ATTENTION PLEASE
###############
(నా పోస్ట్ ల అభిమానులు ఈ పోస్ట్ ని మొత్తం చదువుతారు ...అని ఆసిస్తూ)
**************************
"నిర్బంధ చట్టమే..."
నిజమైన పరిస్కారం
*************************
ఎండలు పెరిగాయి అంటే..
తమ స్థాయిని బట్టి
కూలర్ లు, ఏ. సి ,లు, ఫ్రీజ్ లు
కొనుక్కోవటం ఎలా ? అని తప్ప
పర్యావరణం గురుంచి ఆలోచించలేని
అజ్ఞానం లో "సామాన్య ప్రజలు" ఉన్నారు !
ప్రభుత్వానికి అప్పుడప్పుడు
#హరితహారం పేరు చెప్పుకోవడం..
ఒక ...
ఆహ్లాదకరమైన "ప్రచార సరదా" అయింది!
పాపం పర్యావరణ సంరక్షణ సంఘాల వారు....
#చెట్ల గ్రీన్ సంగతి ఏమో గాని...
#షర్ట్స్ గ్రీన్ వి ఏసుకొని...
తమవంతు #ప్రచార తంతు పూర్తి చేస్తున్నారు !!
ఇదే పర్యావరణ అంశం పై..
కవులు కవితలు చిలకరిస్తున్నారు...!
కార్టూనిస్ట్ లు ఏవో బొమ్మలు గిలకరిస్తున్నారు...!
వ్యాసకర్తలు పేజీలకొద్ది రాసి..పడేసి చేతులు దులుపుకుంటున్నారు ...!!
అయినా ఫలితం శూన్యం...😢
ఇక ఇపుడు కావాల్సింది ...
నిర్బంధ చట్టాలె...
విద్యుత్ బిల్లులు తప్పక కట్టాలని...
ప్రభుత్వం ఏ "అవేర్నెస్ ప్రోగ్రాం" లు చేస్తుంది ?
ఈ విషయంలో ప్రజల్ని చైతన్య పరుస్తూ ఏ సంఘాల వారు "అవగాహన ర్యాలీ" లు చేస్తున్నారు....
అయినా ....
ప్రజలు టoఛన్ గా బిల్లులు కడుతున్నారు....
ఎందుకు ?
కట్టక పోతే కనెక్షన్ కట్ చేస్తారు...అనే "భయంతో...."
మరి ప్రతి ఇంటిలో...కనీసం వారి ఇంటి సభ్యుల మేర ఆక్సిజన్ విడుదల అయ్యేలా "చెట్లు" పెంచుకోకపోతే ....
కరెంట్, గ్యాస్... లాంటి సదుపాయాలు ఉండవనే నిర్బంధ చట్టం ప్రభుత్వం ఎందుకు తేకూడదు???
అపార్ట్మెంట్ వాసులు.... ఎన్ని ప్లాట్ లు ఉన్నాయో...దానికి తగ్గట్టు...ఊరికి సమీపంలో సామాజిక వనాలు ఏర్పాటు చేసి చూపిస్తేనే ...ఆయా అపార్ట్మెంట్ లకు పర్మిషన్ వచ్చేలా...చట్టాలను ఎందుకు కఠినం చెయ్యకూడదు...??
ఇలాంటి చట్టాల్ని ముందుకు తీసుకు పోవటంకి ప్రభుత్వంకి ఒక్క పైసా ఖర్చు లేదు....
పైగా రాష్ట్రము యుద్ధ ప్రతిపాదికన సస్యశ్యామలం అయ్యి తీరుతుంది !!
ప్రజలు వింటారా ?? అనే సందేహమే అవసరం లేదు....
ప్రజల్ని నడిపించేది...
రెండే శక్తులు..1) భయం 2) అవసరం
గ్యాస్, కరెంట్ ఉండవు ...అనే దాంట్లో పై రెండు ప్రజల మెదల్లోకి నేరుగా చేరుతాయి....
ఏమ్...??
.సకల జనుల సర్వే ఆంటే ప్రజలు అందరు...వామ్మో మా పేరు ఉండదేమో అనే భయంతో అందరూ భాగస్వాములు కాలేదా ?.....పాత నోట్లు చెల్లవు అంటే...atm ల ముందు పడిగాపులు కాయలేదా...
ప్రజలు ఏదైనా చేస్తారు....అవసరం, భయం నడిపిస్తుంటే....!!
వినాశనం ప్రజల సమిష్టి దుష్కర్యం లతోనే అయింది....మరి నిర్మాణం కూడా ప్రజల సమిష్టి భాగస్వామ్యం తోనే అవుతుంది కానీ....
ఎవరో కుక్క పిల్లలా కూర్చొని..."ఒక్క" మొక్క నాటి...."వంద" గ్రూప్ లలో పోస్ట్ లు పెట్టుకుంటే కాదు!!
పర్యావరణమ్ ని కాపాడుకుందాం...!
మన తండ్రులు , తాతలు అనుభవించిన ప్రకృతి ని మన పిల్లలకు అందిద్దాం.....!!
