్రతి మలుపులో ఫ్రెండ్స్ లేకుండా నేను లేను. ఎక్కడున్నా, ప్రత్యేకించి హైదరాబాద్, వేములవాడలకు ఎప్పుడు వచ్చినా... చుట్టూ స్నేహితులు ఉండాల్సిందే. నేను ఉన్నత స్థితికి చేరాక వాళ్ల జీవితాలనూ మెరుగ్గా చూడాలను కున్నా. అందుకే వాళ్ల కష్టాలూ తీరుస్తున్నా.
రామ్‌కుమార్ దుబాయికి వెళ్లిన కొత్తలో ఇరుకైన గదిలో ఉండేవాడు. ఇప్పుడు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీసును ఏర్పాటు చేసుకున్నాడు. సొంతూళ్లో చిన్న ఇంట్లో సర్దుకుని బతికినవాడు.. ఈ రోజు దుబాయిలో విలాసవంతమైన విల్లాను సొంతం చేసుకున్నాడు. వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి ఫెయిలైనవాడు.. పరాయి దేశంలో చార్టర్డ్ అకౌంటెన్సీ పాసయ్యాడు. తొలినాళ్లలో ఒక చిన్న కారు కొంటే.. ఈ జీవితానికి చాలని అనుకున్నవాడు.. ఖరీదైన రోల్స్‌రాయిస్‌లో షికార్లు చేస్తున్నాడు. పెద్ద కొడుకును ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదివిస్తున్నాడు. చిన్న కొడుకు, కూతురు దుబాయిలోని పేరున్న పాఠశాలలో చదువు కుంటున్నారు. గల్ఫ్‌కు వెళ్లి నాలుగు కాసులు సంపాదించి.. తల్లిదండ్రులకు పంపిస్తే అదే పదివేలు అనుకున్నవాడు.. ఇప్పుడు దుబాయిలో తెలంగాణ తరఫున కాన్సులేట్ మెంబర్‌గా గౌరవం దక్కించుకున్నాడు. ‘బతకడమంటే నువ్వొక్కడివే బతకడం కాదు.. నీతోపాటు మరో నలుగుర్ని బతికించు.. అన్న నాన్న మాటలు నన్ను ప్రభావితం చేశాయి.
ఒక కంపెనీని నెలకొల్పాలి బిడ్డా - అని నాన్న చెప్పలేదు కానీ.. కొందరికైనా సహాయం చేయాలన్నాడు. ఆ దృక్పథమే ఒక వ్యవస్థ నిర్మాణానికి ప్రేరణగా నిలిచింది. ఈ రోజు నా సంస్థ ఎస్‌ఆర్‌ఆర్‌లో ఇంతమందికి ఉపాధి దొరుకుతోందంటే.. నాన్న కల ఫలించినట్లే కదా!’ అంటున్న రామ్‌కుమార్ కళ్లలో ఆనందభాష్పాలు.......
2. *మరో సూర్యుడు..బొల్లా శ్రీకాంత్*
మచిలీపట్నం జిల్లా లోని సీతారామపురం పల్లెలో ఒక రైతుకుటుంబం లో 1992 జూలై 7 వ తేదీన బొల్లా శ్రీకాంత్ పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి.
ఆ వూరిజనం అయితే మరో అడుగు ముందుకేసి , ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు. కానీ అమ్మ నాన్న అలా చేయలేదు. '' మేము బతికున్నంతవరకు వీడిని బాగా చూసుకొంటాం. మేము పోయాక దేవుడే చూసుకోవాలి '' అని అనేవారు.
కళ్ళుకనపడకపోవడం తప్ప , బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుకుగా వుండేవాడు. కానీ ఇంటర్ లో ' నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేమని '' కాలేజీలు చెపితే శ్రీకాంత్ కోర్టుకెళ్ళి గెలిచి admission తెచ్చుకొన్నాడు. తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి 2 ఏళ్ళు ఇంట్లోనే వుండిపోయాడు. మళ్ళీ హైదరాబాద్ లో school for the specially abled లో చేరాడు. అక్కడకూడా పిల్లలు అవమానపెట్టారు. అందరూ తనను వదిలేసి వెళ్ళిపోతుంటే బాధ తట్టుకోలేక బడివదిలేసి. పారిపోతుంటే ఒక teacher పట్టుకొని చెంపచెళ్ళుమనిపించింది.
అది అతని జీవితం లో game changing moment. ఆ టీచర్ ఆడియో టేపుల్లో పాఠాలు వినిపించింది. ఇంటర్ లో MPC చదివి 98% సంపాదించగా ఎగతాళి చేసినవారు అవాక్కయ్యారు. కానీ IIT వాళ్ళు సీటు ఇవ్వమన్నారు.
నిరాశ పడని అతను అమెరికా universities లకు entrance exams వ్రాస్తే Stanford , మరో 2 universities admission ఇవ్వడానికి ముందుకొచ్చాయి.
శ్రీకాంత్ Howard Massachusetts Institute of Technology [ అమెరికా ] లో చేరాడు. అక్కడ Brain Cognitive Sciences లో చేరిన తొలి అంధుడిగా రికార్డు పొందాడు. అతని ప్రతిభ చూసి , చదువు అయ్యాక 4 అమెరికన్ కంపెనీ లు తమదగ్గర వుద్యోగం చేయమని అడిగితే శ్రీకాంత్ సున్నితంగా ' లేదు ' అనిచెప్పాడు. ' భారతదేశం చేరుకొని తనతోటి నిరుపేద , దివ్యాంగ భారతీయులకు సహాయపడే భాగ్యాన్ని నాకు ఇవ్వు ' అని అతను భగవంతుడిని ప్రతి రాత్రీ ప్రార్థించేవాడు. ప్రార్థనలు పరమాత్మ విన్నాడు.
