1,03,800 కోట్లు - "ఒక లక్షా మూడు వేల ఎనిమిది వందల కోట్లు" . ఇదంతా దళితుల డబ్బు..
ఈ నంబర్ చూశాక నాకు దిమ్మ తిరిగింది. మనం ఇంత అవగాహన లోపంతో ఎలా బ్రతుకుతున్నాం అనిపిస్తుంది.
ఇక అసలు విషయానికొస్తే మీకో మూడు కథలు చెప్పాలి.
1. సుభాష్ గ్రోవర్, ఢిల్లీలో క్రేన్ల వ్యాపారి. ఆయన ఒక దళితుడు. ఆయనకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. దానిని పూర్తి చేయడానికి 15 శాతం వడ్డీతో ఒక కన్సార్షియమ్ వద్ద 5 కోట్లు అప్పుగా తీసుకున్నాడు.
2005 లో ప్రారంభమైన ఆ కంపెనీ 2015 వరకు అప్పులపై కట్టిన వడ్డీ 10 కోట్లు.
2. ఇంకో వ్యాపారి పేరు ఎన్ కె చందన్. ఆయన వ్యాపారానికి ఒక ప్రయివేట్ కంపెనీ వద్ద 36 శాతం వడ్డీతో అప్పు తీసుకున్నాడు. ఇప్పటిదాకా ఆయన కట్టిన వడ్డీ 5 కోట్లు. ఈయన కూడా దళితుడు.
3. అహ్మదాబాద్ కేంద్రంగా నడిచే ప్లాస్టిక్ కంపెనీ రతిబాయ్ మక్వానా ట్రేడ్స్ సంవత్సరానికి కట్టే వడ్డీ 7 కోట్లు..
ఇదంతా ప్రభుత్వ రంగ బ్యాంక్ లు దళిత వ్యాపారులకు భారీ స్థాయిలో అప్పు ఇవ్వడానికి తిరస్కరించిన తరుణంలో వ్యాపార అభివృద్ధి కోసం దళిత వ్యాపారులు, ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థల దగ్గర అధిక వడ్డీకి అప్పు తీసుకుంటున్న వైనం చిట్టా ఇది.
ఈ చాంతాడు పెద్దది.
సంస్కరణల యుగం వచ్చాక కూడా, ఇప్పటికీ ప్రభుత్వాలు దళితులను ఆహారం మరియు ఉద్యోగాలు మాత్రమే కోరుకునే వారిగా చూస్తున్నారు.
చిన్న చితక పరిశ్రమలతో దళితులు, దళితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి లేకుండా పోయింది.
కారణం కుల స్వభావానికి అతీతం కాని బ్యాంకులు యాజమాన్యాలు కూడా ఇప్పటికీ దళితులకు లోన్లు ఇవ్వాలంటే జంకుతాయి.
లక్ష రూపాయలు ఇచ్చే ఎస్సీ కార్పొరేషన్స్ లోన్లకే లక్ష ప్రశ్నలు వేసే బ్యాంకులు కోట్ల రూపాయలు ఇవ్వమంటే ఇస్తాయా!
రైతులకు 4.5 % తో ఇచ్చే పంట రుణాలను (మాఫీ చేసే అవకాశం ఉంది) అటువంటి పెట్టుబడి స్వభావమే ఉన్న దళిత వ్యాపార వేత్తలకు 8 % వడ్డీతో ఇవ్వడమేంటి?
ఇటువంటి వైఖరి వల్లనే దళితుల్లో భారత దేశం నుండి ఒక్క బిలియనీర్ కూడా లేడు.
ఇక అతి ముఖ్యమైన విషయం.