----------------------------------------------------
గమనిక:-
రేపటి మన పిల్లల తరంని ప్రేమించే వారిగా....మీరు సైతం భాగస్వాములు అవుతూ .....ఈ పోస్ట్ ని.....పాలకులకు చేరేంత వరకు.....కాపీ/ షేర్ చేస్తూ ఉంటారని ఆసిస్తూ....
@ పల్లె మణి బాబు
జర్నలిస్ట్ & కార్టూనిస్ట్
*Covid-19 పై నా పరిశోధన ఫలితాలు.*
1. కారులో ముగ్గురు ప్రయాణించవచ్చు. నాల్గవ వ్యక్తి కారెక్కితే అతనికి మాత్రమే కొరోనా సంక్రమిస్తుంది.
2. టూవీలర్ పై వెనక కూర్చున్న వ్యక్తి మాత్రమే కొరోనాకు ఆకర్శితుడౌతాడు. బైక్ తోలే వ్యక్తికి కొరోనా సోకదు.
3. బస్సులో 30 మంది మాత్రమే ప్రయానించాలి. 31 వ వ్యక్తి ఎక్కితే కొరోనా వస్తుంది.
4. సాయంత్రం ఏడుగంటలకు కరోనా బయటికి వచ్చి, ఉదయం 7 గంటల వరకు అటుఇటు బాగా తిరుగుతుంది. కావున మీరు ఆ సమయంలో బయటకు రాకూడదు
5. ఒకవేళ మీరు మద్యశాల నుండి మద్యం కొంటే కొరోనా తప్పుగా భావించదు. కాని బార్ లో కూర్చుండి తాగితే కొరోనా పట్టుకుంటుంది.
6. ఒకవేళ మీరు పాస్ తీసుకొని వివిధ జోన్లలో ప్రయాణించినా పరవాలేదు. కాని పాస్ లేకుండా ప్రయినిస్తే కొరోనా మిమ్మల్ని అమాంతం మింగేస్తుంది.
7. మీరు ఎక్కడి నుండైనా సామాన్లు కొంటే కొరోనా ఏమిచేయదు. కాని కమర్షియల్ కాంప్లెక్స్ లలో, షాపింగ్ మాల్ లలో కొరోనా మీకోసం కాచుకొని కూర్చుంది.
8. మాస్క్ లేకున్నా, రాజకీయనాయకులను వారి అనుచరులను కొరోనా తాకే ధైర్యం కూడాచేయదు.కాని సామాన్య మానవులను మాస్క్ లేకుండా చూసి అమాంతం మింగేస్తుంది.
9. ఆదివారం నాడు బయటికి వెళ్ళకండి కొరోనా చక్కర్లు కొడుతుంది. ఇతర రోజుల్లో అది సెలవుపై వెళ్తుంది.
10. అది దేవాలయాలు, మసీదులలో, స్కూళ్ళలో మీ కోసం ఎదురుచూస్తుంది. కాని ఫ్యాక్టరీలలో ఇతర పని ప్రదేశాలనుండి పారిపోతుంది.
11. ఒకవేళ మీరు హోటల్ లో భోజనం చేస్తే కొరోనా తప్పకపట్టుకుంటుంది. కాని హోటల్ భోజనం ఇంటికి తీసుకెళ్ళితింటే అది మిమ్మల్ని ఏమిచేయదు.
12. అది ధనవంతుల పెళ్ళిలకు ఎంతమంది వచ్చినా ఏమి అనదు. కాని పేదల పెళ్ళికి 50కి మించి ఒక్కరు ఎక్కువొచ్చినా కొరోనా రెచ్చిపోతది.
కావున జాగరూకతతో ఉండండి, కొరోనాతో జీవించటం నేర్చుకోండి.🤣🤣🤣🤔🤔
సోర్స్: వాట్స్ అప్
........,,,,,,,,,......,,,,,,,.....,,,,...,,,...,,,.....,,,...,,,,,..........,,,,,,...
*మాదిగలు,మాలలు సమాజంలో సమానంగా బ్రతకాలంటే*
*మొదటిగా మానుకోవాల్సినవి*
1.శవాలకి కట్టెలు కొట్టడం మానేయాలి
2.ఊరుపాలు,తెగలు అని మనల్ని మనమే వెనకపడేసుకుంటున్నాం ఇది మానుకోవాలి.
3.డప్పులు కొట్టడం మానేయాలి.
4.ఊర్లో సపాయి పనిని చెయ్యకూడదు.
5.ఒకరికి బానిసలాగా ఉండకూడదు.
6.పండుగల పేరుతో,పెళ్లిళ్ల పేరుతో,చావుల పేరుతో ఎవడి దగ్గర మామూళ్లు అడగకూడదు.
7.ఎవరైనా మందు పోస్తే తాగి వారి ముందు చులకన కాకూడదు.
8.మేము మాదిగోల్లం,
మాలోళ్లం మమ్ములను కనిపెట్టండి అని అడుక్కోవద్దు.
9.మన పెద్దవాళ్ళు చదువులేక అజ్ఞానంతో కులవృత్తి చేస్తే తప్పేంటి అనే మూర్ఖపు మాటలను పట్టించుకోవద్దు.