శ్రీకాంత్ India కు వచ్చి హైదరాబాద్ దగ్గర Bollant Industries స్థాపించాలని వుందంటే రతన్ టాటా ముందుకొచ్చి ఫండ్స్ ఇచ్చారు. అది మొదలైంది. ఈరోజు అది 150 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీ. దానికి శ్రీకాంత్ CEO. సాక్షాత్తూ అబ్దుల్ కలాం గారే అక్కడికొచ్చారు. ఇద్దరూ కలిసి Lead India Project ద్వారా 4 లక్షలమంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు. శ్రీకాంత్ దగ్గర ఇపుడు సుమారు 300 మంది దివ్యాంగులు వుద్యోగాలు చేస్తున్నారు. అతను 3000 మంది విద్యార్థులను చదివిస్తున్నాడు.
చీకటి ని అసహ్యించుకోనేవారు కొందరు , చీకటి ని చూసి భయపడేవారు ఇంకొందరు , చీకటిని చీల్చుకువెళ్ళేవారు మరికొందరు.ఆ మూడవరకం వాళ్ళను మూడక్షరాల పదం లో '' సూర్యుళ్ళు '' అంటారు. మనవాడు మరోసూర్యుడు,మరియు ఎందరికో మార్గదర్శి,ఇటువంటి వారి చరిత్రలు ఎందరికో దశ,దిశ నిర్దేశితాలు....
..... ,,....,,,... ,,, .. , ... , ,,,, ...... ,,,, , .........

*ఇద్దరు అమ్మాయిల కధ* ...
*నాటి డిఎస్పీ కూతుళ్లు నేడు దేశానికి ఆదర్శం*
ఈ కధ ముప్పై అయిదేళ్ళ క్రితం 12 మార్చి 1982 న మాదాపూర్ అనే గ్రామం లో ఉత్తర ప్రదేశ్ లోని గౌండ జిల్లాలో మొదలయ్యింది..
క్రిమినల్స్ గురించి సమాచారం రావటంతో తన సబ్ అర్దినేట్స్ తో కలిసి DSP ఎస్.పి. సింగ్ రాత్రి వేళ హుటాహుటిన వెళ్ళాడు.అతని మ్ర్రతదేహం మర్నాడు ఉదయం ప్రభుత్వ అసుపత్రి కి చేరింది. మరో 12 మంది దుండగులతో కలిసి అతను బాంబు దాడిలో చనిపోయినట్లు బార్య విభా సింగ్ కి సమాచారం పంపారు.
నిజానికి DSP సింగ్ కి అతని సబ్ అర్దినేట్స్ కి మధ్య ఉన్న వైరం అతన్ని పొట్టన పెట్టుకుంది. అతని సబ్ ఆర్దినేట్స్ ఒక నకిలీ ఎన్కౌంటర్ లో చంపేశారు. “దయచేసి నన్ను కాల్చొద్దు. నాకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు” అనేది ఆయన చివరి మాట. సింగ్ భార్య 'విభా సింగ్' హై కోర్టుని ఆశ్రయించింది. సిబిఐ కి కేసు బదలాయించారు. తోటి ఉద్యోగులు క్రిమినల్స్ తో కలసి ఈ దారుణానికి పాల్పడినట్లు సిబిఐ చార్జ్ షీట్ ఫైల్ చేసింది. సుదీర్గమయిన కోర్టు ప్రక్రియ మొదలయింది. DSP సింగ్ హత్య జరిగినప్పటికి, అతనికి బార్య విభా సింగ్ కి కింజాల్ అనే ఆర్నెళ్ళ పాప, ఇంకా లోకం చూడని (ప్రింజాల్ సింగ్) బిడ్డ ఉన్నారు. తల్లి కి వారణాసి ట్రెజరీ లో ఓక చిన్న ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. తండ్రి మరణాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కోసం తల్లి చేసిన పోరాటం నీరు కారి పోయింది. భర్త తో పాటు పని చేస్తున్న ఉద్యోగులు ఆమెకి ఎవరు సహకరించలేదు.
ఆమె ఉద్యోగం లో జాయిన్ అయింది. రెండో బిడ్డ భూమి మీదకి వచ్చింది. ఇద్దరు పిల్లలని ఆమె చదివించడం మొదలెట్టింది. కొద్ది ఆదాయం, తండ్రి లేని ఒంటరి కుటుంబం. అన్ని రకాల గడ్డు సమస్యలని ఎదుర్కుంది. పిల్లలిద్దరూ వారి చదువుల కోసం అనేక త్యాగాలు చేసారు. తండ్రి ఫోటో ని చూస్తూ.. అతన్నే ఇన్స్పిరేషన్ గా తీసుంటూ ఇష్టపడి చదువు సాగించారు.
