....రిజర్వేషన్లు.
●●●
✍-భారత రాజ్యాంగము రిజర్వేషన్లు 26 జనవరి 1950 నుండి అమలులోకి వచ్చాయి.
👉-మరి 1950 కంటే ముందు రిజర్వేషన్లు లేవా..? అంటే ఉన్నాయి అవి గత 3,000 సంవత్సరాల నుండి కేవలం ఈ దేశంలో ఉన్న 15% బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య అనే ద్విజ కులకు ఉన్నాయి.
✍-రిజర్వేషన్లు ఎవరికి లేవు అంటే..?
👉-శుద్రులకు మరియు స్త్రీలకు రిజర్వేషన్లు లేవు.
✍-శుద్రులు అంటే ఎవరు...?
👉-ద్విజత్వము లేదా ఉపనయనం లేదా జంధ్యము లేని వారు శుద్రులు.
✍స్త్రీలు శుద్రులు కాదా..?
👉-స్ర్రీలకు ఉపనయనం లేదు కాబట్టి వారు కూడా శుద్రులతో సమానం.
✍-☆ భగవద్గీత ప్రకారం -
-ఓ అర్జునా! పాపయోనులందు పుట్టిన స్త్రీలు, వైశ్యులు, శుద్రులు నన్ను ఆశ్రయించినచో మోక్షమును పొందగలరు..
✍భారత రాజ్యాంగము కంటే ముందు అమలులో ఉన్న రిజర్వేషన్లు ఒక పరిశీలన....
✍- మనుధర్మశాస్త్రం 1-96 ప్రకారం
సకల చరాచర జగత్తులో మానవులు శ్రేష్టులు.మానవులలో బ్రహ్మణులు శ్రేష్టులు...
✍-మనుధర్మశాస్త్రం 2-31 ప్రకారం ..
నామకరణం బ్రహ్మణులకు శుభసూచకంగాను, క్షత్రియులకు బలసూచకంగాను, వైశ్యులకు ధనసూచకంగా, శుద్రులకు జుగుస్సను కలిగించేదిగా ఉండాలి.
✍మనుధర్మశాస్త్రం 1-88 ప్రకారం...
బబ్రహ్మణులువేదశాస్త్రములను చదువుట , బోదించుట , యజ్జములు చేయుట , దానము స్వీకరించుట అను ధర్మములను పాటించవలేను
✍మనుధర్మశాస్త్రం 1-89 ప్రకారం...
పరిపాలన ,ప్రజారక్షణ, వేదములను చదువుట అను ధర్మములను క్షత్రియులు పాటించవలేను.
✍మనుధర్మశాస్త్రం 1-90 ప్రకారం పశుపాలన , వ్యవసాయం , వేదములను చదువుట వైశ్యులు చేయవలెను.
✍మనుధర్మశాస్త్రం 1-91 ప్రకారం....
ఎలాంటి ఈర్ష్య, అసుయలేకుండా శుద్రులు బ్రహ్మణ,క్షత్రియ, వైశ్య కులాలకు సేవ చేయవలేను.
ఈ విధంగా కేవలం 15% ఉన్న మూడు వర్గాల వారికి అన్ని రకాల రిజర్వేషన్లు శాస్త్రబద్దంగా అమలు చేశారు , మరియు ఈ రోజు కూడా ఇది అమలులో ఉంది.
పై మూడు వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే క్రమంలో 85% శుద్రుల జీవితాలను నాశనం చేసింది బ్రహ్మణ హిందూ ధర్మ రిజర్వేషన్లు.
ఉదాహరణకు...
✍- మనుధర్మశాస్త్రం 10-96 ప్రకారం...
తక్కువ కులానికి చెందిన వ్యక్తి ఎక్కువ కులాల వృత్తిని అవలంభిస్తాడో అట్టివాని ధనము లాగుకోని దేశము నుంచి భహిష్కరించాలి.
✍- మనుధర్మశాస్త్రం 10-129 ప్రకారం...
సామర్థ్యాము ఉన్నప్పటికీ శుద్రుడు ధనార్జన చేయరాదు.
✍- మనుధర్మశాస్త్రం 10-50 ప్రకారం...
శుద్రులు మహావృక్షాల వద్ద, కొండలపైన, నివసిస్తూ ప్రత్యేకమైన వృత్తులకు తగిన విధంగా కొన్ని గుర్తింపు చిహ్నాలను ధరించి సంచరించాలి.
✍- మనుధర్మశాస్త్రం 10-51 ప్రకారం....
ఛండాలురు , శ్వాపకులు నివాసాలు ఊరిబయట ఉండాలి. వీరి నివాసాలు కర్రలతో ,ఆకులతో నిర్మించుకోవాలి. కుక్కలు గాడిదలు వీరి సంపదగా ఉండాలి.
✍మనుధర్మశాస్త్రం 10-53 ప్రకారం...
ఛండాలురు శవాలమీది వస్త్రాలే ధరించాలి. పగిలిన కుండపెంకులలోనే తినాలి. ఇనుపనగలే ధరించాలి.
వారు నిరంతరము దేశదిమ్మరులుగా ఉండాలి.
✍-మనుధర్మశాస్త్రం 10-54 ప్రకారం...
అతిశుద్రులకు అన్నము ప్రత్యక్షంగా పెట్టరాదు. పనివారితో పగిలిన పాత్రలో పెట్టింవలేను.వీరు రాత్రులు యందు గ్రామాలలో గాని నగరాలలో గాని తిరగరాదు.