10.ఆ మాటలే తరతరాలుగా మన జాతిని బానిసలుగా,
వ్యక్తుత్వంలేని జీవశ్చవాలుగా మార్చాయి.
11.బయటి వ్యక్తులు ఏదైనా పంక్షన్ చేస్తే ఎగేసుకుంటూ భోజనానికి వెళ్లొద్దు.అది మన వ్యక్తుత్వాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.
12.బయటి వారు చేసే పంక్షన్స్ దగ్గర మనం కానీ,మన కుటుంబ సభ్యులను కానీ ఎంగిలి ఇస్తర్లు తీసేందుకు,పని చేసేందుకు పంపొద్దు.
13.ఈ జనరేషన్ పిల్లలను కూడా డప్పు ఇచ్చి శవాల దగ్గరకి పంపిస్తున్నాం.అంటే వారిని కూడా ఇంకా వెనకకే లాగుతున్నాం కదా...మరి సమానత్వం ఎలా ఉంటుంది?
14.రాజ్యాంగంలో ఎక్కడా మనం శవాల దగ్గర డప్పులు కొట్టాలని, కట్టెలు కొట్టాలని, చెప్పులు కుట్టాలని రాయలేదు.అవన్నీ మనలను బానిసలుగా చేసేందుకు అగ్రవర్ణాల వారు ఆడిన నాటకం.వాళ్ళు ఒక్కసారి మోసం చేస్తే...వాటిని మనం కులవృత్తి అని నమ్మి వేల సంవత్సరాల నుండి మోసపోతూనే ఉన్నాం.
15.ఇప్పటికి ఇవ్వన్నీ చేస్తుంటే మనకి ఆత్మగౌరవం ఎలా వస్తుంది?ఎన్ని యుగాలకి రాజ్యాధికారం వస్తుంది?
16.ఎవరో బయటివారు చనిపోతే ఆ డప్పు వెళ్ళలేదు,ఈ డప్పు వెళ్ళ లేదని మన దాంట్లో మనమే గొడవ పడుతాం.ఇలా ఎలా ఆత్మగౌరవం వస్తుంది?
17.మన ఆత్మగౌరవం పెరగాలంటే మనకి సమానత్వం రావాలంటే ఒక్కే ఒక్క మార్గం చదువు,తెలివి. వెనకటి తాత ముత్తతల్లా ఉండకుండా, బానిసత్వం,వెట్టి చాకిరిని తుంగ్గలో తొక్కడం ఒక్కటే మార్గం.
18.నాడు చదువు లేదు సమాజం అర్థం కాలేదు..నేడు ఆ అంబేద్కర్ మహనీయుని పుణ్యాన అంతో ఇంతో అక్షరజ్ఞానం పొందాం కదా ఆలోచించండి.
19.డిగ్రీలు పూర్తి చేయడం కాదు డిగ్నిటిగా బ్రతకడం నేర్చుకోవాలి, రేపటి తరానికి స్ఫూర్తినివ్వాలి.
*20.మన ఇంట్లో నుండే మొదలు పెట్టండి,మన సంఘాలకు,మన నాయకులకి,మన పెద్దలకు చెప్పండి. ఈ రోజు నుండి పైన చెప్పినవన్ని క్రమంగా మానేస్తే కానీ మన ఆత్మగౌరవం,మన డేవలమెంట్, మన రాజ్యాధికారం సాధ్యం కాదని
నా మనసులో కలిగిన ఆలోచన మీకు సెండ్ చెయ్యడం జరిగింది.ఇక ఏం చేయాలో తేల్చుకోవాల్సింది మీరే.
మాకెందుకులే అనుకుంటే పొరపాటే...అంబేద్కర్ మహానియుడలా అనుకుంటే మనం ఈ రోజు షూట్ బూటు వేసుకొని,కళ్ళజోడుపెట్టుకొని బైక్,కార్,బస్ లలో తిరిగేవాళ్ళం కాదు..
అందరూ వారివారి వృత్తులను వదులుకున్నారు...
అందుకే అభివృద్ధిలో ముందుకెళుతున్నారు..మనం మాత్రం కేవలం పనికిరాని (తాగుడు, తిండి) పనుల కోసం మా వృత్తి అంటూ ఊడిగం చేస్తున్నాం...మంచేదో,చెడేదో తేల్చుకొనే వివేకం మీకుంది..రేపే అంతా మారుతుందని కాదు..ఇప్పుడు మొదలుపెడితే ఇంకొన్నాళ్ళకైనా మార్పు జరుగుతుందని ఆశ.....!
మాలలు చాలా వరకు మారారు అందుకే వాళ్లకు కొంతలో కొంత రాజ్యాధికారం దక్కుతుంది...కానీ మాదిగలే మందబుద్ధితో మూర్ఖంగా ముందుకెళుతున్నారు...అందుకే ఇంకా అంటరానివారుగా ఊరికి దూరంగా ఉంటున్నారు.
మీ శ్రేయోభిలాషి
No comments:
Post a Comment