పెద్దమ్మాయి కింజాల్ డిల్లీ లోని అత్యున్నతమయిన “లేడి శ్రీరాం కాలేజ్” లో సీటు సంపాదించింది. కింజాల్ డిగ్రీ మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు తల్లి కి కాన్సర్ అని తెలుసుకుంది. ఆమె ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని తెలిసిన రెండు రోజుల కి వ్రాసిన పరిక్షల లో ఆమె యునివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. తల్లి మరణ శయ్య వద్ద తామిద్దరు UPSC క్రాక్ చేస్తామని మాట ఇచ్చింది. 2004 లో తల్లి మరణానంతరం అక్క చేల్లెల్లిద్దరు డిల్లీ చేరారు. ముఖర్జీ నగర్ లో ఒక సాధారణ గది లో నివాసం ఉంటూ UPSC కి చదవటం మొదలెట్టారు. మిత్రుల వద్ద అరువు తెచ్చుకున్న పుస్తకాలతో వాళ్ళు యజ్ఞం మొదలెట్టారు. స్వగ్రామం మరిచి పోయారు. బంధువులు లేరు. ఒక పండగ లేదు ఒక సరదా లేదు. ఒక విరామం లేదు. వాళ్లిద్దరు ఒకరి కొకరు ప్రేరణ. వాళ్ళిద్దరికి తల్లి తండ్రి ప్రేరణ. 2007 లో కింజాల్ సింగ్ IAS, ప్రింజాల్ సింగ్ IRS ని సాధించారు. వారిద్దరి పట్టుదల విజయగాధ జ్యుడిషిల్ వ్యవస్థని తాకింది. తండ్రి ని చంపిన 31 ఏళ్ల తర్వాత, చార్జ్ షీట్ చేసిన 27 ఏండ్ల తర్వాత ఎనిమిది మంది పోలిస్ అధికారులని నిందితులుగా నిర్ధారించింది. ఎస్ పి సింగ్ నిజాయితీని, తల్లి ఆరోపణలని నిజమని ప్రపంచానికి కోర్టు రుజువు చేసింది. తీర్పు చెప్పినప్పుడు అప్పటి 'లక్ష్మి పుర ఖేరి' జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ గా ఉన్న కింజాల్ సింగ్ దుఖం దాచుకోలేక పోయింది. కన్నీటి పర్యంతం అయింది. ఆడపిల్లలని తక్కువ గా చేసి చూసే వాళ్ళకి,మాట్లాడే వాళ్లకి కింజాల్ సింగ్, ప్రింజాల్ సింగ్ ఒక సమాధానం.దేశం గర్వించదగ్గ ఈ సోదరీమణులు ఇద్దరు అనేక మంది పిల్లలకి ఆ
*ఇద్దరు అమ్మాయిల కధ* ...
*నాటి డిఎస్పీ కూతుళ్లు నేడు దేశానికి ఆదర్శం*
ఈ కధ ముప్పై అయిదేళ్ళ క్రితం 12 మార్చి 1982 న మాదాపూర్ అనే గ్రామం లో ఉత్తర ప్రదేశ్ లోని గౌండ జిల్లాలో మొదలయ్యింది..
క్రిమినల్స్ గురించి సమాచారం రావటంతో తన సబ్ అర్దినేట్స్ తో కలిసి DSP ఎస్.పి. సింగ్ రాత్రి వేళ హుటాహుటిన వెళ్ళాడు.అతని మ్ర్రతదేహం మర్నాడు ఉదయం ప్రభుత్వ అసుపత్రి కి చేరింది. మరో 12 మంది దుండగులతో కలిసి అతను బాంబు దాడిలో చనిపోయినట్లు బార్య విభా సింగ్ కి సమాచారం పంపారు.
నిజానికి DSP సింగ్ కి అతని సబ్ అర్దినేట్స్ కి మధ్య ఉన్న వైరం అతన్ని పొట్టన పెట్టుకుంది. అతని సబ్ ఆర్దినేట్స్ ఒక నకిలీ ఎన్కౌంటర్ లో చంపేశారు. “దయచేసి నన్ను కాల్చొద్దు. నాకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు” అనేది ఆయన చివరి మాట. సింగ్ భార్య 'విభా సింగ్' హై కోర్టుని ఆశ్రయించింది. సిబిఐ కి కేసు బదలాయించారు. తోటి ఉద్యోగులు క్రిమినల్స్ తో కలసి ఈ దారుణానికి పాల్పడినట్లు సిబిఐ చార్జ్ షీట్ ఫైల్ చేసింది. సుదీర్గమయిన కోర్టు ప్రక్రియ మొదలయింది. DSP సింగ్ హత్య జరిగినప్పటికి, అతనికి బార్య విభా సింగ్ కి కింజాల్ అనే ఆర్నెళ్ళ పాప, ఇంకా లోకం చూడని (ప్రింజాల్ సింగ్) బిడ్డ ఉన్నారు. తల్లి కి వారణాసి ట్రెజరీ లో ఓక చిన్న ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. తండ్రి మరణాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కోసం తల్లి చేసిన పోరాటం నీరు కారి పోయింది. భర్త తో పాటు పని చేస్తున్న ఉద్యోగులు ఆమెకి ఎవరు సహకరించలేదు.
ఆమె ఉద్యోగం లో జాయిన్ అయింది. రెండో బిడ్డ భూమి మీదకి వచ్చింది. ఇద్దరు పిల్లలని ఆమె చదివించడం మొదలెట్టింది. కొద్ది ఆదాయం, తండ్రి లేని ఒంటరి కుటుంబం. అన్ని రకాల గడ్డు సమస్యలని ఎదుర్కుంది. పిల్లలిద్దరూ వారి చదువుల కోసం అనేక త్యాగాలు చేసారు. తండ్రి ఫోటో ని చూస్తూ.. అతన్నే ఇన్స్పిరేషన్ గా తీసుంటూ ఇష్టపడి చదువు సాగించారు.