✍- మనుధర్మశాస్త్రం 10-55 ప్రకారం...
రాజాజ్జమేరకు అతిశుద్రులు గుర్తింపు చిహ్నాలతో రాజు నిర్ణయించే పనులకు వెల్లాలి. బంధువులు లేని శవాలను వారు మొయ్యాలి.
✍-విష్ణుధర్మం 5-104 ప్రకారం...
ఛండాలురను , హీన కులస్తులను ఎవరు తాకరాదు.
ఛండాలులు ద్విజులను తాకినట్లయితే మరణదండన విధించాలి.
👉ఈ విధంగా బ్రహ్మణ హిందూ ధర్మ రిజర్వేషన్ల కాలంలో మరియు ఈ రోజు కూడా ఛండాలురు ఈ రోజు యస్సి లు దుర్భర దారిద్య్ర జీవితాన్ని గుడుపుతున్నారు. శుద్రులు ఈ రోజు బి.సి.లు చదవు నుండి బహిష్కరించబడి కేవలం కులవృత్తులు చేసుకుంటు పేదరికాన్ని అనుభవిస్తున్నారు.యస్టీలు ఐతే అసలు మానవసంభాందులు లేకుండా అడవులలో పశువులా బ్రతుకుతున్నారు.
కేవలం 15% బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలకు రిజర్వేషన్లను కల్పించడానికే 85% ఉన్న శుద్రుల జీవితాలను చీకటిమయం చేసింది బ్రహ్మణ హిందూ ధర్మ రిజర్వేషన్లు.
👉ఈ బ్రహ్మణహిందూ ధర్మ రిజర్వేషన్ల మూలంగా భారత దేశ సామాజిక వ్యవస్థలో నెలకొన్న అసమానతలను తొలగించడానికి డా.బాబాసాహేబ్ అంబేడ్కర్ గారు బ్రహ్మణ హిందూ ధర్మ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి..
👉- ఈ దేశం అందరిది.ఈ దేశం పై ప్రజలందరికి సమానహక్కలు ఉన్నాయి అని సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులు అందరికి సమానంగా ఉండాలి అని , ఈ దేశ వనరుల పై అందరికి సమాన హక్కులు ఉండాలని సంవిధాన సభలో బ్రహ్మణ పెత్తందారీ కులాల పై గళమెత్తారు.ఈ దేశంలో ఉన్న భూమి , పరిశ్రమలు, ఖనిజ సంపద ను జాతియం చేయాలని సంవిధాన సభకు సూచించారు. వేల సంవత్సరాల నుండి అన్నిరకాలుగా బలపడి ఉన్న బ్రహ్మణ పెత్రందారీ కులాలు ఈ విషయాన్ని ఒప్పుకోకుండా వారి కుల గౌరవానికి భంగం కలగకుండా, కులం పేరిట వేల సంవత్సరాల నుండి అనుభవిస్తున్న ఆస్తులకు భంగం కలగకుండా 85% శాతం ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు....
👉ఒక వ్యక్తి వారి కోటను కదలించగలడని వారు ఊహించలేదు.
ఒక చాకలి
ఒక మంగలి
ఒక గౌడ
ఒక కాపు
ఒక కుమ్మరి
ఒక బెస్త
ఒక కంసాలి
ఒక లంబాడి
ఒక గోండు
ఒక మాల
ఒక మాదిగ.....ఈ విధంగా సుమారు 7,000 కులాలు 3,000 సంవత్సరాల నుండి అనేక అవమానాలు సహిస్తూ వెట్టి చాకిరీ చేసేవారు.వారు చదవుకుని వారికి సమానంగా నిలబడతారని ఊహించలేదు... వారికి పై ఆఫీసర్ లుగా ఎదిగి వారినే శాసించగలరని వారు ఊహించలేదు...
మంత్రులుగా , ముఖ్యమంత్రులుగా , ప్రధాన మంత్రులుగా , రాష్ట్రపతులుగా ఎదుగుతారని వారు ఊహించలేదు...
వేల సంవత్సరాల నుండి అన్యాయన్ని ఎదుర్కోవడానికి దేవుడు పుడతాడంటు రకరకాల దేవుళ్ళను సృష్టించి కేవలం కేవలం బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలకు రక్షణ కల్పించి...
ఈ దేశ అధికశాతం ప్రజలను మోసం చేసే దేవున్ని తిరిగి అవతారమెత్తకుండా ఒక వ్యక్తి చేయగలడని వారు ఊహించలేదు...
వారు ఊహించలోపే 3000 సంవత్సరాల నుండి అజ్జానం,అంధకారం , అంధవిశ్వాసం , ఈశ్వరవాదం, కర్మవాదం , ....మొదలగు రోగాలతో రోగగ్రస్తమైన ఈ దేశానికి ఒక్కడే ఆ రోగాలన్నింటికి చికిత్స చేశాడు.
ఆ రోగాలన్నింటికి ఒకే మందు కనుక్కున్నాడు అదే #భారత_రాజ్యాంగము.
ఫేస్ బుక్ నుండి సేకరించినది.
ఇట్లు
భారత నాస్తిక సమాజం మీకు తెలిసిన నాస్తికులను పరిచయం చేయడం మరువకండి.7013160831
No comments:
Post a Comment