#నేనూ_స్వతంత్రున్నే ,
* నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నడి
రోడ్డు మీదే చంపబడేంత స్వతంత్రుణ్ణి ,
* రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ గారి విగ్రహం పెట్టాలి
అనుకున్నందుకు ఊరి మొత్తం చేత
వెలివేయించుకునేంత స్వతంత్రుణ్ణి ,
* నా దేశ పాలకులు చేసే అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకు
అక్రమ కేసుల్లో ఇరుక్కునేంత స్వతంత్రుణ్ణి ,
* మామిడికాయల దొంగ అనే పేరుతో గ్రామ పంచాయితీ
లొనే ఉరి కంబానికి వేలాడేంత స్వతంత్రుణ్ణి,
* మాస్క్ పెట్టుకోలేని కారణంగా అధికారి
చేతిలో క్రూరంగా చంపబడేంత స్వతంత్రుణ్ణి ,
* అక్రమ రవాణా గురించి ప్రశ్నిస్తే రక్షక భటుల
చేతిలోనే శిరోముండనం చేయించుకునేంత స్వతంత్రుణ్ణి,
* కామాంధుల చేతిలో రేప్ కి గురై కూడా రక్షక భటుల
చేతిలో తన్నులు తినేంత స్వతంత్రుణ్ణి ,
* స్వదేశంలో నా పై జరిగే దాడులకు, హత్యాచారాలకు
న్యాయం కావాలని ఉద్యమాలు చేసుకునేంత
స్వతంత్రుణ్ణి ,
* నా సొంత దేశంలోనే నేటికీ కూడా అంటరానోడు ,
అస్పృస్యుడు అని పిలించుకునేంత స్వతంత్రుణ్ణి ,
* స్వదేశంలో ప్రజా ప్రతినిధుల చేతులో నిరంతరం
దోపిడీ కి గురి కాబడుతున్న స్వతంత్రుణ్ణి,
* నేటికి కూడా ఊరి చివర దక్షిణాన స్మశానల
దగ్గర్లో నివాసాలు ఉండేంత స్వతంత్రుణ్ణి,
70 ఏళ్ల స్వాతంత్రంలో ఒక్క సారి కూడా ఈ దేశ
ప్రధాన మంత్రి కానీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోలేనంత
స్వతంత్రుణ్ణి, ( ఉత్తర్ ప్రదేశ్ మినహాయించి )
నా దేశానికి వచ్చింది స్వాతంత్రంలో ,
అధికార మార్పిడో తెలుసుకోలేనంత
స్వతంత్రుణ్ణి..
#నేనెప్పుడూ_స్వతంత్రున్నే...
No comments:
Post a Comment