పెద్దమ్మాయి కింజాల్ డిల్లీ లోని అత్యున్నతమయిన “లేడి శ్రీరాం కాలేజ్” లో సీటు సంపాదించింది. కింజాల్ డిగ్రీ మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు తల్లి కి కాన్సర్ అని తెలుసుకుంది. ఆమె ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని తెలిసిన రెండు రోజుల కి వ్రాసిన పరిక్షల లో ఆమె యునివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. తల్లి మరణ శయ్య వద్ద తామిద్దరు UPSC క్రాక్ చేస్తామని మాట ఇచ్చింది. 2004 లో తల్లి మరణానంతరం అక్క చేల్లెల్లిద్దరు డిల్లీ చేరారు. ముఖర్జీ నగర్ లో ఒక సాధారణ గది లో నివాసం ఉంటూ UPSC కి చదవటం మొదలెట్టారు. మిత్రుల వద్ద అరువు తెచ్చుకున్న పుస్తకాలతో వాళ్ళు యజ్ఞం మొదలెట్టారు. స్వగ్రామం మరిచి పోయారు. బంధువులు లేరు. ఒక పండగ లేదు ఒక సరదా లేదు. ఒక విరామం లేదు. వాళ్లిద్దరు ఒకరి కొకరు ప్రేరణ. వాళ్ళిద్దరికి తల్లి తండ్రి ప్రేరణ. 2007 లో కింజాల్ సింగ్ IAS, ప్రింజాల్ సింగ్ IRS ని సాధించారు. వారిద్దరి పట్టుదల విజయగాధ జ్యుడిషిల్ వ్యవస్థని తాకింది. తండ్రి ని చంపిన 31 ఏళ్ల తర్వాత, చార్జ్ షీట్ చేసిన 27 ఏండ్ల తర్వాత ఎనిమిది మంది పోలిస్ అధికారులని నిందితులుగా నిర్ధారించింది. ఎస్ పి సింగ్ నిజాయితీని, తల్లి ఆరోపణలని నిజమని ప్రపంచానికి కోర్టు రుజువు చేసింది. తీర్పు చెప్పినప్పుడు అప్పటి 'లక్ష్మి పుర ఖేరి' జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ గా ఉన్న కింజాల్ సింగ్ దుఖం దాచుకోలేక పోయింది. కన్నీటి పర్యంతం అయింది. ఆడపిల్లలని తక్కువ గా చేసి చూసే వాళ్ళకి,మాట్లాడే వాళ్లకి కింజాల్ సింగ్, ప్రింజాల్ సింగ్ ఒక సమాధానం.దేశం గర్వించదగ్గ ఈ సోదరీమణులు ఇద్దరు అనేక మంది పిల్లలకి ఆదర్శం.
:::::::::::::::::::::::: :::::::::::::::::::::::: ::::::::::::::: :::::::::: : :::::::::
🔳పేదల్లేని గ్రామం.. చెబుతోంది పాఠం..!
*అదొక చిన్న పల్లెటూరు. దాన్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వారిలో విదేశీయులూ ఉంటారు. ఆఖరికి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు కూడా ఓసారి చూసి వెళ్లారు. అంతగా ఏముందా ఊళ్లో అంటే- నేర్చుకోవడానికి చాలానే ఉంది. అభివృద్ధికీ స్వావలంబనకీ నిఖార్సైన ఉదాహరణ ఆ పల్లె. ప్రజల బాగోగులే లక్ష్యంగా పనిచేసే నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆ పంచాయతీకి ప్రెసిడెంటుగా చేసిన షణ్ముగం. ఆయన ఆధ్వర్యంలో ఒకటీ రెండూ కాదు, పదుల సంఖ్యలో ప్రథమ స్థానాలు అందుకున్న ఆ ఆదర్శ పంచాయతీ కథా కమామిషూ అభినందనీయం... ఆసక్తికరం!
ఒడంతురై... నీలగిరుల సానువుల్లో కోయింబత్తూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం. చుట్టూ పచ్చని అరటి తోటలూ మబ్బులతో దోబూచులాడే కొబ్బరి చెట్లూ పసుపు ఆరబోసినట్లుండే ఆవ తోటలు.
ఒడంతురై గ్రామ పంచాయతీ కింద ఉన్న ఓ డజను చిన్న చిన్న పల్లెల్లో అంతా కలిసి పదివేల జనాభా ఉంటుంది. అందులో కొందరే రైతులు. ఎక్కువ మంది చుట్టుపక్కల తోటల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు... గిరిజనులు.
పాతికేళ్ల క్రితం ఆ పంచాయతీ పేదరికానికి ప్రతినిధిలా ఉండేది. ఇళ్లంటే చిన్న చిన్న గుడిసెలు. పొద్దున్నే లేచి పిల్లలూ పెద్దలూ తలా ఓ బిందె పట్టుకుని రెండు మూడు గంటలు నడిచి వెళ్లి నది నుంచి నీళ్లు తెచ్చుకునేవారు. ఆ తర్వాత పెద్దలు కూలికి వెళ్తే పిల్లలు వీధులమ్మట తిరుగుతూ ఉండేవారు.
అలాంటిది పదేళ్లలో ఆ ఊరి రూపురేఖలే మారిపోయాయి. గుడిసెల స్థానంలో పక్కా ఇళ్లు. వాకిట్లో మంచినీళ్ల పంపులు. సౌరశక్తితో వెలిగే వీధి దీపాలు. పిల్లలకోసం చక్కటి బడులు. ఇప్పుడది ఎందరికో పాఠాలు చెబుతున్న ‘మోడల్ విలేజ్’. ఆ మార్పుకి కారణం రామస్వామి షణ్ముగం.
పదవి చేపట్టి...
దాదాపు పాతికేళ్ల క్రితం సంగతిది. రైతుగా ఒకరి మీద ఆధారపడకుండా హాయిగా సాగిపోయేది నలభయ్యేళ్ల షణ్ముగం జీవితం. ఊరి పరిస్థితులే అతడికి విసుగు తెప్పించేవి. తాగునీటి వసతి లేదు, రోడ్లు లేవు, పిల్లలకు బడులు లేవు, కరెంటు లేదు. ప్రభుత్వాలేమో ఏమేమో చేసేస్తున్నామని వార్తల్లో చెబుతుంటాయి. తన ఊరేమో ఎన్నేళ్లయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. గ్రామసభ జరిగినప్పుడల్లా ప్రెసిడెంటుని నిలదీసేవారు. కానీ అటునుంచి సరైన సమాధానం వచ్చేది కాదు. విసిగిపోయిన షణ్ముగం 1996లో తానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రెసిడెంటు అయ్యారు. ఊరి ప్రజలకు స్థానిక పాలన ఎలా ఉండాలో చేసి మరీ చూపించారు. ఊరివాళ్లకు ఆయన చెప్పిందే వేదం. రెండు దశాబ్దాలపాటు ఆయన ప్రతిపాదించిన ఏ పథకానికీ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవలేదు. మొదటి పదేళ్లూ ఆయనా, ఆ తర్వాత పదేళ్లూ ఆయన భార్య లింగమ్మాళ్(పంచాయతీని మహిళలకు కేటాయించడంతో) పంచాయతీ ప్రెసిడెంట్లుగా పనిచేసి ఊరి అభివృద్ధిని ఓ కొలిక్కి తెచ్చారు. ఈ దంపతుల కృషి వల్ల గ్రామ ఆదాయం ఎన్నో రెట్లు పెరిగింది. దానికి తగ్గట్టుగా ప్రజల జీవన ప్రమాణాలూ పెరిగాయి. అవినీతిరహితంగా సాగిన వారి పాలనే అందుకు కారణం
అలా... డబ్బొచ్చింది!