లక్షా మూడు వేల ఎనిమిది వందల కోట్లు. ఎక్కడిది ఈ డబ్బంతా అంటే
ఆది దళిత ఫౌండేషన్ వారి అధ్యయనం ప్రకారం
1. పబ్లిక్ సెక్టార్ లలో 2 లక్షలకు పైగా పనిజేస్తున్న కేంద్ర ప్రభుత్వ దళిత ఉద్యోగులందరికీ కలిపి సంవత్సరానికి వచ్చే జీతం విలువ
17, 451 కోట్లు (పదిహేడు వేల నాలుగు వందల యాభై ఒక కోట్లు)
2. కాలేజీ / వర్సిటీలలో పని చేస్తున్న 1.1 లక్షల దళిత అధ్యాపకులందరి జీతం విలువ సంవత్సరానికి -
14, 600 కోట్లు (పద్నాలుగు వేల ఆరు వందల కోట్లు)
3. 1.7 లక్షల అధ్యాపకేతర దళిత సిబ్బంది అందరి జీతం కలిపి సంవత్సరానికి
8,200 కోట్లు.. (ఎనిమిది వేల రెండు వందల కోట్లు)
4. దేశమంతా ప్రాధమిక విద్యా టీచర్లుగా ఉన్న 9.27 లక్షల దళిత టీచర్ల జీతమంతా కలిపితే ఒక్క సంవత్సరానికి వచ్చే మొత్తం
55,600 కోట్లు (యాభై ఐదు వేల ఆరు వందల కోట్లు)
5. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో పని చేస్తున్న 1.27 లక్షల మంది దళిత ఉద్యోగుల సంవత్సర జీతం మొత్తం కలిపితే దాని విలువ
8,016 కోట్లు (ఎనిమిది వేల పదహారు కోట్లు)
మొత్తం కలిపితే 1, 03, 800 కోట్లు
ఒక లక్షా మూడు వేల ఎనిమిది వందల కోట్లు.
ఇందులో 1 శాతం అంటే,
1038 కోట్లు
ఒక వెయ్యి ముప్పై ఎనిమిది కోట్లు (తప్పైతే సరి చేసుకుంటాను)
దళిత ఉద్యోగులంతా కలిసి తమ సంపాదనలో ఒక్క శాతం తో 1038 కోట్ల రూపాయలతో మీరే ఒక బ్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు.
తద్వారా దళిత వ్యాపారులకు, ఆ బ్యాంక్ ద్వారా తక్కువ వడ్డీలకే రుణాలు, ఇవ్వొచ్చు. సుభాష్ గ్రోవర్ లా కోట్ల రూపాయల వడ్డీ కట్టే భాధ తప్పించుకోవచ్చు.
పరిశ్రమల ద్వారా కొందరికైనా ఉపాధి కల్పించొచ్చు.
ఒక బిలియనీర్ ను కూడా తయారు చెయ్యొచ్చు.
దళిత రాజకీయ నాయకుల కంటే, దళిత వ్యాపారవేత్తలే కొంతైనా మార్పు తేగలరు. ఇంత డబ్బు జెనెరేట్ చేస్తున్న దళిత మధ్య తరగతి జీవులు ఈ బ్యాంక్ గురించి ఆలోచించాలి.
"దళితులకు వ్యాపారం, అంటార్కిటికా లో బూట్లు, గ్లవ్లు లేకుండా చేపలు పట్టినట్టు ఉంది" .
ఈ మాట అన్నది చంద్ర భాన్ ప్రసాద్. పైన రాసిన వివరాలన్నీ ఆయన రాసిన " Fellow Dalits open your own bank" ఆర్టికల్ లోనివి.
ఆ ఆర్టికల్ కు ఈ వివరణ చిన్న స్వేచ్ఛానువాదం. (informal translation)
ఒక లక్షా మూడు వేల ఎనిమిది వందల కోట్లు అంటే చిన్న మాటా?
ఇకనైనా ఈ వైపుగా ఆలోచన చేయాలి.
చంద్ర భాన్ ప్రసాద్ డిక్కీ (Member) అని తెలిసింది.
ఆయన ప్రాధాన్యాలు తెలియదు కానీ అంకెలు మాత్రం పెద్ద చర్చకు తెర తీశాయి.
మరి ఎప్పుడు పెట్టుకుంటున్నారు బ్యాంక్ దళిత ఉద్యోగులారా!
కొందరైనా చిన్న చిన్న సమూహాలుగా ఆలోచిస్తారని ఈ చిన్న అనువాదం చేసాను.
అన్నట్టు అంకెలు చూడగానే
ఏపీ ప్రభుత్వం ప్రచార హోర్డింగ్ లలో ఏర్పాటు చేసిన డైలాగ్ గుర్తుకు వస్తుంది. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కు ఉన్న తేడా చూపిస్తూ
"అంకెలు అబద్ధాలు చెప్పవు" అంటూ ఉంటుంది ఆ డైలాగ్.
నాకు కూడా అనిపించింది. నిజమే దారి మళ్లించిన ఎస్సీ సంక్షేమ నిధులు కోట్ల రూపాయలు అబద్ధాలు చెప్పవు గా...
మన అంకె 1038 కోట్లు
ఎప్పుడు మొదలెడతారో దళిత ఉద్యోగులు...........
.
జైభీం జై స్వేరో. జై భారత్...
నేను ఎవ్వరికంటే తక్కువ కాదు...Dr. Dr. R.S.praveen kumar IPS IG ....
No comments:
Post a Comment