సుదర్శన్ గారి జయంతి సందర్బంగా 15 08 2020 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెనకబడ్డ ఓసి ప్రజలకు పరిగి చరిత్ర తెలుప బోతున్నం నేటి
తరానికి కె బి సుదర్శన్నం గారు ఉపాధ్యాయ వృత్తిలో
ఉంటూ ఆయన ఈ ప్రాంతంలో దోపిడీ వ్యవస్థ చూడలేక ఉపాద్యాయ వృత్తికి రాజీనామా చేసి పోరుబాట నడిచినాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లో పరిగి మొట్టమొదటి సర్పంచిగా ఎన్నికయ్యారు బలహీన వర్గాల సంక్షేమ సంఘం స్థాపించారు 1962లో రాందేవ్ ఆ రెడ్డి పైన పరిగి ఎమ్మెల్యే గా పోటీ చేసి 610 ఓట్ల తేడాతో రెండవ స్థానంలో నిలిచారు రాష్ట్ర టెక్నాలజీ డైరెక్టర్ గా పని చేశారు మూడు సార్లు పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ కు ఎంపీ గా పోటీ చేసి 3960 ఓట్ల తేడాతో ఓడిపోయారు పరిగి కుల్కచర్ల మహమ్మదాబాద్ లొ ఒకేసారి అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్టించిన మేధావులు కె.బి సుదర్శనం గారు
పి టి రాములు సార్ గారు. సొంతంగా హాస్టల్ పెట్టి ఎంతోమందిని చదివించి మేధావులను చేసినా మహా మనిషి సుదర్శనం గారు1969 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ నేత టి.ఎన్. సదాలక్ష్మిమ్మ గారితో ఉద్యమంలో పనిచేశారు మలిదశ 1994 నుండి ఎంతోమంది ఉద్యమకారులేనా బుగ్గన ఆయన అనుచరులు రామన్న మాదిగను బందేయ్య భీమ్ భారత్ అంజనేయులు నారాయణ రహీం నర్సింలును మరి ఎంతో మందిని ఒక తాటిపైకి తెచ్చి తెలంగాణ ఉద్యమ పాఠాలు నేర్పిన గురువు కె.బి సుదర్శన్ గారు 1997,, సం,,లొ పరిగి జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్ గ్రౌండ్ లో తెలంగాణ ప్రజా పోరు మహాసభకు అధ్యక్షత వహించిన నాయకులు సుదర్శనం గారు ఆ సభకు ప్రజలు ఎడ్ల బండ్లపై కాలినడకతో నడిచి వచ్చి 30 వేల పైగా ప్రజలు పాల్గొన్నారు ప్రజా గాయకుడు గద్దర్ అన్న ఆటపాటలతో పరిగి ప్రాంతం దద్దరిల్లింది ఈ మహా బహిరంగ సభను బుగ్గన వర్గం ముందుండి నడిపించింది 1999లో కొంర్రే లక్ష్మయ్య గారిని ఎమ్మెల్యేగా పోటీ చేయించారు2000సంవత్సరంలో సుదర్శనం గారి మరణాంతరం 2001లో సుదర్శనం గారి విగ్రహాన్ని పరిగి కోర్టు ముందు చౌరస్తాలో స్థాపించ గలిగిన బుగ్గన ఆయన అనుచరులు రామన్న మాదిగ బందయ్యా మరెందరో తెలంగాణ ఉద్యమని ఈ ప్రాంతంలో ముందుండి నడిపించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెనకబడ్డ ఓసి ప్రజలారా పరిగి బహుజన రాజ్యాధికార పోరుబాట నడుద్దాం రండి కదిలి రండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్ని పార్టీలలో ఉన్న బహుజన నాయకులారా చెయుతనివ్వండి మన ప్రజల్ని ఓటు చైతన్యం చేద్దాం రాజ్యాధికార బాటలు వేద్దాం
సదా మీ సేవలో
మీ
రామన్న మాదిగ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత
9603375331💐💐
బిజెపికి వేసిన ఒక్క ఓటు ఏమి చేసిందో చూడండి...
1. ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసింది.
2. నిరుద్యోగం పెంచింది..
3. ఆకలి చావులను పెంచింది...
4. నోట్లు రద్దు చేసింది....
5. జియస్టి తో చిన్న వ్యాపారాలు పతనం చేసింది.....
6. ప్రభుత్వ పధకాలు లేకుండా చేసింది......
7. ఆర్ధిక నేరస్తుల పత్రాలు మాయం చేసింది.......
8. కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తుంది........
9. ఏయిర్ ఇండియా అమ్మకం .........
10. యల్ ఐ సి అమ్మకం..........
11. రైల్వే స్టేషన్లు అమ్మకం...........
12. భారత్ పెట్రోలియం అమ్మకం............
13. షిప్పింగ్ కార్పోరేషన్ అమ్మకం.............
14. కంటెయినర్ అమ్మకం..............
15. బియస్ యన్ ఎల్ అమ్మకం...............
16. విదేశీ పెట్టుబడులు తీసుకురావడం విఫలం................
17. విదేశాంగ విధానం విఫలం.................
18. కరోనా కట్టడి విఫలం..................
19. మనువాద మతోన్మాద దాడులు పెరిగాయి...................
20. కార్మిక హక్కులు కాలరాయబడ్డాయి....................
21. యూనివర్సిటీలు అమ్మకం.....................
22. పర్యావరణ పరిరక్షణ విఫలం......................
23. వ్యవసాయ రంగం దివాళా......................
24. వలస కార్మికులను ఆదుకోవడంలో విఫలం.......................
25. విద్య, వైద్య రంగాలకు నిధులు తగ్గింపు............................
26. పేదలపై భారాలు కార్పోరేట్ శక్తులకు రాయితీలు...............................
27. భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడులు చేసింది..................................
28. నిర్బంధం పెంచింది....................................
29. రిజర్వేషన్లు లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తుంది.........................................
30. రాజ్యాంగం మార్చి మనుస్మృతి ని అమలు చెయ్యాలనిచూస్తుంది........................................
ఇలా బిజెపికి వేసే ప్రతి ఓటు మన దేశాన్ని పతనం వైపు నడిపిస్తుంది......
ఇందులో ఈ దేశంలో ఉన్న భూర్జవా పార్టీలు కూడా ఏమి మాట్లాడవు....
ఇక్కడ ఇద్దరు ఒక్కటే....
ఇది మనువాద మతోన్మాద బిజెపి పాలనలో మోడి మిషన్.....
మరో స్వాతంత్ర్య పోరాటమే పరిష్కారం .....జై భీమ్
వార్తలంటేనే ఆ స్వరం.... ఆ స్వరం వుంటేనే వార్తలు..
ఆ స్వరం వింటేనే వార్తలు...
వార్త ఏదైనా.. కమ్మనైన కంఠంతో అమృతం నింపే
స్వరమదీ. .. వార్తలకు అమ్మ స్వరమదీ.
ఆ స్వరం విననిదే... రోజు లేదనేది ఓ చరిత్ర.
ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ఈనాటి ముఖ్యాంశాలు...
అంటూ గంభీర స్వరంతో మన మనస్సులు దోచిన
స్వరం.
సరిగ్గా....పదిహేను.. ఇరవై ఏళ్ల వెనక్కు పోతే....
నేరుగానో..మారుగానో మనకు సుపరిచితమైన
స్వరమదీ.
చక్కని పద ఉఛ్చరణ... వాక్ స్పష్టత...
పరిస్థితి కి తగినట్టుగా హావభావం....
ఆకట్టుకునే రూపం.... కన్నుమనే కంఠం..
ఇవ్వన్ని సొంతం చేసుకొని...... రోజు వారి..
వార్తా స్రవంతి తో.మన ముందుకు వచ్చి .
తెలుగు జనుల మదిలో నేటి వరకు
మంచి స్థానం సంపాదించుకోవటమే కాకుండా....