ఎన్నికల్లో గెలిచి బల్లకు ఇటువైపు కూర్చున్నాక అసలు పరిస్థితి అర్థం అయింది... అంటారు షణ్ముగం తొలి రోజుల్ని గుర్తుచేసుకుంటూ. ఊళ్లో ఎటు చూసినా సమస్యలే. పంచాయతీ ఆదాయమేమో కేవలం రూ.20వేలు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియలేదు. డబ్బుంటే ఏ పని అయినా చేయొచ్చని ముందుగా ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించారు. గ్రామసభ పెట్టి పరిస్థితి ప్రజలకు వివరించారు. నూరుశాతం పన్నులు కడితే దానికి మూడు రెట్లు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇస్తుందనీ ఆ డబ్బు ఉంటే ఎన్ని పనులో చేసుకోవచ్చనీ చెప్పారు. వారూ సహకరించారు. దాంతో ఆదాయం రూ.1.75 లక్షలకు పెరిగింది. ప్రభుత్వం నుంచి రూ.5.25 లక్షలు వచ్చాయి. అలా ఆ తర్వాత ఏడాది రూ.3.5 లక్షలు వసూలు చేస్తే ప్రభుత్వం పదిన్నర లక్షలిచ్చింది. చేతికి డబ్బు అందడంతో షణ్ముగం అభివృద్ధి ప్రణాళికల మీద దృష్టిపెట్టారు. పన్నుల వసూళ్లలో కఠినంగా వ్యవహరించడం పట్ల ప్రజలెవరూ అభ్యంతరం చెప్పలేదు. అందుకు తగినట్లుగా పంచాయతీ అందిస్తున్న సేవల్ని వారు గుర్తించారు. ఎవరు ఏ ఫిర్యాదుతో వచ్చినా రెండురోజుల్లో పరిష్కారమయ్యేలా చూసేవారు షణ్ముగం.
ఇంటికి... నీరు
నిజానికి ఆ రోజుల్లో ఊరి జనాభా రెండు వేలు మాత్రమే. అంతమందికీ ఒకే ఒక్క బోరుబావి ఉండేది. అందుకే చాలామంది దూరంగా ఉన్న నదినుంచో, తోటల్లోని బావుల నుంచో నీరు తెచ్చుకునేవారు. అవి శుభ్రమైనవి కాకపోవటంతో తరచూ అనారోగ్యాలకు గురయ్యేవారు. మరికొన్ని బోరుబావులు వేయించినా వేసవిలో అవి ఎండిపోయే ప్రమాదం ఉంది. అందుకని భవానీ నది నుంచి పన్నెండు పల్లెలకూ పైపుల ద్వారా నీటి సరఫరాకి రూ.30లక్షల ప్రతిపాదనతో ప్రాజెక్టు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. అంత డబ్బు ఒక్క పంచాయతీకే ఇవ్వడం కుదరదన్నారు అధికారులు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రపంచబ్యాంకు సహకారంతో గ్రామీణ నీటి సరఫరాకోసం కొత్త పథకాన్ని ప్రకటించింది. దానికింద అయితే పది శాతం ఖర్చు పంచాయతీ పెట్టుకోవాలి. కలెక్టర్ ఆ విషయాన్ని షణ్ముగం దృష్టికి తెచ్చారు. మరోసారి ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపొందిస్తే ఈసారి ఖర్చు 48 లక్షలు తేలింది. దాంతో షణ్ముగం పరిస్థితిని ప్రజలకు వివరించారు. పదోవంతు అంటే దాదాపు ఐదు లక్షలు ఊరి తరఫున కట్టడానికి ప్రజలు అంగీకరించారు. డబ్బున్నవారు ఎక్కువిచ్చారు. లేనివాళ్లు తమ స్తోమత మేరకు వందా ఐదొందలూ... ఇచ్చారు. ఆ పథకం అమలుపై మంగళూరులో జరిగిన దక్షిణ ప్రాంత సదస్సుకి- ప్రజల నుంచి అంత పెద్ద మొత్తం కడతామన్న హామీతో హాజరైన పంచాయతీ ప్రెసిడెంటు షణ్ముగం ఒక్కరే. దాంతో తొలి ప్రాజెక్టు వారికే మంజూరయింది. ఏడాదికల్లా 13కి.మీ.ల పైప్‌లైన్, ఫిల్టర్ పాయింట్, ఓవర్‌హెడ్ ట్యాంకులు సిద్ధమై అన్ని పల్లెలకీ నీళ్లు వచ్చాయి. ఎంత పెద్ద పని తప్పిందో... అంటూ ఆనందంతో పొంగిపోయారు గృహిణులు. పిల్లల్ని బడికి పంపించడం మొదలెట్టారు.
అంతలోనే...
