ఆధ్యాత్మికశాస్త్ర అధ్యాపకులలో,
ప్రప్రథమశ్రేణి వారు *కాస్టానెడా/డాన్ యువాన్లు*
*డాన్ యువాన్* చెప్పిన ఒక సూత్రం..
“ జిజ్ఞాసువులు ' ముముక్షువు' అయినప్పుడు అచిరకాలంలోనే అతడు 'జ్ఞాని' గా మారి సాధనా పరిసమాప్తి ద్వారా చివరికి ' ద్రష్ట' అవుతాడు”
ఆధ్యాత్మిక విద్యాభ్యాస విధివిధానక్రమంలో వున్నవి నాలుగు దశలు..
జిజ్ఞాసువు.. ముముక్షువు
జ్ఞాని.. ద్రష్ట - ఋషి
⚡“ *జిజ్ఞాసువు*” అంటే సత్య సిద్ది ప్రాప్తికి ప్రప్రధమంగా దృఢనిశ్చయుడు అయినవాడు..
⚡“ *ముముక్షువు* ” అంటే ఇక సత్యశోధనలో, సత్యసాధనలో పూర్తిగా నిమగ్నుడైనవాడు..
⚡“ *జ్ఞాని* ” అంటే సత్యసాధన చివరి దశలో సత్యసిద్ది పొందినవాడు...
⚡“ *ద్రష్ట* ”, “ *ఋషి*”... అంటే దివ్యచక్షువు కలిగినవాడు ఇతరలోకాలను వీక్షించ గలిగినవాడు
..........................................................................................
🌹 *ఐశ్వర్యం పరమార్థం* 🌹
🙏🙏👏👏🙏🙏
*ఐస్క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది*.
జీవితం కూడా అంతే...
*ఏంజాయ్ చేసినా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది*.
• అదేదో ఏంజాయ్ చేసిపోతే, ఆ జీవితానికి ఓ పరమార్థం వుంటుంది.
• *తర్వాత నరకం, స్వర్గం అంటారా*?!?! ఉన్నాయో, లేవో కూడా ఎవడికి తెలియదు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు.
• తాగినోడు *ఎదవ కాదు, తాగలేనోడు మహానుభావుడు* కాదు.
• పోని తాగలేనోడు నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే, ఆ గ్యారంటీ లేదు.
• ఎవడిపాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది.
ఫైనల్ గా చెప్పదేంటంటే...
*టైం టు టైం తినండి, పడుకొండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యాలు జాగ్రత్త*.
• ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద *ఐశ్వర్యమా*?
• లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం *ఐశ్వర్యమా*!.
• *ఐశ్వర్యం* అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!
• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు *ఐశ్వర్యం*.
• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య *ఐశ్వర్యం*.
• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు *ఐశ్వర్యం*.
• అమ్మ చేతి భోజనం *ఐశ్వర్యం*.
• భార్య చూసే ఓర చూపు *ఐశ్వర్యం*.
• పచ్చటి చెట్టు, పంటపొలాలు *ఐశ్వర్యం*.
• వెచ్చటి సూర్యుడు *ఐశ్వర్యం*.
• పౌర్ణమి నాడు జాబిల్లి *ఐశ్వర్యం*.
• మనచుట్టూ ఉన్న పంచభూతాలు *ఐశ్వర్యం*.
• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు *ఐశ్వర్యం*.
• ప్రకృతి అందం *ఐశ్వర్యం*.
• పెదాలు పండించే నవ్వు *ఐశ్వర్యం*.
• అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు *ఐశ్వర్యం*.
• బుద్ధికలిగిన బిడ్డలు *ఐశ్వర్యం*.
• బిడ్డలకొచ్చే చదువు *ఐశ్వర్యం*.
• భగవంతుడిచ్చిన ఆరోగ్యం *ఐశ్వర్యం*.
• చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి *ఐశ్వర్యం*.
• పరులకు సాయంచేసే మనసు మన *ఐశ్వర్యం*.
• *ఐశ్వర్యం* అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు.
• కళ్ళు చూపెట్టే ప్రపంచం *ఐశ్వర్యం*.
• మనసు పొందే సంతోషం *ఐశ్వర్యం*🙏🙏🙏
........................................................................................
::::::::::: : : : : :::: :::::: :::: :::: : :::::: ::::::: :::: ::: :
.....🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఆశించటం... ఆశించటం.....
ఆశించటం మానవుడి సహజగుణం.......
ఆశించటం వ్యక్తిత్వపు చేష్ట......
మానవుడు మరణించే చివరి క్షణం వరకూ అన్నింటినుండీ ఆశిస్తాడు........
ఆశించటం మాత్రమే తెలిసిన మనిషికి "విశాలమైన విశ్వం కూడా ఇరుకు గానే ఉంటుంది"......
నేను "దైవాన్ని" అని తెలుసుకున్న
అద్వైతికి ఇరుకు గదిలో కూడా విశాలమైన విశ్వాన్ని చూడగలుగుతాడు........
వినయంతో వివేకామృతాన్ని విందాము
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
::::::::: :::: :::: ::::: ::: ::: ::: ::: ::: ::::: :::: :::: ::::::::::::::::: ::::: :::: :::
మన పూర్వీకులు అసలు ముగ్గు ఎందుకు పెట్టేవారు ఆ ముగ్గుల అర్థం పరమార్థం ఎటి అనేది తెలుసుకుందాంమే🙏
💮ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగాగీసే రెండు అడ్డగీతలు ఇంటి లోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధి స్తాయి.
ఇంట్లోఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళ కుండా చూస్తాయి.
💮ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభ కార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు! పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి.
💮💮💮💮💮 ఏదేవతపూజచేస్తున్నా దైవాన్నిఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.
💮నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతే కాదు, మనం వేసే పద్మాలు,చుక్కల ముగ్గులలో కూడా మనకుతెలీని అనేక కోణాలు దాగి ఉన్నాయి.అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా!యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.
💮తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి!
💮💮💮💮💮యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం
మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.
💮నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టు ప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి!
💮దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయ కూడదు, ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.
💮ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు,
శ్రీ మహావిష్ణు వు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆస్త్రీకి ఏడు జన్మలవరకు వైధవ్యం రాదని, మరియు సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం చెబు తున్నాయి.
💮పండుగ వచ్చింది కదా అని, నడవ డానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు!
💮ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తాము.దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీ కరించదు. ఏరోజుకారోజు బియ్యపు పిండి తో ముగ్గు పెట్టాలి!
💮నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర దీపా రాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి.
💮ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.
💮ముగ్గులు శుభసూచకాలుగా పని చేస్తాయి.
💮 పూర్వం రోజూ సాధువులు,సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగే వారు.ఏఇంటిముందైనా ముగ్గులేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునే వారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు.
💮ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు! అందుకే మరణించి న వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గువేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యా హ్నమైనా ముగ్గు వేస్తారు.
💮ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి.మనం ఆచరించే ఏఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకా నేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.🙏
888888888888666666688888666888666888666888

No comments:
Post a Comment