Wednesday, August 12, 2020

Leter of Dr.B.R.Ambedker

 బాబాసాహెబ్ తన కుమారుడి మరణంపై స్నేహితుడుకి స్వయంగా బాధతో రాసిన ఉత్తరం!


బాబాసాహెబ్ తన కుమారుడు రాజారత్న ఆకస్మిక మరణం తర్వాత.. స్నేహితుడు దత్తోబా రాసిన పరామర్శ ఉత్తరానికి బాబాసాహెబ్ రాసిన ప్రత్యుత్తరం...

      ...............   లేఖ .....................


దామోదర్ హాల్,

పరేల్, బోంబే 12,

19-1-26.


ప్రియమైన దత్తోబాకి..డా.బి.ఆర్ అంబేద్కర్ రాయునది...


నీ ఉత్తరం ఒకింత ఆశ్చర్యాన్నే మోసుకొచ్చింది. శివ తర్కార్ నీకు నా కుమారుడి మరణం గురించి రాసి చాలా రోజులు గడిచిపోయినా నీ వద్ద నుండి ఎలాంటి ఉత్తరం రాకపోయేసరికి, నువ్వు నాగురించి పట్టించుకోవడం మానేసావేేమో అనుకున్నాను. కానీ అది నిజం కాదని, కనీసం ఇలాంటి విషాద సమయాల్లోనైనా నువ్వు నాకు ఓ సంతాప వాక్యం రాయగలుగుతున్నావంటే, నువ్వు నన్ను పూర్తిగా మర్చిపొలేదని అర్ధమౌతుంది. 

*నేనూ నా భార్యా.. బిడ్డను కోల్పోయిన విషాదం నుంచి కోలుకున్నామని చెప్తే అది అబద్ధమే ఔతుంది. బహుశా అదెప్పటికీ జరగదేమో కూడా. ఇప్పటివరకూ మేము నలుగురు పిల్లలను సమాధిచేసాము. ఒక కూతురు, ముగ్గురు కొడుకులు, అందరూ నిజానికి చాలా చక్కటి అందమైన, ఆరోగ్యమైన బిడ్డలే* వాళ్ళు హాయిగా జీవించాల్సిన రేపటిసంగతి అలా ఉంచితే, వీళ్ళను బతికించుకోలేకపోయామన్న ఆలోచనే గుండెను పిండేసేదిగా ఉంటుంది. 


మా రోజులు మబ్బులుసాగినట్టుగా నిశ్శభ్దంగా సాగిపోతున్నాయనడంలో సందేహంలేదు.

మా బిడ్డల మరణాలతో మేము మా జీవితపు రుచినే కోల్పోయాం.

ఈ వాక్యాల్లోని నిజాన్ని నా శూన్యం నిండిన ఈ జీవితపు ప్రతీ క్షణమూ అనుభవిస్తున్నాను. 

నా ఆఖరి కొడుకు చాలా చక్కటివాడు, నేనలాంటి బిడ్డను ఎక్కడా చూడలేదు. వాడు పోవడంతో నాజీవితం ఇకపై  కలుపుమొక్కలతో నిండిన తోటలాంటిదే. సరే ఇక ముగిస్తాను. దుఖ్ఖం కమ్ముకొస్తుంది. ఇకరాయలేను.

        అన్నీ పోగొట్టుకున్నవాడి 

శుభాశీస్సులతో.. మీ.. Br. అంబేద్కర్.

(బాబాసాహెబ్ రెండో కుమారుడు గంగాధర్ చనిపోయినప్పుడు)

" నాకు రెండవ కొడుకు గంగాధర్ పుట్టాడు.చూడటానికి చాలా అందమైన వాడు.

అతను ఆకస్మాత్తుగా జబ్బుపడ్డాడు.వైద్యం కోసం అవసరమైన డబ్బులు లేవు అతని ఆనారోగ్యంతో ఒక్కసారి నా మనసు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఊగిసలాటలో పడింది. తిరిగి నాకు ఇలా ఆలోచన వచ్చింది. ఒకవేళ నేను ఉద్యోగం చేసినట్లయితే 7కోట్ల అంటరానివాళ్ళ గతి ఏమవుతుంది వాళ్ళు గంగాధర్ కంటే తీవ్ర అనారోగ్యం పాలయిఉన్నారు.      

 సరైన వైద్యం చేయించని కారణంగా ఆ పసివాడు రెండున్నర సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. వీధిలోని  జనం వచ్చారు అందరు పిల్లవాడి మృతదేహాన్ని కప్పేందుకు కొత్త గుడ్డ తీసుకురమ్మన్నారు.  తీసుకు రావడానికి నా దగ్గర డబ్బులు లేవు చివరికి నా ప్రియమైన భార్య తన చీర నుంచి ఒక ముక్క చించింది. ఆ చీర ముక్క పిల్లవాడి మృతదేహంపై కప్పి జనం స్మశానానికి తీసుకెళ్లారు.తర్వాత భూమిలో మృతదేహాన్ని పాతిపెట్టారు. అలాంటిది నా ఆర్థిక పరిస్థితి. అలాంటి కఠినమైన కడుపేదరికపు రోజుల్ని నేను చూశాను. అలాంటి కఠినమైన అనుభవాలు ఏ నాయకుడికి ఎదురుకాకూడదు."

      🙏🙏 జై భీమ్ 🙏🙏

  మనకోసం తన కుటుంబాన్ని, తన జీవితాన్ని, తన సర్వసాన్ని త్యాగం చేసిన అంబేద్కర్ ని మించిన దేవుడు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి ఆలోచించండి.🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Keybord shortcuts

 కంప్యూటర్   ఉపయోగిస్తూన్నారా   ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన   ఆపరేటింగ్  వర్డ్స్ CTRL+A. . . . . . . . . . . . . . . . . Select All CTRL+C. . ...