ఊరివాళ్లందరికీ నీళ్లిచ్చామన్న సంతోషం ఎంతో కాలం నిలవలేదు ప్రెసిడెంటుకి. మోటార్లతో పంపింగ్ వల్ల కరెంటు బిల్లు భారంతో పంచాయతీ నడ్డి విరిగినంత పనైంది. బడ్జెట్‌లో సగానికి పైగా ఆ బిల్లుకే సరిపోతే ఇక మిగతా పనులేం చేయగలం అనుకున్న షణ్ముగం ప్రత్యామ్నాయాల కోసం వెతుకులాట మొదలెట్టారు. బయోమాస్ గ్యాసిఫయర్ విధానాన్ని ప్రయత్నిద్దామనుకున్నారు. ఈ పద్ధతిలో ఏవైనా జీవవ్యర్థాలను ఉపయోగించి గ్యాస్‌ని తయారుచేయవచ్చు. దాని గురించి బరోడా వెళ్లి శిక్షణ పొంది వచ్చారు. రాగానే తొమ్మిది కిలోవాట్ల గ్యాసిఫయర్‌ని ఏర్పాటుచేశారు. కలప మిల్లుల్లో వ్యర్థంగా పడివుండే కర్రముక్కల్ని కిలో 60పైసల చొప్పున కొని అందులో వాడేవారు. దాంతో కరెంటు ఖర్చు సగానికి తగ్గి, నాలుగేళ్లు బండి సాఫీగా సాగింది. ఇంతలో కర్రముక్కల ధర కిలో రూ.3.50కి పెరిగింది. మరో పక్క కరెంటేమో యూనిట్‌కి రూ.1.75 మాత్రమే. దాంతో గ్యాసిఫయర్‌ని మూసేసి మళ్లీ కరెంటే వాడారు.
అయితే పునరుత్పాదక ఇంధన వనరుల అన్వేషణ మాత్రం ఆపలేదు షణ్ముగం. ఎక్కడ సదస్సు జరిగినా హాజరవుతూ సోలార్ వీధి దీపాల గురించి తెలుసుకున్నారు. రెండు పల్లెల్లో వీధి దీపాలకోసం 2కెవి సోలార్ సిస్టమ్స్‌ని ఏర్పాటుచేశారు. దాంతో కరెంటు బిల్లు ఐదు వేలు తగ్గింది. ఈ రెండు ప్రయోగాల అనుభవాన్నీ క్రోడీకరించి రెండు పాఠాలు నేర్చుకున్నానంటారు షణ్ముగం. అవేంటంటే- విద్యుత్ బోర్డు ద్వారా సరఫరా అయ్యే కరెంటుని ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉంచుకోవాలి. రెండోది పునరుత్పాదక విద్యుత్ వనరులతో డబ్బు పొదుపు చేయడమే కాదు, డబ్బు సంపాదించవచ్చు కూడా అని. దాంతో ఈసారి పెద్ద లక్ష్యాన్నే పెట్టుకున్నారాయన. ఏకంగా విండ్ మిల్‌కి ప్రణాళిక సిద్ధంచేసుకున్నారు.
సరిగ్గా ఆ సమయానికి ప్రెసిడెంట్‌గా ఆయన పదవీ కాలం ముగిసింది. అయితే ఆ సీటును మహిళలకు కేటాయించడంతో తన భార్యనే ప్రెసిడెంట్‌గా నిలబెట్టి గెలిపించి, ఇద్దరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు.
గాలిమరతో విద్యుత్తు
ఒక గ్రామపాలనా సంస్థ విండ్‌మిల్(గాలిమర)ని ఏర్పాటుచేయడం (2006లో) దేశంలోనే ప్రథమం. ఒడంతురైకి 140కి.మీ. దూరంలో మైవాడి అనే ప్రాంతంలో చాలా గాలిమరలున్నాయి. విండ్‌ఫార్మ్ అంటారా ప్రాంతాన్ని. పలు వ్యాపార సంస్థలు అక్కడ గాలిమరలను ఏర్పాటు చేసుకున్నాయి. షణ్ముగం కూడా తమ గాలిమరను తీసుకెళ్లి అక్కడ పెట్టించారు. అలా చేయడం వల్ల ప్రత్యేకంగా దాని నిర్వహణ ఖర్చు తప్పింది. ఒక్కో గాలిమర నుంచి తయారైన విద్యుత్తు రాష్ట్ర విద్యుత్తు శాఖ గ్రిడ్‌కి చేరుతుంది. దాని ధర సంబంధిత యజమాని ఖాతాలో జమవుతుంది. 350 కిలోవాట్ల సామర్థ్యం కల ఈ విద్యుత్తు ప్లాంట్ ఏడాదికి ఆరులక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అందులో రెండు లక్షల యూనిట్లను రాష్ట్ర విద్యుత్ బోర్డుకు అమ్ముతారు. దానికి పెట్టుబడి కోటిన్నర పైనే అయింది. నలభై లక్షలు పంచాయతీ దాచుకున్న సొమ్ము. మిగతాది బ్యాంకు నుంచి లోను తీసుకున్నారు. 2013లో ఆ లోను కూడా తీరిపోయింది. ఇప్పుడు విద్యుత్తు అమ్మడం వల్ల పంచాయతీకి ఏటా దాదాపు 20 లక్షల వరకూ ఆదాయం వస్తోంది. ఆ డబ్బంతా ఏం చేస్తున్నారూ అంటే...
అభివృద్ధికి చిరునామా
ఆదాయం పెరుగుతున్నకొద్దీ ఒక్కో సమస్యా పరిష్కరించుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించారు షణ్ముగం. పంచాయతీ పరిధిలోని అన్ని పల్లెలకూ పక్కా రోడ్లు వేయించారు. సౌరశక్తితో వెలిగే వీధి దీపాలు పెట్టించారు. వీధులన్నీ ఎప్పుడూ శుభ్రంగా ఉంటాయి. అన్ని ఊళ్లకీ పాఠశాలలు అందుబాటులో ఉండేలా చూశారు. పై చదువులకు పట్టణానికి వెళ్లే పిల్లల కోసం బస్సు సౌకర్యం కల్పించారు. ఒకప్పుడు ఆ పంచాయతీలో నలభై మంది పిల్లలు బడికెళ్తే గొప్ప. ఇప్పుడు 400 మంది వెళ్తున్నారు. గ్రామ పరిసరాల్లో అందుబాటులో ఉండే వనరులను ఉపయోగించి స్వావలంబన సాధించడానికి యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించారు. జామ్, లెదర్ పాలిషింగ్ పౌడర్ తయారీ లాంటి చిన్న పరిశ్రమలు పెట్టుకున్నారు యువకులు. అంతే కాదు, ఆ పంచాయతీ పరిధిలో ఇప్పుడు ఒక్క గుడిసె కూడా లేదు. అన్నీ పక్కా ఇళ్లే!