న్యూస్ రీడర్ స్థాయిని ప్రపంచానికి
చాటిచెప్పి....న్యూస్ ఏంటని కాదూ న్యూస్ చదివేది
ఎవ్వరనేదే.. ముఖ్యం.
అని బ్రాండ్ ఇమేజ్ ని పెంచిన
సీనియర్ జర్నలిస్టు..
అప్పటి తెలుగు న్యూస్ ఛానెల్
దూరదర్శన్....బుల్లితెర
ఫేమస్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు.
స్వరాలెన్ని వచ్చినా ఆ స్వరం ఎప్పటికీ
చిరస్మరణీయమే...తెలుగు ప్రేక్షకుల మదిలో
ఎప్పటికీ సుస్థిరమే.
( ఇటీవల మా మిత్రులు సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్ రాజు గారు హైదరాబాద్ లో సార్ ను కలిసిన సందర్భంగా ఈ ఫోటో.)
...... ..... ...... ........ .... . ......... ....... . ... ..
*మూర్తి (వెంకన్న) కి జోహార్లు!
- కసుకుర్తి రామలింగం*
కనులముందు కర్పూరంలా వెలిగినవాడు
సువాసనలు వెదజల్లి భువికెగసి
సప్తవర్ణాల్లా మెరిసి మాయమైనట్లు
కనులముందునుండి మాయమైన వాడు
సిద్ధాంత చర్చలో స్థిరంగా నిలబడినవాడు
సంక్షోభంలో సహచరులను మరవనివాడు
అందరికీ హక్కులని అందరినీ విమోచన వైపు నడిపిన అక్షరజ్ఞాని
చెమటబిందువుల బంధువు కామ్రేడ్ మూర్తి
అంకుష్ లా అంకురించి అనంతాన్ని ఆవహించుకున్నవాడు
మలితెలంగాణ ఉద్యమంలో మారోజుకు బాసటగా నిలిచినవాడు
కాలాన్ని, కులాన్ని ధిక్కరించినవాడు
సాంకేతిక అక్షరాలను నేర్చి
విప్లవోద్యమానికి వెదజల్లినవాడు
కులాంతరంలో సహచర్యాన్ని వెదుక్కున్నవాడు
ఈకాలం ధిక్కార స్వరం కామ్రేడ్ మూర్తి
నేను బ్రతకాలిరా అన్నాడు
నా భార్యాబిడ్డలతో వుంటానురా అన్నాడు
క్యాన్సర్ వ్యాధి కుదరదన్నది
కాలానికి కన్ను కుట్టింది
అక్షరశిల్పిని కబళించింది
కలల సౌధం కళ్ళముందే కూలిపోతుంటే
నిస్సహాయంగా చూశాం
రండి, మూర్తిని మరోసారి స్మరించుకుందాం
(ఆగస్టు 18, 2020, మూర్తి పదవ వర్ధంతి)
మూర్తి సంస్మరణలో ఒక పుస్తకాన్ని తేవాలని ఆరాటపడిన అమరుడు రామలింగం 2017 లో రాసిన కవిత
మూర్తి స్మృతి..
⁃ - సుధా కిరణ్
అక్షరానికీ, అచ్చుకీ మధ్య వొదిగిన చెమట చుక్క
చెమటచుక్కకి రంగులద్దిన తెల్ల కాగితం
బడిలో నేర్వని బతుకుపోరు పాఠం
బతుకుపోరు ఒడిలో ఎదిగివచ్చిన పుస్తకం
మరుగుపడని చరితలో మరపురాని జ్ఞాపకం
నిచ్చెనమెట్ల నీడలలో నిలిచిపోని జీవితం
కొండవాగుతో చెలిమి చేసిన రెల్లుపూతల రేవుపాట
బాటసారుల తోడునిలిచిన కాలిబాటల కూడలి
మైలపడని మనసు స్నేహ పరిమళం
మృత్యువుకు లొంగని యుద్ధగీతం
విమోచన విశ్వాసం
దళిత బహుజన మైత్రీ పతాకం..
- ఆగస్టు 2010

No comments:
Post a Comment