ఊరంతా సొంతిళ్లే!
అక్కడి ప్రజల్లో దాదాపు 90 శాతం తోటల్లో కూలిపనులు చేసేవాళ్లే. తిండి గడవడమే కష్టమైన వారికి స్థలమూ సొంతిల్లూ కలలో మాట. చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవారు. వారికోసం ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అప్పటి ముఖ్యమంత్రి పేదరిక నిర్మూలన పథకం ప్రవేశపెట్టారు. షణ్ముగం వెంటనే దరఖాస్తు చేసి 45 ఇళ్లు మంజూరుచేయించుకుని కట్టించారు. ఆ తర్వాత రెండేళ్లకు మరో 25, మూడేళ్ల తర్వాత 135 అలా గిరిజనుల కోసమే మొత్తం 250 ఇళ్లు నిర్మించి ఇచ్చారు. వినోబాజీ నగర్ అనే మరో పల్లెలో 101 ఇళ్లు కట్టారు. సౌరశక్తిని ఉపయోగించుకునేలా కట్టిన గ్రీన్ హౌస్‌లు అవన్నీ. ఒక్క పంచాయతీ పరిధిలో వందకు పైగా పర్యావరణ హిత నివాసాలు కట్టడం ఇక్కడ మాత్రమే జరిగింది. ప్రభుత్వ నియమం ప్రకారం సొంత స్థలం ఉంటేనే ఇళ్ల నిర్మాణానికి నిధులిస్తారు. అందుకని వారందరికీ ముందుగా ప్రభుత్వ భూమిని పట్టాలుగా రాసిచ్చారు లింగమ్మాళ్. ఆ తర్వాత ప్రభుత్వ పథకం సాయంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేశారు. అలా సోలార్ పవర్డ్ గ్రీన్ హౌస్ పథకం కింద పేదలకు దాదాపు వెయ్యి ఇళ్లు కట్టించారు. నీటి పైపులైనుతో పాటు ప్రతి ఇంటికీ సౌరఫలకాన్నీ ఏర్పాటుచేశారు. ఇప్పుడు మొత్తం పంచాయతీ పరిధిలో ఇల్లులేని పేద ఒక్కరు కూడా లేరు. అందరివీ సొంతిళ్లే. అందులో సగానికి పైగా సర్కారు కట్టించినవే. రాష్ట్రంలో అత్యధికంగా గ్రీన్ హౌస్‌లు కట్టించిన పంచాయతీ- ఒడంతురై.
అప్పు ఇస్తారు!
ఒడంతురై పంచాయతీ పరిధిలో నివసించేవారికి ఎలాంటి అవసరమొచ్చినా వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లరు. వైద్యం, కాన్పులు, దుకాణాల్లో పెట్టుబడి లాంటి పెద్ద అవసరాలే కాదు, ఆఖరికి పిల్లలకు చెవులు కుట్టించడమూ, పుస్తకాలు కొనడమూ కూడా పల్లెల్లో పెద్ద విశేషాలే. అందుకని ఆ అవసరాలన్నిటికీ గ్రామ పంచాయతీలోని సూక్ష్మరుణ నిధి నుంచి అప్పులు ఇస్తారు. గ్రామస్థులు తమ అవసరాన్ని తెలుపుతూ వినతిపత్రం రాసిస్తే చాలు, సాయంత్రానికి డబ్బు చేతికందుతుంది. వారికి డబ్బు అందినప్పుడు నామమాత్రపు వడ్డీతో ఆ అప్పుని చెల్లించేస్తారు. ఒకేసారి కట్టలేనివారు వాయిదాల్లో కడతారు. పెద్ద వ్యాపారాలు చేయాలనుకునేవాళ్లకి బ్యాంకు లోన్లు కూడా గ్రామపంచాయతీ అండగా ఉండి ఇప్పిస్తుంది. పాతికేళ్ల క్రితం 1500 ఉన్న జనాభా ఇప్పుడు పదివేలు అవడానికి కారణం... జరుగుతున్న అభివృద్ధిని చూసి వలసవెళ్లిన వాళ్లంతా తిరిగిరావడమే.
కొంచెం బిజినెస్...
ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం అన్ని పల్లెల పంచాయతీ ప్రెసిడెంట్లనీ సమావేశపరిచింది. ‘ఒడంతురై పంచాయతీకి వెళ్లి చూసి నేర్చుకోండి’ అని పంపించింది. అది మొదలు... గ్రామీణాభివృద్ధి, పునరుత్పాదక ఇంధన వనరులు, విద్యుత్తు, నీటి పారుదల... ఒకటని కాదు ఎన్నో శాఖల అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించారు. కేరళ, కర్ణాటక, సిక్కిం తదితర రాష్ట్రాల నుంచి, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాల నుంచి, ఆఖరికి ప్రపంచబ్యాంకు అధ్యక్షుడితో సహా ఎందరో వచ్చి చూసి వెళ్లారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయవచ్చో తెలుసుకున్నారు.
‘అయితే ఇలా వచ్చేవారందరికీ ఊరిని చూపించడానికీ వివరించి చెప్పడానికీ మాకేం అభ్యంతరం లేదు. కానీ అంత సమయం వారికోసం వెచ్చిస్తున్నప్పుడు మాకూ ఏదైనా లాభం ఉండాలిగా. అందుకే అలా వచ్చేవాళ్లు మాకు వెయ్యి రూపాయలు చెల్లించాలని నియమం పెట్టాం. అలా వచ్చిన డబ్బుని సూక్ష్మరుణ నిధికి జమచేస్తున్నాం...’ అని చెబుతారు షణ్ముగం. ‘ఆయనలో మంచి వ్యాపారవేత్త లక్షణాలు ఉన్నాయి. చేసే ప్రతి పనిలో ఎంతో కొంత మిగిలేలా చూసేవారు. అదే మరో కొత్త పథకానికి పెట్టుబడి అయ్యేది’ అంటారు గ్రామస్థులు. ‘ఆయన వేసిన దారిలోనే ముందుకు వెళ్తున్నాం’ అంటారు ప్రస్తుత ప్రెసిడెంట్ తంగవేల్. ఇప్పటికీ ఎక్కడెక్కడి నుంచో షణ్ముగంకి ఆహ్వానాలు అందుతుంటాయి. అంత మార్పు ఎలా తేగలిగారో వచ్చి మాకూ చెప్పమంటారు. ‘స్థానిక సంస్థలు ప్రభుత్వ పథకాలను సరిగ్గా ఉపయోగించుకోవడం ముఖ్యం. నీటి సరఫరాకీ, ఇళ్లు కట్టించడానికీ ఆఖరికి కోటిన్నర ఖర్చుతో విండ్‌మిల్ పెట్టడానికీ... అన్నిటికీ మేము ప్రభుత్వ పథకాలనే ఆధారం చేసుకున్నాం. గాలీ ఎండా కావలసినంత ఉచితంగా దొరుకుతాయి. వాటిని సాధ్యమైనంతగా ఉపయోగించుకోవాలి. అలాగే ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వగలగాలి’... అని చెబుతారాయన.
* * *
ఒడంతురై వెళ్లినవాళ్లు ఆ ఇళ్లూ నీళ్లూ కరెంటూ... అన్నీ చూసి ఎంత ముచ్చట పడతారో మరో విషయం చూసి అంతకన్నా ఎక్కువగా ఆశ్చర్యపోతారు.
8888888888888888888888888888888888888888
"ఆసియన్ పెయింట్స్" - ది మోస్ట్ ఇన్నోవేటివ్ కంపనీ ఇన్ ఇండియా !
ఆసియన్ పెయింట్స్ భారతదేశం లో నంబర్ వన్, ఆసియాలో మూడో అతి పెద్ద పెయింట్ కంపనీ.
అవి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు, ఇండియా లో మాత్రం క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతుంది. టాటా గ్రూప్ కి JRD టాటా నియమితుడైనాడు, బిర్లాలు మ్యానిఫ్యాక్చురింగ్ లో బిజీ. రెండవ ప్రపంచ యుద్ధం వలన బయటిదేశాల నుంచి పెయింట్స్ ఇంపోర్ట్ చేసుకునే అవకాశం లేదు. ఆ రోజుల్లో షాలిమర్స్ పెయింట్స్ ఒక్కటే ప్రధానం గా ఉంది.
26 యేండ్ల యువకుడు ఒక సమస్యని పరిష్కరించాలనుకున్నాడు, అదీ స్వాతంత్రం రాకముందు. ఆ యువకుడే చంపక్ లాల్ సోక్సీ. తన ముగ్గురు స్నేహితులు చమన్ లాల్ సోక్సీ, సూర్యకాంత్ ధాని, అరవింద్ వాకిల్ లతో కలిసి ఫిబ్రవరి 1, 1942 న బొంబాయి లో "ఆసియన్ పెయింట్స్" ఒక ఇంటి వసారా లో ప్రారంభించారు.
ఇప్పుడు ఆసియన్ పెయింట్స్ భారతదేశం లో నంబర్ వన్ ఇంకా ఆసియాలోనే మూడో అతి పెద్దది. ఇండియన్ పెయింట్ రంగం లో 50% షేర్ వాళ్ళదే. గతం లో ఫోర్బ్స్ పత్రిక ప్రకారం ప్రపంచం లోని 100 ఇన్నోవేటివ్ కంపనీల్లో ఆసియన్ పెయింట్స్ ఒకటి. ప్రపంచం లో 18 వ ర్యాంకు, ఇండియా లో నంబర్ వన్ (ఇన్నోవేషన్ కంపనీల్లో).
"హర్ ఘర్ కుచ్ కెహ్తా హై (ప్రతి ఇళ్ళూ ఒకటి చెప్తుంది) అనేది 1980 లో వాళ్ళ నినాదం. పెద్ద పెద్ద సంస్థలు ఉన్నా పోటీలో నిలబడి, అన్నీటీకి మించి ఒక సమస్యని సాల్వ్ చేయాలనుకున్నారు, అందుకే అత్యంత గొప్ప విజయం సాధించారు. ఆసియన్ పెయింట్స్ విజయగాధ పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్ లో ఒక పాఠం గా చెప్తారు.
Yes, "Every home says something" and every company says something. రేపు కంపనీ ఫలితాలని వెలువరించబోతున్న తరుణం లో ఆసియన్ పెయింట్స్ ఎప్పుడూ బాగుండాలి అని కోరుకుంటూ🙏
- జగన్
పంచాయతీ ఆదాయమూ, చేపట్టిన పథకాలూ, ఖర్చుల గురించి ఏకంగా పంచాయతీ కార్యాలయం గోడల మీదే రాసి ఉంటుంది. అది కోట్ల రూపాయల గృహనిర్మాణ పథకం కావచ్చు, జనన మరణ ధ్రువపత్రానికి చెల్లించే వంద రూపాయలు కావచ్చు. ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన ప్రతి సందర్భమూ ఆ గోడల మీదికి ఎక్కాల్సిందే. ఎక్కడా పైసా తేడా రాదు.
నాయకుడికి పారదర్శకత అన్నిటికన్నా ముఖ్యమని షణ్ముగం చెప్పకనే చెప్పారు!.